iDreamPost
android-app
ios-app

VIDEO: 8 ఏళ్లుగా బర్త్ డే జరుపుకోని విద్యార్థి.. టీచర్ ఇచ్చిన సర్ ప్రైజ్ కి బోరున ఏడ్చాడు!

  • Published Nov 10, 2023 | 6:22 PM Updated Updated Nov 10, 2023 | 6:22 PM

ఈ పిల్లాడు పుట్టి 8 ఏళ్లు కావొస్తుంది. కానీ, ఏనాడు కూడా పుట్టిన రోజు వేడుకలు జరుపుకోలేదు. ఈ విషయం అతని క్లాస్ టీచర్ కు తెలియడంతో ఈ సారి అతని పుట్టిన రోజుకు ఆ విద్యార్థికి సర్ ప్రైజ్ ఇవ్వాలని అనుకుంది.

ఈ పిల్లాడు పుట్టి 8 ఏళ్లు కావొస్తుంది. కానీ, ఏనాడు కూడా పుట్టిన రోజు వేడుకలు జరుపుకోలేదు. ఈ విషయం అతని క్లాస్ టీచర్ కు తెలియడంతో ఈ సారి అతని పుట్టిన రోజుకు ఆ విద్యార్థికి సర్ ప్రైజ్ ఇవ్వాలని అనుకుంది.

  • Published Nov 10, 2023 | 6:22 PMUpdated Nov 10, 2023 | 6:22 PM
VIDEO: 8 ఏళ్లుగా బర్త్ డే జరుపుకోని విద్యార్థి.. టీచర్ ఇచ్చిన సర్ ప్రైజ్ కి బోరున ఏడ్చాడు!

మారిన కాలానికి అనుగుణంగా అందరూ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఏడాది పిల్లల నుంచి వృద్దుల వరకు.. అంతా బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటుంటారు. ఇక పుట్టిన ఏడాదికే వారి తల్లిదండ్రులు పిల్లల పుట్టిన రోజును ఘనంగా చేయాలని ముందే ప్లాన్ చేసుకుంటారు. ఇక ఈ వేడుకకు వారి బంధువులతో పాటు ఊళ్లోని జనాలనంతా పిలిచి మంచి భోజనం పెడతారు. ఇలా వారి స్థోమతను బట్టి పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. కానీ, కొందరు ఆర్థిక సమస్యల కారణంగా ఇలాంటి వేడుకులకు ఆమాడ దూరంలో ఉంటారు. అచ్చం ఇలాగే ఓ 8 ఏళ్ల బాలుడు పుట్టినప్పటి నుంచి ఇంతకు వరకు బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకునే అదృష్టం రాలేదు. ఎందుకంటే అతని తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అలాంటిది. కానీ, ఇటీవల ఆ పిల్లాడి పుట్టిన రోజు మాత్రం అతని క్లాస్ టీచర్ ఊహించని సర్ ఫ్రైజ్ ఇచ్చింది. దీంతో ఆ విద్యార్థి బోరున ఏడ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొలంబియలోని ఓ ప్రాంతంలో ఏంజెల్ డేవిడ్ అనే 8 ఏళ్ల బాలుడు నివాసం ఉంటున్నాడు. ఇతడు స్థానికంగా ఉండే ఓ స్కూల్ లో చదువుకుంటున్నారు. మరో విషయం ఏంటంటే? ఇతని తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితుల కారణంగా పుట్టి ఇన్ని రోజులు అవుతున్నా.. ఏనాడు ఆ బాలుడి బర్త్ డే నిర్వహించలేదు. ఇదే విషయం అతని క్లాస్ టీచర్ కు తెలియడంతో చాలా బాధపడింది. ఈసారి ఆ బాలుడి పుట్లిన రోజున ఎలాగైన అతనికి సర్ ప్రైజ్ చేసి గ్రాండ్ గా పుట్టిన రోజు వేడులను జరపాలని అనుకుంది. అందు కోసం క్లాస్ రూమ్ నే వేదికగా చేసుకుంది. అయితే ఇటీవల ఏంజెల్ పుట్టిన రోజున క్లాస్ కు వచ్చాడు. అంతకంటే ముందే టీచర్ బెలూన్స్ తో క్లాస్ రూమ్ అంతా డెకరేట్ చేశారు.

ఇక అతడు క్లాస్ లోకి రాగానే టీచర్ తోపాటు అంతా హ్యాపీ బర్త్ డే ఏంజెల్ డేవిడ్ అంటూ విశేష్ చెప్పారరు. ఈ టీచర్ ఇచ్చిన ఆ సర్ ప్రైజ్ కు ఆ పిల్లాడు ఆనందంతో మురిసిపోయాడు. ఇంతే కాకుండా వారి క్లాస్ టీచర్ ఇచ్చిన సర్ ప్రైజ్ కి ఆ విద్యార్థి సంతోషంతో బోరున ఏడ్చాడు. ఇదంతా కొందరు వ్యక్తులు సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు. అదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఆ పిల్లాడికి బర్త్ రోజు సర్ ప్రైజ్ ఇచ్చిన ఆ క్లాస్ టీచర్ మంచి మనసుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Hear Her Stories 📣 (@hearherstories)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet