iDreamPost
android-app
ios-app

వీడియో: అమృత ప్రణయ్ తో హీరో కార్తికేయ లవ్లీ డాన్స్!

  • Published Aug 28, 2023 | 5:00 PM Updated Updated Aug 28, 2023 | 5:00 PM
  • Published Aug 28, 2023 | 5:00 PMUpdated Aug 28, 2023 | 5:00 PM
వీడియో: అమృత ప్రణయ్ తో హీరో కార్తికేయ లవ్లీ డాన్స్!

అమృత ప్రణయ్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. తన భర్తను కన్నతండ్రే కిరాయి గూండాలతో హత్య చేయించాడు. ఆ బాధ తట్టుకోలేక తల్లిదండ్రులకు ఇద్దరికీ ఆమె దూరమైంది. ఆ తర్వాత తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు. దాదాపు ఆరేళ్ల తర్వాత ఇటీవల అమృత ప్రణయ్ తన కన్నతల్లిని కలుసుకుంది. అమృత సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వ్లాగ్స్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటూనే ఉంటుంది. అలాగే ఈ మధ్య ప్రమోషన్స్ కూడా చేస్తోంది. అందులో భాగంగానే హీరో కార్తికేయతో ఒక సాంగ్ కు డాన్స్ చేసింది.

అమృత ప్రణయ్ సెలబ్రిటీగా మారిపోయిన విషయం అందరికీ తెలిసిందే. వ్లాగ్స్ మాత్రమే కాకుండా ప్రమోషన్స్ కూడా చేస్తోంది. గతకొంతకాలంగా సినిమా ప్రమోషన్స్ అన్నీ ఫేమస్ యూట్యూబర్స్, మీమర్స్, సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్స్ తోనే చేస్తున్నారు. అలాగే కార్తికేయ నటించిన బెదురులంక 2012 సినిమా ఆగస్టు 25న విడుదలైన విషయం తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే హీరో కార్తికేయ అమృత ప్రణయ్ తో కలిసి తన సినిమాలో ఉన్న వెన్నెల్లో ఆడపిల్ల పాటకు డాన్స్ చేశాడు. ఈ డ్యూయట్ కు హీరో కార్తికేయతో కలిసి అమృత ప్రణయ్ డాన్సుతో ఆకట్టుకుంది. అమృత- కార్తికేయ డాన్సుకు ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సెలబ్రిటీలు కూడా ఫిదా అయిపోయారు. డాన్సు ఇరగదీశారంటూ వారిని మెచ్చేసుకుంటున్నారు. ఆ డాన్స్ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Amrutha 🕊️ (@amruthapranay)

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetelitcasinofixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet