iDreamPost
android-app
ios-app

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిప్యూటీ CM భట్టి కీలక ప్రకటన!

  • Published Oct 08, 2024 | 6:05 PM Updated Updated Oct 08, 2024 | 6:05 PM

Deputy CM Bhatti Vikramarka: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటు ముందుకు సాగుతుంది. నిరుద్యోగుల కోసం ఇప్పటికే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించార.

Deputy CM Bhatti Vikramarka: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటు ముందుకు సాగుతుంది. నిరుద్యోగుల కోసం ఇప్పటికే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించార.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిప్యూటీ CM భట్టి కీలక ప్రకటన!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్నికల ముందు తమకు అధికారం అందిస్తే ఆరు గ్యారెంటీ పథకాలతో పాటు వివిధ అభివృద్ది సంక్షేమ పథకాలు అమలు చేస్తామని తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే ఆరు గ్యారెంటీ పథకాలు అమలు, రైతులకు రెండు లక్షల రుణమాఫీ, మహిళలకు సంక్షేమ పథకాలు, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది రేవత్ సర్కార్. వివరాల్లోకి వెళితే..

ఖమ్మం, వరంగల్ జిల్లాల విద్యుత్ శాఖ అధికారులతో సచివాలయం వేదికగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. సమీక్షా సమావేశంలో అధికారులతో పలు అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. ‘తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో విద్యుత్ శాఖలో భారీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తాం. ఇప్పటికే పదేళ్లుగా నిలిచిపోయిన పదోన్నతులు పూర్తి చేశాం. విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజలు 1912 నెంబర్ ఫోన్ కి డయల్ చేయాలి’ అని సూచించారు. ఇటీవల వరదల సమయంలో విద్యుత్ సిబ్బంది ఎంతో రిస్క్ తీసుకున్నారని, కొన్ని చోట్ల ప్రాణాలకు తెగించి పనులు చేశారని అభినందించారు.

రాష్ట్రంలో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఫీజు రియింబర్స్ మెంట్, స్కాలర్ షిపు లను రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చారు. దసరా కంటే ముందుగానే పెండింగ్ బకాయిలను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. నాలాలు, చెరువులు ఆక్రమించి కట్టడాలు నిర్మించడం వల్ల వరద నీరు వచ్చి చేరుతుందని అన్నారు. హైదరాబాద్ పరిరక్షణ తమ లక్ష్యం అని.. భవిష్యత్ లో వర్షాలు వస్తే వరదలు రాకుండా చూసేందుకు ప్రతిష్టాత్మకంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అందుకోసమే ప్రభుత్వం ‘హైడ్రా’ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. విపక్షాలు హైడ్రాపై లేని పోని తప్పుడు ప్రచారాలు చేస్తుంది.. ఇప్పటికైనా అది మానుకోవాలని సూచించారు. మూసీ బాధితులను తప్పకుండా ఆదుకుంటాం, ఇప్పటికే వారికి ఇళ్లకు బదులు మరో చోట ఇళ్లు ఇప్పిస్తున్నామని అన్నారు.