iDreamPost
android-app
ios-app

పెళ్లి ఊరేగింపులో కొత్త పైత్యం..! కారుకి ఇదేమి డెకరేషన్ రా బాబు?

  • Published Apr 04, 2024 | 12:32 PM Updated Updated Apr 04, 2024 | 12:32 PM

పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ఓ అద్బుతమైన ఘట్టం. అందుకే మెహందీ దగ్గర నుండి పెళ్లి ముగిసే వరకు ప్రతి విషయంలోనే వినూత్నంగా ఆలోచన చేస్తుంటారు. ఇదిగో ఇప్పుడు అలాంటి ఓ వీడియో వైరల్ అవుతోంది.

పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ఓ అద్బుతమైన ఘట్టం. అందుకే మెహందీ దగ్గర నుండి పెళ్లి ముగిసే వరకు ప్రతి విషయంలోనే వినూత్నంగా ఆలోచన చేస్తుంటారు. ఇదిగో ఇప్పుడు అలాంటి ఓ వీడియో వైరల్ అవుతోంది.

  • Published Apr 04, 2024 | 12:32 PMUpdated Apr 04, 2024 | 12:32 PM
పెళ్లి ఊరేగింపులో కొత్త పైత్యం..! కారుకి ఇదేమి డెకరేషన్ రా బాబు?

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఫేజ్. పెళ్లి అనే తంతుతో ముక్కు మొహం తెలియని రెండు కుటుంబాలు ఏకమౌతుంటాయి. ఇక అమ్మాయి, అబ్బాయి అయితే ఎన్నో కలలతో తమ నూతన జీవితాన్ని ఊహించుకుంటారు. ఈ అందమైన ఘట్టం జీవితాంతం గుర్తుండిపోవాలన్న ఉద్దేశంతో చాలా క్రియేటివ్ వర్క్ కనిపించేలా ఆశపడుతుంటారు. పసుపు కొట్టే దగ్గర నుండి అత్తారింటికి అడుగు పెట్టే కారు వరకు డెకరేటివ్‌గా ఉండాలనుకుంటారు. ఇటీవల వరుడు, వధువు తమ పెళ్లి విషయంలో కాస్త వినూత్నంగానే ఆలోచిస్తున్నారు. పెళ్లి కార్డును వెరైటీగా డిజైన్ చేయడం, పెళ్లి దుస్తులపై తమ ఫోటోలు, పేర్లు వచ్చేలా చూడటం లేదంటే పెళ్లిలో నో ప్లాస్టిక్ వంటి సామాజిక స్పృహతో కూడిన విషయాల గురించి యోచిస్తున్నారు. మరికొంత మంది విభిన్నంగా థింక్ చేస్తున్నారు.

ఇప్పుడు అలాంటి ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇంతకు ఏంటీ అనుకుంటున్నారా.. పెళ్లి కొడుకు లేదా కూతురుని తీసుకువచ్చే కారును పూలతో లేదా, శాటిన్ రిబ్బన్స్‌తో డెకరేటివ్‌గా డిజైన్ చేస్తుంటారు. దీని కోసం ప్రత్యేకంగా డెకరేట్ చేసే వ్యక్తులను కూడా నియమించుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో పెళ్లి కారు మాత్రం..ప్యాకెట్లతో నిండిపోయింది. ఇందులో రకరకాల ప్యాకెట్లు కనిపిస్తున్నాయి. వీటిని కారుకు ఓ క్రమ పద్దతిలో వేలాడదీశారు.చిల్లర కొట్టులో దొరికే చిప్స్ ప్యాకెట్లతో అలంకరించిన ఈ కారులో వరుడు వస్తున్నట్లుగా కనిపిస్తోంది. కారు వస్తుంటే.. ఇదేం డెకరేషన్ రా బాబూ అనుకుంటూ వింతగా, విచిత్రంగా చూస్తున్నారు స్థానికులు.

ఈ వీడియోను ఓ నెటిజన్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకున్నాడు. ఇక దీన్ని చూసిన సోషల్ సైనికులు..తమ చేతులకు పని చెప్పారు. ‘వధూవరులిద్దరూ మంచి భోజన ప్రియులేమో.. అందుకే ఈ వైరెటీ వెడ్డింగ్ గిఫ్ట్ ఇచ్చారు’ అని పేర్కొన్నాడు. వరుడి కారుపై ఏకంగా కిరాణా దుకాణాన్ని ఓపెన్ చేశాంటూ మరొకరు రాసుకొచ్చారు. పెళ్లి చేసుకుంటున్నావా.. దుకాణం తెరుస్తున్నావా అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు కొందరు. ఇదొక పైత్యం అంటున్నారు మరికొందరు. ఇలా తమకు నచ్చినట్లు కామెంట్స్ చేసి.. ఈ వీడియోను వైరల్ అయ్యేట్లు చేస్తున్నారు. దీన్ని చూస్తుంటే వెర్రి వెయ్యి రకాలు అనిపించకమానదు.  ఈ వీడియో చూస్తే మీకేమీ అనిపిస్తుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Satyapal Yadav (@ysatpal569)

Jojobet GirişjojobetJojobetHoliganbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabet