Keerthi
తెలంగాణలో కొత్త ప్రభుత్వం అమలు చేసిన 6 గ్యారెంటీ పథకాలను శరవేగంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అభయహస్తం పేరిట ప్రజలు వద్ద దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే దీని పై స్పందించిన ప్రభుత్వం దళారులకు ఊహించని షాక్ ఇచ్చింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభత్వం మరో కొొత్త ప్రకటన చేసింది. అదేమిటంటే..
తెలంగాణలో కొత్త ప్రభుత్వం అమలు చేసిన 6 గ్యారెంటీ పథకాలను శరవేగంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అభయహస్తం పేరిట ప్రజలు వద్ద దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే దీని పై స్పందించిన ప్రభుత్వం దళారులకు ఊహించని షాక్ ఇచ్చింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభత్వం మరో కొొత్త ప్రకటన చేసింది. అదేమిటంటే..
Keerthi
తెలంగాణలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చేక 6 గ్యారెంటీలు పథకాలను అమలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగానే.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈ నెల 9తేదిన సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా అమలులోకి తెచ్చారు. అలాగే డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు గ్రామ సభలు నిర్వహించి ఈ 6 గ్యారెంటీలకు ధరఖాస్తులు స్వీకరిస్తమని తెలిపారు. కాగా, చెప్పిన విధంగానే గురువారం నుంచి మహలక్ష్మి పథకలు ప్రారంభం అయ్యాయి. ఇక కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాల కోసం ప్రజలు ధరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ క్రమంలోనే.. పలు జిల్లాల్లో ప్రజలు ధరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే ఈ అభయ హస్తం ఫామ్ పేరిట మీ సేవ జీరాక్స్ కేంద్రాల్లో ఒక్కో ఫామ్‌ను రూ. 50 నుంచి రూ. 80 వరకు అమ్ముకుంటున్నారు. దీంతో ప్రజలు చేసేది ఏమి లేక జిరాక్స్ షాపు సెంటర్లలో భారీ ఎత్తున పడిగాపులు కాస్తున్నారు. కాగా, దీనిపై స్పదించిన ప్రభుత్వం ఈ అభయహస్తం ఫామ్స్ కోసం తాజా ప్రకటన చేసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..
ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శరవేగంగా హామీ ఇచ్చిన పథకాలను అమలులోకి తెస్తోంది. ఇప్పటికే ప్రతిజిల్లాలో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. అయితే ఈ అభయ హస్తం ఫామ్ కోసం ప్రజలు మీ సేవ జీరాక్స్ కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రభుత్వం ఈ ధరఖాస్తు ఫామ్‌లను ప్రభుత్వమే ఉచితంగా అందిస్తారని, వీటి కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన పని లేదని అధికారలు ప్రజలకు వివరిస్తున్నారు.
కాగా, రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోను వార్డులను ఏర్పాటు చేశామని, ఆ వార్డుల వద్దకు వెళ్లి ఉచితంగా ఫామ్‌ను తీసుకోవాలని ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. ఇక ఈ ఉచిత పథకాలకు ఉచితంగానే ఫామ్ నీ స్వీకరించాలి అని అధికారులు చెప్తున్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ఈ ధరఖాస్తులను ఫోన్ లో కూడా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి వెసులుబాటును కల్పించింది. మీకు కూడా అభయ హస్తం దరఖాస్తు కాలనుకుంటే.. ఇక్కడ కనిపిస్తున్న ఈ లింక్ ద్వారా (https://drive.google.com/file/d/1Wc9Eeo83xj3Cyp2LZjQrmKS4c1XI-WQq/view) అభయ హస్తం దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇక తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న గ్రామ సభలకు ప్రజా పాలకుల నుంచి విశేష ఆదరణ వచ్చింది. ఈ సభల వద్దకు ప్రజలు పెద్ద మొత్తంలో లైన్లు కడుతున్నారు. అలాగే ఈ అభయహస్తం పథకాలలో భాగమైన ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, చేయూత, ఇతర పథకాల కోసం ధరఖాస్తు చేసుకున్నారు. ఇక అభయహస్తం ధరఖాస్తుల కోసం కావాలసినవి ఆధార్ కార్డు నెంబర్, జిరాక్స్ కాపీ, రేషన్ కార్డు నెంబర్, జిరాక్స్ కాపీ, ఫోన్ నెంబర్, గ్యాస్ కనెక్షన్ నెంబర్, కంపెనీ పేరు, భూమి ఉంటే.. మీ భూమి పాస్ పుస్తకం నెంబర్, సర్వే నెంబర్లు, విస్తీర్ణం వివరాలు, కరెంట్ మీటర్ నెంబర్, అమరవీరులు, ఉద్యమకారులు అయితే డెత్ సర్టిఫికెట్, FIR నెంబర్, జైలు, శిక్ష వివరాలను పూరించి జత చేయాలి. మరి, ఈ అభయహస్తం పథకాల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.