iDreamPost
android-app
ios-app

సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. కానీ నలుగురితో కలిసి

  • Published Sep 30, 2024 | 6:26 PM Updated Updated Sep 30, 2024 | 6:26 PM

మంచి ఉద్యోగం, లగ్జరీ లైఫ్. కోరుకున్న జీవితం. కానీ ప్రియుడి ఫోన్ కోసం మాస్టర్ ప్లాన్ వేసి వార్తల్లో నిలిచింది ప్రియురాలు. దీని కోసం సుపారీ కూడా మాట్లాడింది. ఎందుకంటే..?

మంచి ఉద్యోగం, లగ్జరీ లైఫ్. కోరుకున్న జీవితం. కానీ ప్రియుడి ఫోన్ కోసం మాస్టర్ ప్లాన్ వేసి వార్తల్లో నిలిచింది ప్రియురాలు. దీని కోసం సుపారీ కూడా మాట్లాడింది. ఎందుకంటే..?

  • Published Sep 30, 2024 | 6:26 PMUpdated Sep 30, 2024 | 6:26 PM
సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. కానీ నలుగురితో కలిసి

ఈ ఫోటోలో కనిపిస్తున్న యువతి పేరు శృతి. సాఫ్ట్ వేర్ ఉద్యోగి. మంచి జీతం. లగ్జరీ లైఫ్. దేనికి లోటు లేదు. కానీ ఇప్పుడు చోరీ చేయించి వార్తల్లో నిలిచింది. బ్యాంకుకు కన్నమేయించిందో, బంగారం, ఇతర వస్తువులు కొట్టేయమని కుట్ర పన్నిందో అనుకుంటున్నారా..? కానే కాదు.. ఓ సెల్ ఫోన్ కొట్టేందుకు మాస్టర్ ప్లాన్ వేసి బెడిసి కొట్టి పోలీసులకు చిక్కింది ఈ టెకీ. అదీ కూడా ప్రియుడి సెల్ ఫోన్. మొబైల్ దొంగిలించేందుకు నలుగుర్ని సెట్ చేసింది . ప్రియుడి పక్కనే ఉండి పథకం రచించింది. కానీ లవర్ ఊరుకోలేదు.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రియుడి సెల్ ఫోన్ కొట్టేయడమెందుకు అడిగితే ఇస్తాడు కదా అనుకోవచ్చు. కానీ అసలు తిరకాసు ఇక్కడే ఉంది. అసలు ఇంతకు ఏం జరిగిందంటే..?

ప్రియుడితో గొడవలు వస్తుండటంతో విడిపోదామని నిర్ణయించుకుంది శృతి. అతడి ఫోనులో తామిద్దం క్లోజ్‌గా ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోలు, వీడియోలు ఉన్నాయని గుర్తించి.. వాటిని చూపించి భవిష్యత్తులో బెదిరిస్తాడని భయపడింది. దీంతో ఆ ఫోనును సొంతం చేసుకోవాలని, దొంగతనం నాటకం ఆడింది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శృతి, తన సహోద్యోగి వంశీ కృష్ణ ప్రేమించుకున్నారు. వీకెండ్ వస్తే చాలు సినిమాలు, షికార్లు, లైఫ్ ఎంజాయ్ చేశారు. ఇక వందల కొద్దీ ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. ఈ ఇద్దరు రొమాంటిక్‌గా ఉన్నప్పుడు కూడా పిక్స్ తీసుకుని భద్రంగా దాచుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో వంశీకృష్ణతో గొడవలు అయ్యాయి శృతికి. అతడికి బ్రేకప్ చెప్పేయాలనుకుంది. కానీ అతడి ఫోనులో ఉన్న తన ఫోటోలు, వీడియోల పరిస్థితి ఏంటీ అని ఆలోచించింది.  వాటితో బెదిరిస్తే ఎలా అని ఆలోచించింది.

ఫోన్ అడిగితే వంశీ ఇవ్వడు కనుక ఫోనే కొట్టేస్తే పోలా.. అదిరిపోలా అని బుర్రలో ప్లాన్ సిద్ధం చేసుకుంది. ఇందుకు సురేశ్, వెంకటేశ్, మనోజ్, హోన్నప్ప అనే నలుగురు యువకుల్ని మాట్లాడుకుంది. ఫోన్ దోచేసి.. అందులోని డేటాను తొలగించాలని తెలిపింది. ప్రియుడితో కలిసి బోగనహళ్లికి వెళుతుండగా.. నలుగురు యువకులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. కారులో వచ్చిన నలుగురు యువకులు బైక్‌ను కావాలనే ఢీకొట్టి.. వంశీతో గొడవపడ్డారు. ఆ తర్వాత రూ. 90వేల విలువైన మొబైల్ లాక్కున్నారు. తన ప్లాన్ పక్కాగా పారినందుకు ఓ వైపు సంబరపడిపోతున్న శృతి.. ఫోన్ పోతేపోయిందిలే వదిలేయ్ అంటూ ప్రియుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. అయితే వంశీ మాత్రం.. వదిలిపెట్టలేదు. కారు నంబర్ ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే.. అప్పుడు తెలిసింది.. లవర్ చేసిన నిర్వాకం. దీంతో తెల్లబోవడం అతడి వంతైంది.  ప్రియురాలి ఇచ్చిన షాక్ కు గురుడికి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యిందన్నమాట..? ఏమంటారు.?

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetBetsmovefixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet