కేటుగాళ్లకే చుక్కలు చూపించిన అమ్మాయి.. వీడియో వైరల్

నిత్యం ఏదో ఒక ఫేక్ కాల్ వస్తూనే ఉంటుంది. మీకు గిఫ్ట్ వచ్చిందని, బంపర్ డ్రా తగిలిందంటూ కాల్స్ చేస్తుంటారు మోసగాళ్లు. కానీ చాలా మంది ఈ కాల్స్ కు బోల్తా పడిన వాళ్లే. ఈ అమ్మాయి మాత్రం

నిత్యం ఏదో ఒక ఫేక్ కాల్ వస్తూనే ఉంటుంది. మీకు గిఫ్ట్ వచ్చిందని, బంపర్ డ్రా తగిలిందంటూ కాల్స్ చేస్తుంటారు మోసగాళ్లు. కానీ చాలా మంది ఈ కాల్స్ కు బోల్తా పడిన వాళ్లే. ఈ అమ్మాయి మాత్రం

గతంలో రాంగ్ నంబర్స్ నుండి కాల్స్ వచ్చేవి. అలాగే ఇప్పుడు రోజుకొకటైన స్పామ్ కాల్ రావాల్సిందే. ఇక ఫేక్ కాల్స్‌కు కొదవే లేదు. మీకు ఇంత డబ్బు వచ్చింది, మీకు ఫలానా గిఫ్టు వచ్చిందంటూ ఫోన్స్ వస్తుంటాయి. బ్యాంకుల నుండి ఫోన్స్ చేస్తున్నామని, ఆధార్ అప్టేట్ చేయాలని, ఏటీఎం కార్డు కొత్తది కావాలంటే ఓటీపీ చెప్పాలంటూ సైబర్ నేరగాళ్లు వల వేస్తుంటారు. వీటిని కొంత మంది చాక చక్యంగా తప్పించుకుంటున్నారు. మరి కొంత మంది బలైపోతున్నారు. కొన్ని సార్లు డబ్బులు పోగొట్టుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ అమ్మాయికి ఏకంగా పోలీస్ అధికారుల పేరుతో ఫేక్ కాల్ రావడంతో కాదు.. ఏకంగా ఆమెను బెదిరించడం మొదలు పెట్టారు.

కానీ ఆ అమ్మాయి తెలివిగా ఆ మోసగాళ్లనే బురిడీ కొట్టించింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియోలో ట్రెండింగ్ అవుతుంది. తన తల్లికి వాట్సప్‌కు ఓ కాల్ రావడంతో.. కూతురు ఫోన్ లిఫ్ట్ చేసింది. ఈ నెంబర్ ఇండియాది కాదని గ్రహించిన మహిళ.. ఫోన్‌లో మాట్లాడటం కొనసాగించింది. తామ ఢిల్లీ పోలీసులం అని అవతల నుండి గొంతు వచ్చింది. వెంటనే తల్లిలా మాట్లాడటం స్టార్ట్ చేసింది. మోసగాళ్లు.. ప్రశ్నల వర్షం కురిపించారు. మీకు ఎంత మంది కొడుకులు అని, ఎక్కడ ఉంటారంటూ అని ప్రశ్నించగా.. ఘజియాబాద్‌లో ఉంటామని, తన ఇద్దరు కొడుకులు ఢిల్లీలో ఉన్నారని చెప్పింది. అంతలో మీ పెద్ద కొడుకు పూర్తి పేరు చెప్పండి అనగానే.. కూతురు తల్లిలా అనుకరిస్తూ రవికుమార్ అని చెప్పింది.

వెంటనే రవి కుమార్‌ను అరెస్టు చేశామని, అతడి స్నేహితుల్ని కూడా పట్టుకున్నామని మోసగాడు చెప్పాడు. ఎందుకని అడి గితే.. అత్యాచారం ఆరోపణలపై రవిని అరెస్టు చేశామని, అతడు ఏమీ చేయలేదని అంటున్నాడని, అతడితో పాటు స్నేహితులకు కూడా పదేళ్ల జైలు శిక్ష, రూ. 6 లక్షల జరిమానా విధిస్తామని బెదిరించాడు. దీంతో ఆమె.. అతను తప్పు చేశాడు.. అరెస్టు చేయండి.. ఇప్పుడు అతడు మా దృష్టిలో చనిపోయాడంటూ చెప్పడంతో.. ఓకే ఓకే అంటూ తన పన్నాగం పారలేదని పోలీసుల రూపంలో ఉన్న కేటుగాళ్లు ఫోన్ పెట్టేశారు. ఈ వీడియోను సదరు యువతి రికార్డు చేసి.. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు చర్చ నడుస్తుంది. అమ్మాయి చేసిన పనికి ప్రశంసలు వస్తున్నాయి.

Show comments