iDreamPost
android-app
ios-app

‘నువ్వు-నేను’ హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్.. దారులన్నీ మూసుకుపోయాయంటూ..!

  • Author Soma Sekhar Published - 04:33 PM, Wed - 27 September 23
  • Author Soma Sekhar Published - 04:33 PM, Wed - 27 September 23
‘నువ్వు-నేను’ హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్.. దారులన్నీ మూసుకుపోయాయంటూ..!

హీరోయిన్ అనిత.. అంటే చాలా మందికి తెలీదు. కానీ హీరో ఉదయ్ కిరణ్ నటించిన నువ్వు-నేను హీరోయిన్ అంటే వెంటనే గుర్తు పట్టేస్తారు. ఈ మూవీతో అంతలా క్రేజ్ సంపాదించుకుంది ఈ అమ్మడు. నువ్వు-నేను సూపర్ హిట్ కావడంతో.. మంచి అవకాశాలే దక్కాయి అనితకు. ఈ మూవీ తర్వాత తరుణ్ తో ‘నిన్నే ఇష్టపడ్డాను’ సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్ లో తొట్టిగ్యాంగ్, నేను పెళ్లికి రెడీ, ముసలోడికి దసరా పండగ లాంటి పలు సినిమాల్లో నటించింది. కానీ అవి కమర్షియల్ గా సక్సెస్ కాకపోవడంతో ఈమెకు గుర్తింపును తీసుకురాలేకపోయాయి. ఇక 2003లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనిత.. 2014లో బిజినెస్ మెన్ రోహిత్ ను పెళ్లి చేసుకుని నటనకు దూరం అయ్యింది. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ ఆమె వార్తల్లో నిలిచింది. దానికి కారణం ఆమె సోషల్ మీడియాలో చేసిన ఓ ఎమోషనల్ పోస్టే.

ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన నవ్వు-నేను సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న హీరోయిన్ అనిత.. ఆ తర్వాత అనుకున్నంతగా పేరు సంపాదించుకోలేకపోయింది. ఇక తన అదృష్టాన్ని బాలీవుడ్ లో కూడా పరీక్షించుకుని.. 2014లో వ్యాపారవేత్త రోహిత్ ను పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయిన ఈ అమ్మడు.. బుల్లితెరపై సందడి చేసింది. హిందీలో సీరియల్స్, టీవీ షోలతో అభిమానులకు దగ్గరైంది. వీటితో పాటుగా పలు యాడ్స్ లో నటించింది కూడా. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో తాజాగా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

అనిత తన ఇన్ స్టాగ్రామ్ లో.. “ఈ రోజు నేను చేసిన ఈ పోస్ట్.. నా జీవిత ప్రయాణానికి గుర్తు. ఆ టీనేజ్ డేస్ ఇంకా గుర్తే ఉన్నాయి. ఒక సాధారణ మధ్య తరగతి అమ్మాయిగా నా కలలను డైరీలో రాసుకున్నాను. కానీ అప్పుడే నా జీవితంలో ఓ విషాదం చోటుచేసుకుంది. నేను నా హీరోని.. నా తండ్రిని కోల్పోయాను. ఆ టైమ్ లో నా దారులన్నీ మూసుకుపోయాయి. కానీ నేను వాటికి బెదరలేదు. వాటిని అధిగమించి నా ఫ్యామిలీ కోసం నిలబడ్డాను. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను” అంటూ ఎమోషనల్ పోస్ట్ రాసుకొచ్చింది అనిత. ప్రస్తుతం వివాహ బంధాన్ని ఎంజాయ్ చేస్తున్నానని, నా కుటుంబం, నా పిల్లలే నా ప్రపంచం అని చెప్పుకొచ్చింది హీరోయిన్ అనిత. కాగా.. తన లైఫ్ ఇంత హ్యాపీగా మారినందుకు తనకు తానే రుణపడి ఉంటానని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మరి తండ్రిని తలచుకుని ఎమోషనల్ పోస్ట్ చేసిన హీరోయిన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Anita H Reddy (@anitahassanandani)

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş