iDreamPost
android-app
ios-app

Kumari Aunty: కుమారీ ఆంటీ క్రేజ్.. ఏకంగా బిగ్ బాస్ లోకి?

  • Published Jan 29, 2024 | 10:19 PM Updated Updated Jan 29, 2024 | 10:19 PM

స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి కుమారీ ఆంటీ క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇప్పుడు ఆవిడకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి వైరల్ అవుతోంది.

స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి కుమారీ ఆంటీ క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇప్పుడు ఆవిడకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి వైరల్ అవుతోంది.

  • Published Jan 29, 2024 | 10:19 PMUpdated Jan 29, 2024 | 10:19 PM
Kumari Aunty: కుమారీ ఆంటీ క్రేజ్.. ఏకంగా బిగ్ బాస్ లోకి?

కుమారి ఆంటీ.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈవిడ పేరే వినిపిస్తోంది. ఇన్నాళ్లు ఆవిడ చేతి వంటతో ఎంతో ఫేమస్ అయ్యింది. కానీ, ఇప్పుడు ఈ మీమర్స్ పుణ్యమా అని ఆవిడ రీల్స్, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. మీడియా కూడా ఆవిడ మీద ఫోకస్ పెట్టేలా చేశారు. అంతేకాకుండా ఆ ట్రోల్స్ వైరల్ కావడంతో గతంతో పోలిస్తే ఇప్పుడు దాదాపుగా బిజినెస్ రెండింతలు అయ్యింది. గతంలో 300 ప్లేట్లు అమ్మితే.. ఇప్పుడు ఏకంగా 500 ప్లేట్ల వరకు బిజినెస్ చేస్తోంది. కుమారి ఆంటీ మంత్లీ టర్నోవర్ ఏకంగా రూ.18 లక్షలు అంట. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఇంకో వార్త స్టార్ట్ అయ్యింది. అదేంటంటే.. కుమారి ఆంటీ బిగ్ బాస్ లోకి వెళ్లబోతోంది అంట.

ప్రస్తుతం హైదరాబాద్ లో ఏ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారికి రాని క్రేజ్, కవరేజ్ కుమారి ఆంటీకి దక్కింది. ఆవిడ షాపు ముందు జనాలు క్యూలు కట్టడం మాత్రమే కాకుండా తోసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చాలా మంది ఫుడ్ దొరక్క ఖాళీ ప్లేట్లతోనే వెనక్కి తిరిగి వెళ్లిపోతున్నారు. ఆవిడకు అంత క్రేజ్ రావడానికి ముఖ్య కారణం ఒక వీడియో బాగా వైరల్ కావడమే. ఆ వీడియోలో ఆవిడ.. అమ్మా మీది బిల్ థౌంజెండ్ అయ్యింది.. 2 లివర్లు ఎక్స్ ట్రా అంటూ చెప్పింది. ఆ వీడియో కాస్తా మీమర్స్ చేతిలో పడటం, వాళ్లు దానిని వైరల్ చేయడం చేశారు. ఆ తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. ఆవిడ ఆ బిల్లు వేసింది మొత్తం ఆరుగురు తిన్న దానికి అని క్లారిటీ ఇచ్చింది.

అలాగే కుమారీ ఆంటీ ఆదాయానికి సంబంధించి కూడా చాలానే వార్తలు వస్తున్నాయి. అయితే వాటిపై కూడా క్లారిటీ ఇచ్చింది. తనకు రోజుకు కౌంటర్ రూ.60 వేలు అవుతుందట. వాటిలో రూ.50 వేలు ఖర్చులు పోతే రూ.10 వేలు మిగులుతాయి. మళ్లీ వాటికి అదనంగా పనివాళ్లు ఖర్చులు కూడా ఉంటాయంట. అన్నీ పోను.. నెలకు రూ.లక్షన్నర వరకు ఆదాయం ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ టాపిక్ కూడా క్లోజ్ అయిన తర్వాత ఇప్పుడు కొత్త చర్చ తెరపైకి వచ్చింది. అదేంటంటే.. కుమారి ఆంటీని బిగ్ బాస్ కి పంపాలంట. సాధారణంగా బిగ్ బాస్ కి సెలబ్రిటీలను పంపుతారు. కానీ, కామన్ మ్యాన్ కేటగిరీ ఒకటి ఉంది. దానిలో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉన్న, బాగా పాపులర్ అయిన వారిని తీసుకుంటారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో అయితే పల్లవి ప్రశాంత్ వెళ్లడమే కాకుండా.. విన్నర్ కూడా అయ్యాడు.

ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ 2 ప్రారంభం కాబోతోంది. ఫిబ్రవరి నెల మధ్యలోనే చివరి నుంచో ఈ సీజన్ స్టార్ట్ అవుతుందని చెబుతున్నారు. ఇప్పుడు ఆ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ కి కుమారి ఆంటీని తీసుకోవాలంటూ ఆవిడ ఫ్యాన్స్ కోరుతున్నారు. అలాగే ఆవిడలాంటి సెల్ఫ్ మోటవేటెడ్ ఉమెన్ అలాంటి రియాలిటీ షోకి వెళ్తే మరింత మందికి స్ఫూర్తిని ఇచ్చిన వాళ్లు అవుతారంటూ చెబుతున్నారు. బిగ్ బాస్ యాజమాన్యానికి కూడా ఇలాంటి వాళ్లే కావాలి. సోషల్ మీడియాలో బాగా బజ్ ఉన్న వాళ్లు అయితే వారికి కంటెంట్ పరంగా కూడా వర్కౌట్ అవుతుంది. అయితే ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుంది? కేవలం ప్రచారంగానే మిగిలిపోతుందా తెలియాలి అంటే కాస్త వెయిట్ చేయాల్సిందే. అయితే అవకాశం వచ్చినా కూడా అంత పెద్ద బిజినెస్ ని పక్కకు పెట్టి ఆవిడ వెళ్తుందా? అనేది కూడా పెద్ద ప్రశ్నే. మరి.. కుమారీ ఆంటీని బిగ్ బాస్ కి పంపాలంటూ వస్తున్న డిమాండ్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet