iDreamPost
android-app
ios-app

బాలీవుడ్ పై Jr. NTR హీరోయిన్ సంచలన కామెంట్స్!

  • Author Soma Sekhar Updated - 03:56 PM, Mon - 2 October 23
  • Author Soma Sekhar Updated - 03:56 PM, Mon - 2 October 23
బాలీవుడ్ పై Jr. NTR హీరోయిన్ సంచలన కామెంట్స్!

ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు మూవీల కంటే వారు చేసే కామెంట్స్ తోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. తాను బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తే.. బట్టలిప్పించే వారని షాకింగ్ కామెంట్స్ చేసింది ఈ అమ్మడు. అయితే ఈ బ్యూటీ ఇలాంటి కామెంట్స్ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో బాలీవుడ్ డైరెక్టర్ పై కూడా మీటూ ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచింది. దీంతో ఈ ముద్దుగుమ్మ సినిమాలతో కంటే కాంట్రవర్సీలతోనే ఎక్కువగా వార్తల్కలో ఉంటుందనే పేరొందింది.

పాయల్ ఘోష్.. ప్రయాణం, ఊసరవెల్లి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే ఈ సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో.. తెలుగులో ఎక్కువ సినిమాలు చేయలేకపోయింది. దీంతో హిందీ సీరియల్స్, బాలీవుడ్ అంటూ అటు వైపు అడుగులు వేసింది. గతంలో పాయల్ మీటూ ఉద్యమంలో భాగంగా స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పై లైంగిక ఆరోపణలు చేసి.. ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. అదీకాక జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు, మీరా చోప్రాకు సోషల్ మీడియా వేదికగా జరిగిన వార్ లో ఎన్టీఆర్ కు, అతడి ఫ్యాన్స్ కు మద్దతుగా ట్వీట్స్ చేసింది.

ఇక ఇదే టైమ్ లో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అవుతాడని కూడా చెప్పింది. ఇదిలా ఉండగా.. తాజాగా మరోసారి తన షాకింగ్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచింది. మరోసారి బాలీవుడ్ పై సంచలన ఆరోపణలు చేసింది. సౌత్ ఇండస్ట్రీని పొగుడుతూ.. బాలీవుడ్ ను ఏకిపారేసింది. ట్వీట్టర్ వేదికగా “ఆ దేవుడి దయవల్ల నేను సౌత్ ఇండస్ట్రీ నుంచి లాంచ్ అయ్యాను. ఒకవేళ నేను బాలీవుడ్ నుంచి లాంచ్ అయ్యిఉంటే.. వారు నా బట్టలిప్పించేవారు. బాలీవుడ్ లో అమ్మాయిల క్రియేటివిటీ, టాలెంట్ కంటే.. వారి శరీరాలనే వాడుకుంటారు” అంటూ రాసుకొచ్చింది. పాయల్ ఘోష్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మరి పాయల్ చేసిన ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet