iDreamPost
android-app
ios-app

వీడియో: స్టేజిపై కొడుకును మందలించిన రెహ్మాన్‌!

  • Published Aug 24, 2023 | 1:22 PM Updated Updated Aug 24, 2023 | 1:22 PM
  • Published Aug 24, 2023 | 1:22 PMUpdated Aug 24, 2023 | 1:22 PM
వీడియో: స్టేజిపై కొడుకును మందలించిన రెహ్మాన్‌!

ప్రపంచ సంగీత ప్రియులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని పేరు ఏఆర్‌ రెహ్మాన్‌. భారత సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన వారిలో రెహ్మాన్‌ కూడా ఒకరి అని చెప్పుకోవటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన తన సంగీతంతో సినిమా ప్రేక్షకులను  దాదాపు 30 ఏళ్లుగా మైమరిపిస్తున్నారు. ట్రెండ్‌ ఫాలో అవ్వని ఆయన నైజంతో సంగీత ప్రపంచంలో మకుటం లేని మహారాజులా మారారు. దేశం గర్వించేలా రెండు ఆస్కార్‌లను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు.

ఇక, రెహ్మాన్‌ బాటలోనే ఆయన కుమారుడు ఏఆర్‌ అమీన్‌ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2009లో ప్లేబ్యాక్‌ సింగర్‌గా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మరాటీ, మలయాళ భాషల్లో ఆయన పాటలు పాడుతున్నారు. తాజాగా, సూపర్‌ హిట్‌ తమిళ చిత్రం ‘మామన్నన్‌’లోనూ ఓ పాట పాడారు. ఓ వైపు సినిమాల్లో పాటలు పాడుతూనే తండ్రితో పాటు కన్సర్ట్‌లలో పాల్గొంటున్నారు. ఆగస్టు 20న కోయంబత్తూరులో జరిగిన ఏఆర్‌ రెహ్మాన్‌ కన్సర్ట్‌లో ఏఆర్‌ అమీన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. రెహ్మాన్‌ స్టేజిపై అందరిముందు తన కుమారుడ్ని నవ్వుతూ మందలించారు.

అమీన్‌ స్టేజిపైకి ఎక్కగానే కొద్దిగా భయపడుతూ ఉన్నాడు. అది గమనించిన రెహ్మాన్‌ కొడుకును చూస్తూ ‘‘ భయంగా ఉందా? లేక సిగ్గుగా ఉందా? అమ్మాయిలందరూ చూస్తూ ఉన్నారు’’ అని అన్నాడు. ఇందుకు అమీన్‌ సమాధానం ఇస్తూ ఇంగ్లీష్‌లో మాట్లాడాడు. ఇది రెహ్మాన్‌కు నచ్చలేదు. ‘తమిళంలో మాట్లాడు నాయన!’ అని అ‍న్నాడు. దీంతో అక్కడున్న వారు ఒక్కసారిగా పగలబడి నవ్వారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఆ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetMadridbetMadridbetMadridbetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş