iDreamPost
android-app
ios-app

తగ్గేదేలే.. విడుదలకు ముందే ‘పుష్ప 2’ ఆలిండియా రికార్డు!

  • Author Soma Sekhar Published - 09:52 PM, Sat - 12 August 23
  • Author Soma Sekhar Published - 09:52 PM, Sat - 12 August 23
తగ్గేదేలే.. విడుదలకు ముందే ‘పుష్ప 2’ ఆలిండియా రికార్డు!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం ‘పుష్ప’. ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో భారీ సక్సెస్ సాధించింది. ఇక ఈ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న ‘పుష్ప2’ చిత్రంతో మరిన్ని రికార్డులు తిరగరాయాలని అనుకుంటున్నాడు అల్లు అర్జున్. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీని తీర్చిదిద్దుతున్నాడు డైరెక్టర్ సుకుమార్. ఇక ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలోన విడుదలకు ముందే ఆల్ ఇండియా రికార్డును సాధించింది పుష్ప 2 మూవీ. మరి ఐకాన్ స్టార్ సాధించిన ఆ రికార్డు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఈ సంవత్సరం వచ్చిన ది బెస్ట్ ఫస్ట్ లుక్ ఏదంటే? కచ్చితంగా పుష్ప2 లో అల్లు అర్జున్ లుక్ అనే చెప్తారు. అంతలా ఆ పోస్టర్ మూవీ లవర్స్ ను మెస్మరైజ్ చేసింది. శక్తి స్వరూపిణిగా, పూల దండ, నిమ్మకాయల దండ, చేతి నిండా గాజులు, చేతిలో గన్ తో ఉన్న బన్నీ గెటప్ కు ఫిదా కానీ ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తికాదు. ఇక ఈ పోస్టర్ ఒక్క టాలీవుడ్ లోనే కాక దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది. తాజాగా ఈ పోస్టర్ ఆలిండియా రికార్డును నమోదు చేసింది. ఆ రికార్డు ఏంటంటే? ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక లైక్స్ పొందిన ఫస్ట్ లుక్ పోస్టర్ గా ఐకాన్ స్టార్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకు ఈ పోస్టర్ ఇన్ స్టాగ్రామ్ లో 7 మిలియన్ల లైక్స్ ను కంప్లీట్ చేసుకుని దూసుకెళ్తోంది.

ఈ మేరకు పుష్ప టీమ్ శనివారం సోషల్ మీడియా ద్వారా ఓ ప్రకటన చేసింది. ఇది ఆల్ టైమ్ నేషనల్ వైడ్ రికార్డు అని చిత్ర యూనిట్ తెలిపింది. తమ అభిమాన హీరో ఆలిండియా రికార్డు సాధించడంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు బన్నీ ఫ్యాన్స్. విడుదలకు ముందే ఇలా రికార్డులు బద్దలు కొడితే.. ఇక సినిమా విడుదలైతే మరెన్ని రికార్డులు కొల్లగొడుతుందోనని చర్చించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మరికొన్ని రికార్డులు బన్నీ ఖాతాలో వేస్తామని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. మరి ఐకాన్ స్టార్ ఆలిండియా రికార్డు సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదికూడా చదవండి: ఆమె ఇద్దరు పిల్లల తల్లి అంటూ.. అభిమానిపై మండిపడ్డ షారుఖ్ ఖాన్!

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbabilonbet girişgrandpashabet