iDreamPost
android-app
ios-app

ఇద్దరు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త..

పెళ్లికి ముందు ప్రేమలు.. వివాహం తర్వాత కూడా కంటిన్యూ అవుతున్నాయి కొంత మంది జీవితాల్లో. దాని వల్ల ఆ కుటుంబంలో కుంపటి రాజుకుంటుంది. వివాహేతర సంబంధాలు, అపార్థాలు, అనుమానాలు, అనార్థాలు చోటుచేసుకుంటున్నాయి.

పెళ్లికి ముందు ప్రేమలు.. వివాహం తర్వాత కూడా కంటిన్యూ అవుతున్నాయి కొంత మంది జీవితాల్లో. దాని వల్ల ఆ కుటుంబంలో కుంపటి రాజుకుంటుంది. వివాహేతర సంబంధాలు, అపార్థాలు, అనుమానాలు, అనార్థాలు చోటుచేసుకుంటున్నాయి.

ఇద్దరు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త..

ప్రేమించుకుని, పెద్దలను ఒప్పించి, పెళ్లి పీటలు ఎక్కిన ప్రేమ జంటలు చాలా తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా అమ్మాయి.. ఓ వ్యక్తిని ఇష్టపడ్డానని చెప్పడం ఆలస్యం.. అతడు ఎవరు, ఎలాంటి వాడో కూడా అడగకుండా నిరాకరిస్తారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులకు భయపడి, లేదా వారు బెదిరించారన్న కారణంగా మనసారా ఇష్టపడ్డ వ్యక్తులతో కాకుండా మరొకరితో మూడు ముళ్లు వేయించుకుంటున్నారు. దీంతో ప్రియుడ్ని వదులుకోలేక పెళ్లి తర్వాత కూడా ఆ రిలేషన్ కంటిన్యూ చేస్తున్నారు. కానీ భర్తకు తెలిస్తే.. ఇక ఆమెను ప్రతి రోజు అనుమానిస్తూ.. అవమానిస్తుంటాడు. కానీ ఈ భర్త మాత్రం తన భార్యకు ఆ ప్రియుడితో కలిపి ఆదర్శ పురుషుడు అయ్యాడు. స్వయంగా దగ్గర ఉండి పెళ్లి జరిపించి.. భార్యను ప్రియుడి చేతిలో పెట్టాడు.

ఈ ఆదర్శవంతమైన  సంఘటన బీహార్‌లోని బెగుసరాయ్‌లో చోటుచేసుకుంది. దహియా గ్రామానికి చెందిన అజయ్ కుమార్, కాజల్‌కు 2018లో వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు సంతానం. అయితే పెళ్లికి ముందే కాజల్.. అఘాపూర్ గ్రామానికి చెందిన రాజ్ కుమార్ ఠాకూర్ అనే వ్యక్తిని ప్రేమించింది. పెళ్లి అయ్యాక కూడా అతడిని మర్చిపోలేక.. ప్రియుడ్ని రహస్యంగా కలుస్తోంది. వీరి వివాహేతర సంబంధం గురించి భర్తకు తెలిసింది. ఈ విషయం కుటుంబ సభ్యుల మధ్య కూడా చర్చకు వచ్చింది. అయితే భార్యపై కోప్పడితే ఏమోస్తుందని భావించిన భర్త అజయ్.. ఆమె మనస్సు తెలుసుకున్నాడు. మరొకరిపై మనస్సు పడ్డ భార్య.. తనతో వైవాహిక సంబంధం కొనసాగిండచంలో అర్థం లేదని కుటుంబ సభ్యులకు వివరించాడు.

సభ్య సమాజం ఏమనుకున్నా పర్వాలేదు అని భార్య కాజల్ ఇష్టపడ్డ వ్యక్తితో పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యాడు. వారి వివాహాన్ని సమీపంలోని గుడిలో జరపాలని నిర్ణయించాడు. పంచాయితీ సర్పంచ్, గ్రామస్థుల నుండి  కూడా ఈ నిర్ణయంపై పెద్దగా వ్యతిరేకత రాలేదు. ఇక పిల్లల బాధ్యత కూడా తానే చూసుకుంటానని చెప్పి.. భార్యను, ఆమె ప్రియుడికి ఇచ్చి ఘనంగా వివాహం జరిపించాడు. భర్త, తన పిల్లలు, పెద్దల సమక్షంలో తన ప్రియుడ్ని పెళ్లాడింది కాజల్. పెళ్లి తర్వాత ప్రియుడి చేతికి సతిని అప్పగిస్తూ కన్నీటి పర్యంతమయ్యాడు అజయ్ కుమార్. ఈ పెళ్లి వార్త బీహార్ మొత్తం వైరల్ అవుతుంది. దీంతో భర్త నిర్ణయాన్ని కొనియాడుతున్నారు. మరీ ఈ సంఘటనపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler