iDreamPost
android-app
ios-app

ట్రాఫిక్ పోలీస్ VS కుమారి ఆంటీ.. దెబ్బకి బిజినెస్ క్లోజ్ చేయించారు!

  • Published Jan 30, 2024 | 5:38 PM Updated Updated Jan 30, 2024 | 8:12 PM

Kumari Aunty: హైదరాబాద్‌లో స్ట్రీజ్‌ఫుడ్‌ బిజినెస్‌ చేస్తూ.. రీల్స్‌తో వైరల్‌ అయి సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయిన కుమారి ఆంటీ చిక్కుల్లోపడ్డారు. ట్రాఫిక్‌ పోలీసులు ఆమె ఫుడ్‌ బిజినెస్‌ను క్లోజ్‌ చేశారు. ఎందుకో ఇప్పుడు చూద్దాం..

Kumari Aunty: హైదరాబాద్‌లో స్ట్రీజ్‌ఫుడ్‌ బిజినెస్‌ చేస్తూ.. రీల్స్‌తో వైరల్‌ అయి సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయిన కుమారి ఆంటీ చిక్కుల్లోపడ్డారు. ట్రాఫిక్‌ పోలీసులు ఆమె ఫుడ్‌ బిజినెస్‌ను క్లోజ్‌ చేశారు. ఎందుకో ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 30, 2024 | 5:38 PMUpdated Jan 30, 2024 | 8:12 PM
ట్రాఫిక్ పోలీస్ VS కుమారి ఆంటీ.. దెబ్బకి బిజినెస్ క్లోజ్ చేయించారు!

హైదరాబాద్‌లోని కేబుల్‌ బ్రిడ్జ్‌ పరిసరాల్లో స్ట్రీట్‌ ఫుడ్‌ బిజినెస్‌ చేసుకునే కుమారి ఆంటీ ఇటీవల సోషల్‌ మీడియాలో బాగా పాపులర్‌ అయ్యారు. రీల్స్‌, యూట్యూబ్‌ వీడియోలతో ఆమె పేరు ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఆమె వీడియోలకు కూడా భారీ క్రేజ్‌ వచ్చింది. చాలా మంది ఆమెతో వీడియో చేయడానికి, రీల్స్‌ చేయడానికి ఎగబడ్డారు. అలాగే పలు చిన్న చిన్న యూట్యూబ్‌ ఛానెల్స్‌ వాళ్లు ఆమెతో ఇంటర్వ్యూల కోసం క్యూ కట్టారు. ఈ క్రమంలోనే ఆమెకు ప్రతి నెల లక్షల్లో ఆదాయం వస్తుందని వార్త వైరల్‌గా మారింది. దీంతో ఆమె గురించి ప్రతి చిన్న విషయం కూడా వైరల్‌ అయింది. ఇప్పుడు అదే ఆమెను కష్టాల్లో నెట్టినట్లు కనిపిస్తోంది.

ఆమెకు వచ్చిన పాపులారిటీతో ఆమె వద్ద భోజనం చేసేందుకు జనం ఎగబడ్డారు. అక్కడికి తినేందుకు వచ్చే వారికంటే ఆమె వీడియోలు తీసేందుకు వచ్చే వారి సంఖ్య ఎక్కువైంది. దీంతో ఆ రోడ్డులో ట్రాఫిక్‌కు సమస్యగా మారింది. రోడ్డు పక్కనే ఆమె బండి ఉండటం, జనం భారీగా రావడంతో.. రోడ్డుపై బైకులు, కార్లు భారీగా నిలిచిపోయాయి. అక్కడే రోడ్డుపైనే అక్కడికి వచ్చిన వారు బండ్లు నిలిపివేయడంతో రాకపోకలకు ఇబ్బందికి మారింది. దీంతో ట్రాఫిక్‌ పోలీసులు రంగంలోకి దిగారు. ఆమెను అక్కడ భోజనం అమ్మడానికి వీల్లేదని అడ్డుకున్నారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతుందని, ఇలా రోడ్డుపై బిజినెస్‌ చేయడానికి అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పేశారు. దీంతో కొద్దిసేపు కుమారి ఆంటీ, ట్రాఫిక్‌ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

ఈ క్రమంలోనే కుమారి ఆంటీ మీడియాతో మాట్లాడుతూ.. ఇక్కడ తామొక్కరమే భోజనం అమ్మడం లేదని, చాలా మంది అమ్ముతున్నారని వారందరిని వదిలేసి.. పోలీసులు కేవలం తమనే టార్గెట్‌ చేశారని ఆరోపించారు. అలాగే.. మీడియా వాళ్లే తనకు ఇంత పేరు తీసుకొచ్చారని, అప్పటికీ ఇక్కడికి వచ్చే వారి ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చూడాలని చెబుతున్నానని, ఇప్పుడు మీడియా వాళ్లే తనకు న్యాయం చేయాలని వాపోయారు. కాగా ఈ విషయంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది వ్యూస్‌ కోసం ఆమె జీవనాధారాన్ని నాశనం చేశారని, ప్రశాంతంగా ఆమె బిజినెస్‌ ఆమె చేసుకుంటూ ఉంటే.. అన్ని లక్షలు ఇన్ని లక్షలు అంటూ హడావుడి చేసి.. ఆమెను సోషల్‌ మీడియాలో పాపులర్‌ చేశారని, ఇప్పుడా పాపులారిటీనే ఆమెకు, ఆమె బిజినెస్‌కు శాపంగా మారిందని పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.