iDreamPost
android-app
ios-app

IVF తో ప్రెగ్నెంట్‌ అయితే ఎవడు చేశాడని నా భర్త వేధిస్తున్నాడు: ఫోక్‌ సింగర్‌ కట్ల అపూర్వ

  • Published Aug 04, 2023 | 5:02 PM Updated Updated Aug 04, 2023 | 5:02 PM
  • Published Aug 04, 2023 | 5:02 PMUpdated Aug 04, 2023 | 5:02 PM
IVF తో ప్రెగ్నెంట్‌ అయితే ఎవడు చేశాడని నా భర్త వేధిస్తున్నాడు: ఫోక్‌ సింగర్‌ కట్ల అపూర్వ

యూట్యూబ్‌ వినియోగం పెరిగాక.. ఎందరో ప్రతిభావంతులు తెర మీదకు వస్తున్నారు. జానపద గేయాలకు యూట్యూబ్‌ ప్రాణం పోస్తుంది అని చెప్పవచ్చు. యూట్యూబ్‌ వినియోగం పెరిగాక ఎన్నో జానపద గేయాలు వెలుగులోకి వచ్చాయి.. ఎందరో ఫోక్‌ సింగర్స్‌ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అలా గుర్తింపు పొందిన ఒక జానపద గాయని కట్ల అపూర్వ. సాలు కొమ్మళ్ల చింత చిగురు వంటి పాటలతో ప్రేక్షకులుకు పరిచయం అయ్యారు అపూర్వ. ఒకప్పుడు తన పాటలతో అందరికి పరిచయం అయిన అపూర్వ.. తాజాగా తన భర్త వేధింపులు కారణంగా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేమ వివాహం చేసుకున్న అపూర్వ.. భర్త చేతిలో దారుణ చిత్ర హింసలకు గురవుతున్నారు. చేతిలో చంటి బిడ్డతో ఐడ్రీమ్‌ చానెల్‌కి వచ్చిన అపూర్వ.. తన జీవితంలో ఎదుర్కొన్న అనేక కష్టాలను వెల్లడించింది.

తాను ప్రేమ వివాహం చేసుకున్నానని.. అది కూడా పెద్దల అంగీకారంతోనే తాము వివాహం చేసుకున్నామని చెప్పుకొచ్చింది. తన భర్తకు తన మీద చాలా అనుమానమని.. తెలిపింది. ‘‘పెళ్లైన తర్వాత తన భర్తకు పిల్లలు కలిగే అవకాశం లేదని తెలియడంతో.. నేను ఐవీఎఫ్‌ పద్దతిలో గర్భం దాల్చాను. దాంతో అతడు.. ఇంజక్షన్స్‌ వల్ల ఎలా గర్భం దాలుస్తారు.. నువ్వు ఎవరితోనే తిరిగి ఇలా ప్రెగ్నెంట్‌ అయ్యావ్‌.. అంటూ నన్ను వేధించాడు. దాంతో నేను కన్సల్ట్‌ అయిన డాక్టర్‌ వద్దకు తీసుకొచ్చాను. మేడం నా భర్తకు ఐవీఎఫ్‌ గురించి అవగాహన లేదు.. తనకు వివరించండి మేడం అని చెప్పాను. డాక్టర్‌ ఆయనకు అన్ని విధాలుగా వివరించింది. మూడు నెలల వరకు బాగానే ఉన్నాడు.. ఆ తర్వాత ఎక్కడికో వెళ్లి పోయాడు’’ అని చెప్పుకొచ్చింది.

‘‘దాంతో పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టాను. అప్పుడు వచ్చి నన్ను తీసుకెళ్లి.. అందరి ముందు మంచి వాడు అనిపించుకోవడం కోసం సీమంతం చేశాడు. ఆతర్వాత నాకు పెయిన్స్‌ వచ్చాయి. ఆస్పత్రికి తీసుకెళ్లాడు. డబ్బులు కడితేనే జాయిన్‌ చేసుకుంటాం అన్నారు. అలాంటి సమయంలో నన్ను వదిలేసి వెళ్లాడు. అంతకు ముందు కూడా పిరియడ్స్‌ సమయంలో కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేసేవాడు. ఆ ఐదు రోజులు నాకు ఏం జరుగుతందో అతడికి చూపాలని వేధించేవాడు. గర్భవతిగా ఉన్న సమయంలో కనీసం తినడానికి తిండి కూడా లేదు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నా భర్తకు తన తల్లిదండ్రులు, అన్నా వదినలు అందరూ మద్దతు ఇస్తారు. నాకు అన్యాయం చేశారు’’ అని వాపోయింది.

jojobet girişmarsbahiscasibomjojobet girişcasibomJojobet Girişjojobetcasibom girişholiganbet giriş