iDreamPost
android-app
ios-app

ఫ్యాన్స్ కు షాకిచ్చిన కొరటాల.. Jr. NTRకు తల్లిగా స్టార్ హీరోయిన్!

  • Author Soma Sekhar Published - 03:13 PM, Mon - 25 September 23
  • Author Soma Sekhar Published - 03:13 PM, Mon - 25 September 23
ఫ్యాన్స్ కు షాకిచ్చిన కొరటాల.. Jr. NTRకు తల్లిగా స్టార్ హీరోయిన్!

కథలో కంటెంట్ బాగుంటే చాలు ఎలాంటి క్యారెక్టరైనా చేయడానికి సిద్దమవుతున్నారు నటీ, నటులు. ప్రస్తుతం టాలీవుడ్ కొత్త కొత్త ప్రయోగాల వైపు అడుగులు వేస్తోంది. నటీ, నటులు సైతం మేకర్స్ ఆలోచనలకు తగ్గట్లుగానే పాత్రలు చేసేందుకు సిద్దమవుతున్నారు. కాగా.. ఒకప్పుడు తమ అందచందాలతో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన హీరోయిన్స్ తమ సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం అత్త, అమ్మ, వదిన క్యారెక్టర్లు చేస్తూ.. రాణిస్తున్నారు. తాజాగా ఇదే కోవలోకి స్టార్ హీరోయిన్ రాబోతున్నట్లు సమాచారం. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న దేవర సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు అమ్మగా ఓ స్టార్ హీరోయిన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ హీరోయిన్ గతంలో ఎన్టీఆర్ తో ఓ సినిమాలో జంటగా నటించడం గమనార్హం.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘దేవర’ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే? దేవర మూవీలో ఎన్టీఆర్ చిన్నప్పటి క్యారెక్టర్ కు అమ్మ పాత్రలో స్టార్ హీరోయిన్ ప్రియమణి నటిస్తుందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా.. గతంలో యమదొంగ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడీగా నటించింది ప్రియమణి. ఇప్పుడు అతడికి తల్లి పాత్రలో నటిస్తుందన్న వార్త వైరల్ గా మారింది. కాగా.. ఇటీవలే జవాన్ మూవీలో మెరిసింది ఈ బ్యూటీ. కొన్ని రోజుల క్రితం బుల్లితెరపై సందడి చేసింది ప్రియమణి. పలు షోలతో పాటుగా వెబ్ సిరీస్ లు కూడా చేసి అందరిని అలరించింది. దేవర కోసం డైరెక్టర్ కొరటాల శివ తీసుకున్న ఈ నిర్ణయం ఫ్యాన్స్ ను ఒక్కసారిగా షాక్ కు గురిచేసిందనే చెప్పాలి. అయితే ఓ హీరోకి జోడీగా నటించి, తల్లిగా, చెల్లిగా నటించిన సంఘటనలు చరిత్రలో చాలానే ఉన్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio