iDreamPost
android-app
ios-app

TSRTC బస్సులో వెళ్లే వారికి వండర్‌లా బంపరాఫర్‌.. టికెట్స్‌పై భారీ డిస్కౌంట్

  • Published May 03, 2024 | 4:00 PM Updated Updated May 03, 2024 | 4:00 PM

Wonderla: వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడం కోసం వండర్‌లా వెళ్లాలని భావిస్తున్నారా.. అయితే మీకో గుడ్‌న్యూస్‌. వండర్‌లా ఓ బంపరాఫర్‌ ప్రకటించింది. ఆ వివరాలు..

Wonderla: వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడం కోసం వండర్‌లా వెళ్లాలని భావిస్తున్నారా.. అయితే మీకో గుడ్‌న్యూస్‌. వండర్‌లా ఓ బంపరాఫర్‌ ప్రకటించింది. ఆ వివరాలు..

  • Published May 03, 2024 | 4:00 PMUpdated May 03, 2024 | 4:00 PM
TSRTC బస్సులో వెళ్లే వారికి వండర్‌లా బంపరాఫర్‌.. టికెట్స్‌పై భారీ డిస్కౌంట్

ఎండలు మండిపోతున్నాయి. బయటకు అడుగుపెడదామంటేనే భయపడే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఓ రేంజ్‌లో ప్రతాపం చూపుతున్నాడు. మే ప్రారంభంలోనే 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక రోహిణి కార్తెలో ఎలా ఉండనుందో అని జనాలు బెంబెలెత్తిపోతున్నారు. మండే ఎండలకు తోడు వడగాడ్పులు కూడా వీస్తుండటంతో.. జనాల ఇబ్బందుల గురించి చెప్పడానికి మాటలు లేవు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.

ఇక వేడి బారి నుంచి తప్పించుకోవడం కోసం.. చల్లని ప్రదేశాలకు టూర్లకు వెళ్లాలని ప్లాన్‌ చేసుకుంటున్నారు చాలా మంది. దాంతో పాటు నగంలోని వాటర్‌ పార్కులకు కూడా పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. మీరు కూడా ఇలానే వాటర్‌ పార్కులకు వెళ్లాలని భావిస్తున్నారా.. అయితే హైదరాబాద్‌లోని వండర్‌లా మీకు అదిరిపోయే డిస్కౌంట్‌ ఆఫర్‌ ఇవ్వనుంది. ఆ వివరాలు..

Wonderla

వేడి బారి నుంచి తప్పించుకోవడం కోసం మీరు కూడా వాటర్ పార్క్ వెళ్లాలనుకుంటున్నారా.. అయితే మీకో గుడ్‌న్యూస్‌. హైదరాబాద్‌లోని వండర్‌లా వాటర్ పార్క్ అదిరిపోయే డిస్కౌంట్స్ ప్రకటిస్తోంది. అయితే ఈ ఆఫర్‌ అందరికి కాదు. కేవలం టీఎస్ఆర్‌టీసీ బస్సులో ప్రయాణించే వారికి మాత్రమే. ఏంటా ఆఫర్‌ అంటే.. ఆర్టీసీ బస్సులో.. వండర్‌లా వచ్చేవారికి భారీ డిస్కౌంట్ అందిస్తోంది. మీరు టీఎస్ఆర్‌టీసీ బస్సులో వండర్‌లా వెళ్తే పార్క్ ఎంట్రీ టికెట్స్‌పై 15 శాతం తగ్గింపు పొందొచ్చు. హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రాంతాల నుంచి వండర్‌లాకు టీఎస్ఆర్‌టీసీ బస్సులు ఉన్నాయి. ఈ బస్సుల్లో ప్రయాణించి.. వండర్‌లా వచ్చే వారికి.. పార్క్ ఎంట్రీ టికెట్స్‌పై 15 శాతం డిస్కౌంట్ ఆఫర్‌ అందిస్తోంది.

మీరు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి.. వండర్‌లాకి వెళ్తే.. అక్కడ టికెట్ కౌంటర్‌లో టీఎస్ఆర్‌టీసీ టికెట్స్ చూపిస్తే.. పార్క్‌ ఎంట్రీ టికెట్స్‌పై మీకు 15 శాతం డిస్కౌంట్ వర్తిస్తుంది. ఆన్‌లైన్ బుకింగ్స్ చేసినవారికి ఈ ఆఫర్ వర్తించదు. అంతేకాక ఈ ఆఫర్ రెగ్యులర్ అడల్ట్, చైల్డ్ టికెట్స్‌కి మాత్రమే వర్తిస్తుంది. ఇతర కేటగిరీల టికెట్స్‌కు ఈ ఆఫర్ వర్తించదు. అదే రోజు ప్రయాణించిన టికెట్‌కు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. టికెట్‌లో డెస్టినేషన్ కూడా వండర్‌లా వరకే ఉండాలి. వండర్‌లా టికెట్స్‌పై ఇతర ఆఫర్స్ పొందాలనుకుంటే టీఎస్ఆర్‌టీసీ బస్ టికెట్ ఆఫర్ వర్తించదు. ఏదైనా ఒక ఆఫర్ మాత్రమే పొందే అవకాశం ఉంటుంది.

Wonderla

ఇక వేసవి సెలవుల కారణంగా పర్యాటకులను ఆకర్షించడం కోసం వండర్‌లా అనేక ఆఫర్స్ అందిస్తోంది. ఇప్పటికే సిజ్లింగ్ ఏప్రిల్ ఆఫర్‌లో భాగంగా 20 శాతం డిస్కౌంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పది, ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు పార్క్ ఎంట్రీ టికెట్స్‌పై 35 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. వండర్‌లా అందిస్తున్న ఆఫర్స్ పూర్తి వివరాలను https://www.wonderla.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

Jojobet GirişMadridbetMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetcasibomcasibompokerklas giriş