కుమారీ ఆంటీ సంపాదన నెలకు 18 లక్షలా? అసలు నిజం..

Kumar Aunty Monthly Income: స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ తో ఎంతో ఫేమస్ అయిన కుమారీ ఆంటీ నెల సంపాదన గురించి చాలానే వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు ఆవిడ నెల సంపాదన ఎంతో చూడండి.

Kumar Aunty Monthly Income: స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ తో ఎంతో ఫేమస్ అయిన కుమారీ ఆంటీ నెల సంపాదన గురించి చాలానే వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు ఆవిడ నెల సంపాదన ఎంతో చూడండి.

కుమారీ ఆంటీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈమె ఎంతగా వైరల్ అవుతోందో అందరికీ తెలిసిందే. హైదరాబాద్ లోని దుర్గం చెరువు సమీపంలోని ఫుట్ స్ట్రీట్ లో మధ్యాహ్నం పూట వెజ్, నాన్ వెజ్ మీల్స్ విక్రయిస్తూ ఉంటుంది. ఈమె ఇటీవల ఒక వీడియోతో నెట్టింట బాగా ఫేమస్ అయ్యింది. నాన్న మీది రూ.థౌజెండ్ అయ్యింది.. 2 లివర్లు ఎక్స్ ట్రా అంటూ చెప్పిన వీడియో పెద్దఎత్తున చర్చలకు దారి తీసింది. 5 స్టార్ హోటల్లో కూడా ఇలాంటి రేట్లు ఉండవు అంటూ ఆమెను ట్రోల్ చేశారు. కానీ, అసలు విషయం తెలిసిన తర్వాత నాలుక కరుచుకున్నారు. ఇప్పుడు ఆమె సంపాదన విషయంలో రోజుకో లెక్క చెప్తూ వైరల్ చేస్తున్నారు. అయితే అసలు కుమారీ ఆంటీ సంపాదన ఎంతో చూద్దాం.

కుమారీ ఆంటీ ఈ రీల్స్, ట్రోల్స్, మీమ్స్ అన్నీ రాక ముందే ఎంతో ఫేమస్. హైటెక్ సిటీ, దుర్గం చెరువు సమీపంలో ఉండే వారికి ఎంతో బాగా తెలుసు. ఆమె చేతి వంట తినడం కోసం మధ్యాహ్నం 12 గంటల కల్లా క్యూలు కడతారు. నిజానికి క్యూ ఎందుకు కడతారంటే.. కాస్త లేట్ అయినా కూడా ఆమె వద్ద నాన్ వెజ్ మీల్స్ దొరకడం కష్టం. 100 కిలోల చికెన్ వండినా కూడా కేవలం 2, 3 గంటల్లోనే సేల్ అయిపోతుంది. ఆమె ఫుడ్ కు అంత డిమాండ్ ఉంటుంది. ఇటీవల వైరల్ అయిన వీడియోకి సంబంధించి తర్వాత ఆమె క్లారిటీ కూడా ఇచ్చారు. ఏంటి అండి ఇద్దరు భోజనం చేస్తేనే.. వెయ్యి రూపాయల బిల్ వేశారు అంటూ ప్రశ్నించగా.. “ఆరోజు మొత్తం ఆరుగురు వచ్చారండి. వాళ్ల బిల్ రూ.800 అయ్యింది. వాళ్లల్లో ఇద్దరు 2 లివర్స్ ఎక్ర్ ట్రాగా తీసుకున్నారు. అందుకే వాళ్ల బిల్ రూ.1000 అయ్యింది. అందరికీ ఆ విషయం తెలియకుండానే అలా మాట్లాడుకున్నారు” అంటూ ఉన్న విషయాన్ని స్పష్టం చేసింది.

ఆ వీడియోకి సంబంధించిన ట్రోల్స్ అన్నీ ఆగిపోయాయి. ఆ తర్వాత ఆమె సంపాదనకు సంబంధించి న్యూస్ స్ప్రెడ్ చేయడం ప్రారంభించారు. మొన్నటి వరకు నెలకు రూ.3 లక్షలు సంపాదిస్తోంది అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఏకంగా ఆ అంకెను రూ.18 లక్షలు చేసేశారు. అదేంటి.. స్ట్రీట్ ఫుడ్ మీద అంత సంపాదన వస్తుందా? అంటూ కొత్త చర్చ కూడా ప్రారంభం అయ్యింది. అయితే ఇటీవల ఆవిడ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ముందే దీనికి కూడా క్లారిటీ ఇచ్చారు. నెలకు లక్షల్లో ఆదాయం వస్తుంది అంట కదా? అంటూ ప్రశ్నించగా.. సున్నితంగా ఆవిడ ఆ వార్తలను ఖండించారు.

“అందరూ ఆదాయం గురించే మాట్లాడతారు. కానీ, ఖర్చుల గురించి ఎవరూ చెప్పరు. నాన్ వెజ్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు కేజీ చికెన్ రూ.220 నుంచి రూ.240 వరకూ ఉంది. నాన్ వెజ్ లో ఏ ఐటమ్ తీసుకున్నా ధరలు విపరీతంగా ఉన్నాయి. నాకు రోజుకు రూ.60 వేల బిజినెస్ జరుగుతుంది. అందులో రూ.50 వేలు ఖర్చులకు పోతుంది. మిగిలిన రూ.పది వేలల్లో కూడా కట్టాల్సినవి ఉంటాయి. అన్నీ పోను నాకు నెలకు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షలు వరకు మిగులుతుంది” అంటూ ఆవిడ చెప్పుకొచ్చారు. అయితే ఆవిడ చెప్పిన టోటల్ కౌంటర్ గురించి చెబుతూ రూ.18 లక్షలు సంపాదిస్తున్నారు అని చెప్తున్నారు. కానీ, అందులో రూ.15 లక్షలు ఖర్చులకే పోతాయి అనే విషయాన్ని మాత్రం ఎవరూ హైలెట్ చేయడం లేదు. మొత్తానికి రూ.18 లక్షలు, నెలకు రూ.3 లక్షలు అనే వార్తలపై ఒక క్లారిటీ అయితే వచ్చింది. కుమారీ ఆంటీకి నెలకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర ఆదాయం అయితే వస్తోంది. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments