iDreamPost
android-app
ios-app

స్టార్ హీరోతో హీరోయిన్ డేటింగ్! కూతురి రిలేషన్ పై తండ్రి షాకింగ్ కామెంట్స్

  • Author Soma Sekhar Published - 10:04 PM, Fri - 4 August 23
  • Author Soma Sekhar Published - 10:04 PM, Fri - 4 August 23
స్టార్ హీరోతో హీరోయిన్ డేటింగ్! కూతురి రిలేషన్ పై తండ్రి షాకింగ్ కామెంట్స్

సినిమా ఇండస్ట్రీలో డేటింగ్ రూమర్స్ కు కొదవుండదు. ఒక సినిమాలో కలిసి నటించిన నటీ, నటులు ఏదైనా హోటల్లో, వీధుల్లో కనిపిస్తే చాలు వారిద్దరు ప్రేమలో ఉన్నారంటూ కోడై కూస్తుంది ఈ సమాజం. ప్రస్తుతం ఓ హీరోయిన్ పేరు ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది. దానికి కారణం ఈ అమ్మడు ఓ స్టార్ హీరోతో డేటింగ్ లో ఉందంటూ బీ టౌన్ లో పెద్ద ఎత్తున రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు లైగర్ భామ అనన్య పాండే. అవును అనన్య పాండే బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ తో పీకల్లోతుల్లో ప్రేమలో ఉందంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున న్యూస్ వైరలైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు అనన్య పాండే తండ్రి చంకీ పాండే.

అనన్య పాండే.. ప్రస్తుతం బీ టౌన్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. దానికి కారణం ఈ అమ్మడు హీరో ఆదిత్య రాయ్ కపూర్ తో ప్రేమలో ఉందన్న వార్తలు రావడమే. గత నెలలో ఈ జంట పోర్చుగల్ ట్రిప్ కు వెళ్లగా.. అక్కడి వీధుల్లో, రెస్టారెంట్లలో దిగిన ఫోటోలు కాస్తా నెట్టింట దర్శనమిచ్చాయి. దాంతో వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా స్పందించాడు అనన్య పాండే తండ్రి చంకీ పాండే. తన కూతురి రిలేషన్ పై పలు షాకింగ్ కామెంట్స్ చేశాడు.

అనన్య తండ్రి మాట్లాడుతూ..”ఇండస్ట్రీలో నటీ, నటుల జీవితంలో డేటింగ్ రూమర్స్ రావడం అనేది సహజం. ఇది గ్లామర్ వృత్తి. ఇలాంటివన్నీ జరగాల్సిందే, రూమర్స్ రావాల్సిందే. అయితే ఇది కెరీర్ కు నష్టం కలిగించనంత వరకు ఒకే. పైగా వీటిని మనం ఆపలేం. ఇక అనన్య ఎంతో మంది హీరోలతో అద్భుతంగా నటించింది. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ లో టైగర్ ష్రాఫ్ తో, ‘పతి పత్నీ ఔర్ వో’ లో కార్తీక్ ఆర్యన్ తో సినిమాలు చేసింది. ఈ విషయంలో నేను ఎవ్వరినీ వ్యతిరేకించను. ఇక తనకు నేను చెప్పింది ఒక్కటే.. నా కంటే గొప్పగా ఉండాలని” అంటూ చెప్పుకొచ్చాడు అనన్య తండ్రి చంకీ పాండే.

కాగా.. అనన్య సూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది అనన్య. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో.. వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. తెలుగులో సైతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన లైగర్ మూవీలో మెరిసింది. ప్రస్తుతం అనన్య ఆయుష్మాన్ ఖురానాతో ‘డ్రీమ్ గర్ల్’ సీక్వెల్ కోసం సిద్దమవుతోంది. ఆ తర్వాత డైరెక్టర్ విక్రమాదిత్య మోత్వానే డైరెక్షన్ లో ఓ థ్రిలర్ మూవీలో నటించనుంది. మరి అనన్య పాండే డేటింగ్ పై తండ్రి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న ఈ నగరానికి ఏమైంది యాడ్ చిన్నారి!

Jojobet GirişmeritbetmarsbahisHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibomromabet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet giriş