iDreamPost
android-app
ios-app

వీడియో: చెల్లిని బాగా చూస్కో.. బావ కాళ్లు మొక్కి బామ్మర్ది! బోరుమన్న వధువు

  • Published Mar 18, 2024 | 1:18 PM Updated Updated Mar 18, 2024 | 1:20 PM

అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్లు మధ్య బాండింగ్ వేరే ఉంటుంది. కొట్టుకోవడమే కాదూ.. అవసరమైనప్పుడు కలిసి పోయి.. మిగిలిన వాళ్లను పిచ్చోళ్లను చేస్తుంటారు. టామ్ అండ్ జెర్రీలా బంధం పెళ్లిళ్లు అయ్యేంత వరకే..

అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్లు మధ్య బాండింగ్ వేరే ఉంటుంది. కొట్టుకోవడమే కాదూ.. అవసరమైనప్పుడు కలిసి పోయి.. మిగిలిన వాళ్లను పిచ్చోళ్లను చేస్తుంటారు. టామ్ అండ్ జెర్రీలా బంధం పెళ్లిళ్లు అయ్యేంత వరకే..

  • Published Mar 18, 2024 | 1:18 PMUpdated Mar 18, 2024 | 1:20 PM
వీడియో: చెల్లిని బాగా చూస్కో.. బావ కాళ్లు మొక్కి బామ్మర్ది! బోరుమన్న వధువు

సాధారణంగా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే..ఒకరంటే ఒకరికి పడదు. ముఖ్యంగా అక్కా తమ్ముడు, అన్నా చెల్లెళ్ల మధ్య బాండింగే వేరు. చిన్న చిన్న విషయాలకు కూడా కొట్టుకుంటారు. పొద్దున్న లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు వీరి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. అమ్మ కొడుక్కి సపోర్టు చేస్తుంటే.. తండ్రి కూతురికి అండగా నిలుస్తూ ఉంటాడు. ఇద్దరూ రోజూ ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకుంటూ ఉంటారు. అదే ఏదైనా సమస్య వస్తే అందర్ని ఆశ్చర్యపరుస్తూ.. ఒక్క మాట మీద నిలబడతారు. తనతో సుమారు 15-20 సంవ్సతరాల పాటు తనతో జర్నీ చేసిన సోదరి పెళ్లి పేరుతో దూరమైతే.. దిగులు చెందుతాడు సోదరుడు. రేపట్నించి.. తనను మందలించేది, భయపెట్టేది, బుజ్జగించేది ఎవరన్న బాధలో ఉంటాడు. బాధను తట్టుకుని సోదరిని అత్తగారింటికి పంపిస్తాడు.

ఇదిగో ఈ సోదరుడు మాత్రం తన సోదరిపై ఉన్న ప్రేమను కన్నీటి రూపంలో చూపించాడు. సోదరిపై ఉన్న ప్రేమతో.. ఆమెను బాగా చూసుకోవాలంటూ బావ కాళ్లపై పడిపోయి వెక్కి వెక్కి ఏడ్చాడు. అతడ్ని ఆపడం ఎవ్వరి వల్ల కాలేదు. బావ ఓదార్చిన కూడా ఏడుస్తూనే ఉన్నాడు బావమరిది. తనపై సోదరికి ఉన్న ప్రేమ చూసి.. ఈ పెళ్లి కూతురు కూడా కన్నీటి పర్యంతమైంది. తన సోదరికి కూడా కాళ్లు మొక్కాడు సోదరుడు. ఈ ఘటనను చూసి చుట్టు ప్రక్కల వాళ్లు కూడా కాస్త ఎమోషనల్ అయ్యారు. అతడ్ని అక్కడ నుండి తీసుకెళ్లిపోవాలంటూ కోరారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. తన సోదరికి పెళ్లి కావడంతో.. ఆమెను అత్తాగారింటికి పంపే క్రమంలో సోదరుడు ఇలా కన్నీరు పెట్టుకున్నాడు.

గులాబ్ సాహబ్ అనే ఐడితో ఈ వీడియో షేర్ కాగా, నెట్టింట్లో హవా సాగిస్తోంది. ‘అన్నా చెల్లెలు ఒకరితో ఒకరు గొడవపడినా, సోదరి పెళ్లి సమయంలో ఎక్కువగా ఏడ్చేది అన్న మాత్రమే’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కేవలం 40 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోను 66 వేల మందికి పైగా వీక్షించారు. ఇక కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇట్స్ ట్రూ హార్ట్ ఫ్రం ఇన్ సైడ్ అంటూ ఒక నెటిజన్ పోస్టు చేయగా.. ఇట్స్ నాచురల్ అంటూ మరో నెటిజన్ పేర్కొన్నాడు. మొత్తానికి ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. నెట్టింట్లో మాత్రం ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. మరీ ఈ వీడియోను మీరు చూసి ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş