iDreamPost
android-app
ios-app

మెట్రో రైలులో లవర్స్ రొ*మాన్స్.. ఈసారి రంగంలోకి దిగిన పోలీసులు!

  • Published May 07, 2024 | 4:57 PM Updated Updated May 07, 2024 | 4:57 PM

ఒకప్పుడు లవర్స్ స్పాట్‌గా ఉండేవి పార్కులు. కానీ నేడు పార్కులు వెళ్లాల్సిన పని లేకుండానే బహిరంగంగానే రొమాన్స్ చేస్తున్నారు. ఇప్పుడు మెట్రో రైల్స్ ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్నాయి.

ఒకప్పుడు లవర్స్ స్పాట్‌గా ఉండేవి పార్కులు. కానీ నేడు పార్కులు వెళ్లాల్సిన పని లేకుండానే బహిరంగంగానే రొమాన్స్ చేస్తున్నారు. ఇప్పుడు మెట్రో రైల్స్ ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్నాయి.

  • Published May 07, 2024 | 4:57 PMUpdated May 07, 2024 | 4:57 PM
మెట్రో రైలులో లవర్స్ రొ*మాన్స్.. ఈసారి రంగంలోకి దిగిన పోలీసులు!

పడకగదిలో చేయాల్సిన రొమాన్స్‌ను బహిరంగంగా చేస్తున్నారు కొంత మంది లవ్ బర్డ్స్. గతంలో పార్కులో ముద్దు మురిపాల నుండి అన్ని కానిచ్చేసే వారు.. కానీ నేడు నిసిగ్గుగా, నిర్లజ్జగా నడి రోడ్డుపై, రైల్వే స్టేషన్లలో, మెట్రో రైళ్లలో శృంగారం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. బైక్ పై అమ్మాయిని ఎదురు కూర్బోబెట్టుకుని రయ్ అంటూ దూసుకెళ్లడాలు, బస్సుల్లో పక్క పక్కన నుంచొని.. చిలిపి చిలిపి పనులు చేసుకుంటూ జనాలకు ఇబ్బంది కలిగించిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఇక మెట్రో రైళ్ల సంగతి చెప్పనక్కర్లేదు. మగవాళ్లే కాదు అమ్మాయిలు కూడా రెచ్చిపోతున్నారు. హోలీ పండుగ సమయంలో రొమాంటిక్ గా రంగులు పూసుకుంటూ దొరికిపోయిన సంగతి విదితమే. ఈ వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

ఇప్పుడు మరో మెట్రో రైలులో దారుణమైన ఘటన వెలుగు చూసింది. అందులో అమ్మాయి, అబ్బాయి ఎదురెదుగా నిలబడి.. కౌగిలించుకున్నారు. ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతుంది. వీడియోలో ఈ ఇద్దరు లవర్స్ కనిపిస్తుండగా.. అమ్మాయిని దగ్గరగా తీసుకుని.. శరీర అవయవాలు తాకే విధంగా టచ్ చేస్తూ.. అమ్మాయి తలమీద నిమురుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులోని మెట్రోలో చోటు చేసుకుంది. ఈ వీడియోను కెపీఎస్బీ 52 అనే నెటిజన్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేస్తూ.. ‘ఏం జరుగుతుంది మన మెట్రోలో. మెల్లిగా బెంగళూరు మెట్రో కాస్త డిల్లీ మెట్రోగా మారుతుంది. దీనిపై యాక్షన్ తీసుకోండి. ఆ అమ్మాయి.. అతడిని ముద్దు పెట్టుకుంది’ అంటూ రాశాడు.

కాగా, ఇందులో లవర్స్ ఫేసెస్ రివీల్ కావడం లేదు కానీ.. వీరి చర్యలు కాస్త గుజుప్సకరంగా ఉన్నాయి. తాము మెట్రోలో ఉన్నామని, తోటి ప్రయాణీకులు ఉన్నారన్న సంగతి కూడా మరచి రొమాన్స్ చేసుకుంటున్నారు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమ చేతికి పని చెప్పారు. ఇలాంటి పనులు ఇతరులకు అసౌకర్యాన్ని కలిగిస్తుందని కొంత మంది వాదిస్తుండగా, ఈ వీడియో తీసి.. వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించిని వ్యక్తిని జరిమానా విధించాలని పేర్కొంటున్నారు. ఇందులో ఎలాంటి అశ్లీలత లేదని, ఇలాంటివి ఇప్పుడు కామన్ అంటూ రాసుకొచ్చారు. కాగా, ఈ ఘటనపై బెంగళూరు సిటీ పోలీసులు స్పందించారు. ‘ ఈ వీడియో మా దృష్టికి వచ్చింది. దయచేసి మీ కాంటాక్ట్ నంబర్ ను డీఎం ద్వారా అందించండి’ అంటూ రిప్లై ఇచ్చింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom