iDreamPost
android-app
ios-app

కోట్లకు పడగలెత్తిన బిచ్చగాడి ఆదాయం! నెలకు ఎంతో తెలుసా?

ఇతని పేరు భరత్ జైన్. ఇతడు రోజూ బిక్షాటన చేస్తూనే లక్షలు కూడబెడుతున్నాడు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూనే ఇతడు బిక్షాటన చేయడం విశేషం. ఇంతకు ఇతడి నెల సంపాదనం ఎంతో తెలిస్తే షాకవుతారు.

ఇతని పేరు భరత్ జైన్. ఇతడు రోజూ బిక్షాటన చేస్తూనే లక్షలు కూడబెడుతున్నాడు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూనే ఇతడు బిక్షాటన చేయడం విశేషం. ఇంతకు ఇతడి నెల సంపాదనం ఎంతో తెలిస్తే షాకవుతారు.

కోట్లకు పడగలెత్తిన బిచ్చగాడి ఆదాయం! నెలకు ఎంతో తెలుసా?

మాములుగా కొందరు వ్యక్తులు తినడానికి తిండి లేక, ఉండటానికి గూడు లేక రోడ్లపై బిక్షాటన చేస్తూ అక్కడే పడుకుంటుంటారు. ఇక పగటి పూట రోడ్లపై వెళ్లే వారి వద్ద రూపాయి రూపాయి అడుక్కుని ఆ రోజుకి కడుపు నింపుకుంటారు. ఇలా ఎవరూ లేని వ్యక్తులు బిచ్చగాళ్లుగా మారి రోడ్లపైనే కాలాన్ని వెల్లదీస్తున్నారు. అయితే, బిక్షాటన చేసే వారి సంపాదన రోజూ రూ.100 నుంచి 150 మధ్య ఉండొచ్చు. కానీ, ఓ బిచ్చగాడి సంపాదన మాత్రం నెలకు లక్షల్లో ఉంటుందంటే నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే. రోడ్లపై బిక్షాటనతోనే అతడి సంపాదన నెలకు కోట్లకు పడగలెత్తింది. అతనికి సొంతంగా ఎన్నో ఫ్లాట్ లు ఉండడంతో పాటు విలాసవంతమైన జీవితాన్ని కూడా గడుపుతున్నాడు. ఇంతే కాకుండా ఇండియలో రిచెస్ట్ బిచ్చగాడిలో పేరు పొందడం విశేషం. ఇంతకు ఈ బిచ్చగాడు సారీ.. ఈ బిలియనర్ బిచ్చగాడు ఉండేది ఎక్కడా? అసలు ఇతని నెల సంపాదన ఎంతో తెలుసుకోవాలనుందా?

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భరత్ జైన్ అనే వ్యక్తి ముంబై పరాల్ లో నివాసం ఉంటున్నాడు. రోడ్లపై అందరి వద్ద రూపాయి రూపాయి అడుక్కుంటూ కాలాన్ని వెల్లదీస్తున్నాడు. అడుక్కుంటున్నాడని ఇతడు బిచ్చగాడు అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే. కేవలం బిక్షాటన చేస్తూనే ఇతడు ఏకంగా రూ.7 కోట్లకు పైగా ఆస్తులు కూడా బెట్టాడంట. వినటానికి షాకింగ్ ఉన్న ఇది నిజం. ఇతనికి పూణే, ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో 2BHK ప్లాట్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఇంతే కాకుండా థానేలో ఓ స్టేషనరి షాపును కూడా నడిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్లు ముంబైలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారు.

ఇలా అడుక్కుంటూనే భరత్ జైన్ ప్రస్తుతం బిలియనీర్ బిచ్చగాడిలా అవతారమెత్తాడు. ఎలాంటి సిగ్గు పడకుండా భరత్ జైన్ ఇప్పటికీ ముంబైలోని శివాజీ టెర్మినస్, ఆజాత్ మైదాన్ ప్రాంతాల్లో తన వృత్తిని కొనసాగిస్తుండడం విశేషం. ఇలా రోజూ బిక్షాటన చేస్తూ భరత్ జైన్ నెలకు రూ.75 వేల నుంచి రూ.1 లక్ష వరకు సంపాదిస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఇతని వార్షిక ఆదాయం చూసుకుంటే మాత్రం కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఏడాదికి ఇతని సంపాదన అక్షరాల. 9 లక్షలపైనే ఉంటుందట. భరత్ జైన్ ఇలా ఇన్ని ఆస్తులు కూడబెట్టినా .. ఇప్పటికీ తన బిక్షాటన వృత్తిని మాత్రం ఆపడం లేదు. ఇలా బిక్షాటన చేస్తూనే భరత్ జైన్ ఇండియాలోనే రిచెస్ట్ బిచ్చగాడిలా పేరు పొందాడు. బిక్షాటన చేస్తూ కోట్లకు కోట్లు సంపాదిస్తున్న భరత్ జైన్ వృత్తిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişBetcioivermectin tabletpokerklaspokerklaspokerklasmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Giriş