P Krishna
Telangana Budget 2024:తెలంగాణ సర్కార్ 2024-25 వార్షిక బడ్జెట్ డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ విద్యా, వైద్య, వ్యవసాయ, మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేసిందని ఈ సందర్భంగా తెలిపారు.
Telangana Budget 2024:తెలంగాణ సర్కార్ 2024-25 వార్షిక బడ్జెట్ డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ విద్యా, వైద్య, వ్యవసాయ, మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేసిందని ఈ సందర్భంగా తెలిపారు.
P Krishna
తెలంగాణలో 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీ పథకాల హామీ ఇచ్చారు. ఈ హామీపై నమ్మకంతో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీ పథకాలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభించారు. నేడు అసెంబ్లీలో 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క. ఈ బడ్జెట్ లో మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..
2024-25 వార్షిక బడ్జెట్ లో మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది తెలంగాణ సర్కార్. బడ్జెట్ లో వినూత్న పథకాలను ప్రతిపాదించింది. మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదగడానికి పలు పథకాలు అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే ‘ఇందిరా మహిళా శక్తి’ పథకానికి రూప కల్పన చేసింది. ఈ పథకం ద్వారా 63 లక్షల మంది మహిళలకు లబ్ది చేకూరేలా ప్రభుత్వం లక్ష్యమని భట్టి తెలిపారు. స్త్రీ నిధి ఏర్పాటు, బ్యాంకులతో అనుసంధానంతో పాటు వివిధ మార్కాల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక చిన్న తరహా పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ ఏటా 5 వేల గ్రామీణ సంఘాలకు ప్రాంతీయ స్థాయి సమాఖ్యలకు లబ్ది చేకూరేలా కార్యాచరణ చేయబోతున్నట్లు తెలిపారు.
మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ఉమ్మడి ప్రాసెసింగ్ కేంద్రాలతో పాటు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక చిన్నతరహా పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయనున్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఏటా 5,000 గ్రామీణ సంఘాలకు ప్రాంతీయ స్థాయి సమాఖ్యలకు లబ్టి చేకూరే విధంగా కార్యాచరణ చేపడుతుంది. వచ్చే ఐదేళ్లలో 25,000 సంస్థలకు విస్తరింపచేయడానికి కృషి చేయనున్నారు. ఈ సందర్భంగా మహిళలకు మరో శుభవార్త చెప్పారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా రుణ బీమా పథకాన్ని మార్చి నుంచి ప్రారంభించింది. ఈ పథకం కింద సభ్యురాలు చనిపోతే ఆమె పేరుఉన్న గరిష్ట రుణం రూ.2 లక్షల వరకు మాఫీ చేయనున్నారు. ఇందుకోసం బడ్జెట్ లో రూ.50.41 కోట్లు కేటాయించారు.ఈ పథకం స్వయం సహాయక సంఘాల్లోని దాదాపు 63.86 లక్షల మంది సభ్యులకు జీవిత బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. ఈ సంఘాల్లోని సభ్యులెవరైనా ప్రమాద వశాత్తు చనిపోతే వారికి 10 లక్ష జీవిత బీమా వర్తింపజేస్తామన్నారు.