SGT, SA ఉద్యోగాలకు ఎంపికై.. నియామక పత్రం అందుకున్నా.. చివరకు నిరాశే!

ఉద్యోగం సాధించడం ప్రతిఒక్కరి కల. జాబ్ సాధించి లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంటారు. అయితే ఈ యువతికి మాత్రం వింత పరిస్థితి తలెత్తింది. జాబ్ వచ్చాక కూడా ఉద్యోగంలో చేరలేకపోయింది. కారణం ఏంటంటే?

ఉద్యోగం సాధించడం ప్రతిఒక్కరి కల. జాబ్ సాధించి లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంటారు. అయితే ఈ యువతికి మాత్రం వింత పరిస్థితి తలెత్తింది. జాబ్ వచ్చాక కూడా ఉద్యోగంలో చేరలేకపోయింది. కారణం ఏంటంటే?

ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలని చాలామంది లక్ష్యంగా పెట్టుకుంటారు. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తుంటారు. రేయింభవళ్లు పుస్తకాలతో కుస్తీపడుతుంటారు. టీచర్ జాబ్ సాధించాలని కలలుకంటుంటారు. డీఎస్సీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం టీచర్ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ డీఎస్సీలో పలువురు అద్భుతమైన ప్రతిభ కనబర్చారు. ఒకే డీఎస్సీలో రెండు ఉద్యోగాలు సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించారు. స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ పోస్టులకు ఎంపికై ఔరా అనిపించారు. ఇదే విధంగా ఓ యువతి డీఎస్సీలో మెరిసింది. అంకితభావంతో చదివి 2024 డీఎస్సీలో మంచి ర్యాంకు సొంతం చేసుకుంది.

ఎస్జీటీతో పాటు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైంది. ఇక తన ఆనందానికి అవధులు లేవు. టీచర్ జాబ్ సాధించాలనే తన కల నెరవేరిందని ఉప్పొంగిపోయింది. కానీ, ఊహించని ఘటన ఎదురైంది. టీచర్ జాబ్ కు ఎంపికై తీరా ఉద్యోగంలో చేరేందుకు వెళితే లేదని చెప్పడంతో ఆ యువతి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నది. దీనికి కారణం అధికారుల నిర్లక్ష్యం. అధికారుల తప్పిదంతో ఉద్యోగావకాశం చేజారే పరిస్థితి తలెత్తింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం తొర్లికొండకు చెందిన రచన డీఈడీ, బీఈడీ పూర్తి చేసింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ (సోషల్) విభాగంలో 5వ ర్యాంకు, ఎస్జీటీ విభాగంలో 60వ ర్యాంకు కైవసం చేసుకుంది.

ఈ క్రమంలో అక్టోబర్ 8న డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు హాజరయ్యారు. అయితే స్కూల్ అసిస్టెంట్ విభాగంలో పోస్టులు మూడే ఉండడంతో తనకు వచ్చే అవకాశం లేదని గ్రహించింది. దీంతో ఎస్జీటీ పోస్టు ఎంచుకునేందుకు అధికారుల వద్దకు వెళ్లారు. కానీ, అధికారులు ఎస్ఏ పోస్టు వస్తుందని, ఎస్సీ రిజర్వేషన్ ఉన్నందున ఆ పోస్టునే ఎంపిక చేసుకోవాలని చెప్పడంతో ఎస్జీటీ పోస్టుకు నాట్ విల్లింగ్ లెటర్ ఇచ్చింది. అయితే అక్టోబర్ 9న సీఎం చేతుల మీదుగా జరిగిన నియామక పత్రాల అందజేత కార్యక్రమానికి రచనను తీసుకెళ్లారు. ఎస్ ఏ పోస్టుకు ఎంపికైనట్లు రచనకు నియామక పత్రం ఇచ్చారు. మరుసటి రోజు ఉద్యోగంలో చేరేందుకు డీఈవో కార్యాలయానికి వెళ్తే.. కంప్యూటర్ తప్పిదంతో ఉద్యోగం లేదని అధికారులు సమాధానం చెప్పారు.

దీంతో రచన ఒక్కసారిగా నిరాశలో కూరుకుపోయింది. విద్యాశాఖ అధికారుల సూచనతోనే ఎస్ ఏ పోస్టు ఎంపిక చేసుకున్నానని.. ఇప్పుడు జాబ్ లేదంటున్నారని రచన ఆవేధన వ్యక్తం చేసింది. తనకు జాబ్ ఇప్పించాలని కలెక్టర్, డీఈవోకు వినతిపత్రం అందించారు. స్పందించిన అధికారులు రెండు రోజుల్లో ఈ సమస్య పరిష్కారమవుతుందని వెల్లడించారు. ఉద్యోగాలకు ఎంపికైనా.. అధికారుల నిర్లక్ష్యంతో పోస్టింగ్ మిస్ అవ్వడంతో యువతి బాధ వర్ణనాతీతంగా మారింది. మరి టీచర్ జాబ్స్ సాధించినప్పటికీ.. అధికారుల తప్పిదం కారణంగా పోస్టింగ్ మిస్ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments