ఈమె వాచ్ రూ. 30కోట్లు! హ్యాండ్ బ్యాగ్ రూ.43 లక్షలు! ఎవరీ రియా కొడాలి!

ఫ్యాషన్ డిజైనర్ రంగంలో రాణిస్తూ.. సత్తా చాటుతుంది తెలుగు అమ్మాయి రియా కొడాలి. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్లొని పలు విషయాలను పంచుకుంది. ఆ రియా బ్యాగ్రౌండ్ తెలిస్తే..

ఫ్యాషన్ డిజైనర్ రంగంలో రాణిస్తూ.. సత్తా చాటుతుంది తెలుగు అమ్మాయి రియా కొడాలి. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్లొని పలు విషయాలను పంచుకుంది. ఆ రియా బ్యాగ్రౌండ్ తెలిస్తే..

ఇటీవల ఫ్యాషన్ రంగం బాగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా కాస్ట్యూమ్ డిజైనర్స్‌కు బాగా డిమాండ్ పెరిగింది. మోడల్స్ నుండి సినీ సెలబ్రిటీల వరకు తమ డిజైన్లతో ఆకట్టుకుంటున్నారు. వీరితోనే తమ అవుట్ ఫిట్స్‌ను తమకు నచ్చినట్లుగా డిజైన్ చేయించుకుంటుంటారు. మనీష్ మల్హోత్రా, సబ్యసాచి ముఖర్జీ, తరుణ్ తహిలియాని, మసాబా గుప్తా, నీతా లుల్లా  దేశంలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లుగా గుర్తింపు పొందారు. ఇక సెలబ్రిటీలు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ పిల్లలు తమ పెళ్లిళ్లకు, పుట్టిన రోజులకు, ఇతర ఆకేషన్లకు వీరితో ప్రత్యేకంగా దుస్తులు డిజైన్ చేయించుకుంటారు. స్పెషల్ దుస్తులు డిజైన్ చేయించుకునేందుకు భారీగా డబ్బులు డిమాండ్ చేస్తారు.

ఈ రంగాన్నే ఎంచుకుని డిజైనర్‌గా, ఎంటర్ ప్రెన్యూయర్‌గా మారి నలుగురికి ఉపాధి కల్పిస్తుంది రియా కొడాలి. అమెరికాలో పుట్టి పెరిగిన అచ్చ తెలుగు అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది. ఆమె తండ్రిది విజయవాడలోని గుణదల కాగా, ఆమె తల్లిది ఏలూరు. నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్‌లకు సమీప బంధువు ఈమె. ఆమె ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తున్నారు. అనేక అవార్డులను కూడా తీసుకున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాలను పంచుకుంది. తాను రిచ్ లైప్ గురించి మాట్లాడుతూ.. తను ధరించిన వాచ్ .. 30 కోట్లు ఉంటుందని, తన వద్ద బ్యాగ్ రూ. 43 లక్షలు ఉంటుందని తెలిపింది. తన వాచ్ గురించి మాట్లాడుతూ.. డైమండ్స్, బంగారంతో కస్టమైజ్ చేయించుకున్న వాచ్ అని వెల్లడించింది. అలాగే బర్బరీ బ్యాగ్ అని, అలాగే తన కళ్లజోడు కేవలం 34 వేలు అని పేర్కొంది.

తన ఆస్తి 10 వేల కోట్లు ఉంటుందని పేర్కొంది. అంతేకాకుండా ఆమె ఎన్జీవో సంస్థనను కూడా నడుపుతుంది. 2982 మంది రేప్ బాధితులను దత్తత తీసుకుని, రియా కొడాలి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వీరి పోషణను చూస్తున్నారు. తన సంపాదన అంతా అక్కడికే వెళ్లిపోతుందని వెల్లడించారు. అలాగే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం.. తన మీద చాలా సార్లు రేప్ అంటప్ట్ జరగడం వల్ల.. ఆ బాధితులను పోషిస్తున్నట్లు తెలిపింది. ‘మాది చాలా ఎడ్యుకేట్ ఫ్యామిలీ, కానీ ఆడ పిల్లలు అంటే చులకన భావన ఉండేది. తల్లిదండ్రులే, అన్నే తన పట్ల విలన్స్, డొమొస్టిక్స్ వయెలెన్స్ ఉండేది, అందుకే చిన్నప్పడే ఇంట్లో నుండి వచ్చేశా’ అని వెల్లడించింది.  తన తల్లి చిన్నప్పుడే కొట్టేదని, పదో తరగతి అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసినట్లు తెలిపింది. ఆ తర్వాత డిజైనర్ గా మారి.. ఈ స్థాయికి ఎదగడం గురించి పేర్కొంది. ఐపీఎల్ 2025లో టీం కొంటానని తెలిపింది. ఇంకా చాలా విషయాలు పంచుకుంది.

Show comments