iDreamPost
android-app
ios-app

87 ఏళ్ల వయసులో స్టార్ నటుడు లిప్ లాక్ సీన్! రొమాన్స్ కు వయసుతో పనేంటంటూ..!

  • Author Soma Sekhar Published - 09:47 PM, Sat - 29 July 23
  • Author Soma Sekhar Published - 09:47 PM, Sat - 29 July 23
87 ఏళ్ల వయసులో స్టార్ నటుడు లిప్ లాక్ సీన్! రొమాన్స్ కు వయసుతో పనేంటంటూ..!

అతడి వయసు 87 సంవత్సరాలు. ఇండియన్ సినిమా చరిత్రలో అతడి పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తికాదేమో. ఇప్పటి వరకు దాదాపు 300కి పైగా చిత్రాల్లో నటించి, లెజెండరీ యాక్టర్ గా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నాడు. నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా అన్ని రంగాల్లోనూ ఇతర నటుల కంటే ఒక అడుగు ముందే ఉంటాడు ఈ దిగ్గజ నటుడు. ఇక ఈ లెజెండరీ యాక్టర్ తాజాగా నటించిన సినిమాలో అలనాటి అందాల తారతో లిప్ లాక్ సిన్ లో నటించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇక ఈ సీన్ చూసిన ప్రేక్షకులు 87 ఏళ్ల వయసులో ఇవేం పనులు అంటూ విమర్శిస్తున్నారు. ఈ విమర్శలపై తనదైన శైలిలో స్పందించాడు బాలీవుడ్ స్టార్ ధర్మేంద్ర.

ధర్మేంద్ర.. ఆరు దశాబ్దాల బాలీవుడ్ ప్రస్థానంలో తిరుగులేని యాక్టర్ గా వెలుగొందారు. ఇప్పటికే సినిమాలు చేస్తూ.. తనలో ఇంకా చావ తగ్గలేదని నిరూపిస్తూ వస్తున్నాడు. ఇప్పటి వరకు సుమారు 300కు పైగా చిత్రాలు చేశారు ధర్మేంద్ర. తాజాగా ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని’ సినిమాలో నటించారు. జూలై 28న విడుదలైన ఈ చిత్రానికి కరణ్ జోహార్ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఈ మూవీలో లిప్ లాక్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలో ధర్మేంద్ర, అలనాటి అందాల తార షబానా అజ్మీ.. లిప్ లాక్ సీన్ లో నటించారు. 87 ఏళ్ల వయసులో లిప్ లాక్ సీన్ ఏంటి అంటూ చూసిన వారందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. మరికొందరు ముసలోడికి దసరా పండగ అంటూ రకరకాలుగా విమర్శిస్తూ.. కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా ఈ విమర్శలపై, లిప్ లాక్ పై స్పందించాడు లెజెండరీ యాక్టర్. ధర్మేంద్ర మాట్లాడుతూ..”చాలా మంది మా లిప్ లాక్ గురించే మాట్లాడుకుంటున్నంటున్నారు. నేను, షబానా లిప్ లాక్ తో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేశామనుకుంటా. మా నుంచి ఈ సీన్ అస్సలు ఊహించి ఉండరు. ఇక నేను ఇంతకు ముందు లైఫ్ ఇన్ ఎ మెట్రో అనే మూవీలో నఫీసా అలీతో ముద్దు సీన్ లో నటించాను. అప్పుడు కూడా ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. ఇక ఈ మూవీలో కిస్ సీన్ గురించి డైరెక్టర్ మాకు ముందుగానే చెప్పాడు. ఈ సినిమాకు అది అవసరం అనిపించింది. అందుకే చేశాం” అంటూ చెప్పుకొచ్చాడు లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర.

ఇక ఈ సీన్ గురించి డైరెక్టర్ కరణ్ జోహార్ చెప్పినప్పుడు నేను సర్ఫ్రైజ్ కాలేదని తెలిపారు ధర్మేంద్ర. అయినా రొమాన్స్ కు వయసుతో సంబంధం ఏంటి? అంటూ ప్రశ్నించాడు. ఏజ్ అనేది జస్ట్ నంబర్ మాత్రమే అంటూ.. ఏ వయసు వారైనా తమ మధ్య ప్రేమను ముద్దు ద్వారానే బయటపెడతారు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇక ఈ సీన్ లో నటించేటప్పుడు నేను, షబానా ఏమాత్రం ఇబ్బంది పడలేదని చెప్పుకొచ్చాడు ధర్మేంద్ర. మరి 87 సంవత్సరాల వయసులో లిప్ లాక్ సీన్ లో ధర్మేంద్ర నటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: యాదమ్మ రాజు హెల్త్ అప్ డేట్.. వేలు తీసేసిన వైద్యులు!

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss