Krishna Kowshik
మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు.. అని ఓ సినీ కవి చెప్పినట్లుగా.. ఈ రోజుల్లో మాట సాయం చేసేందుకు కూడా వెనకాడుతున్నారు. కానీ ఇంకా మానవత్వం మిగిలే ఉందని కొన్ని సంఘటనలు నిరూపిస్తున్నాయి.
మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు.. అని ఓ సినీ కవి చెప్పినట్లుగా.. ఈ రోజుల్లో మాట సాయం చేసేందుకు కూడా వెనకాడుతున్నారు. కానీ ఇంకా మానవత్వం మిగిలే ఉందని కొన్ని సంఘటనలు నిరూపిస్తున్నాయి.
Krishna Kowshik
ఎవరైనా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగి పడిపోతే.. ఆ మనకెందుకులే అని పట్టించుకోవడం మానేస్తున్నారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నా చూసి కూడా చూడనట్లు వెళ్లిపోతుంటారు. ఒక వేళ దారిలో ఆ వ్యక్తికి ఏదైనా అయితే, లేనిపోనిది తలమీదకు తెచ్చుకోవడం ఎందుకు ఆలోచించి.. అక్కడ నుండి వెళ్లిపోతుంటారు. అంతెందుకు ఎవరికైనా మాట కూడా సాయం చేయడం లేదు. ప్రస్తుతం సమాజం తీరు ఇలానే ఉంది. మనిషిలో మానవత్వం కొరవడుతున్న వేళ.. ఇంకా ఎక్కడో కొంత మానవత్వం మిగిలి ఉందని కొన్ని సంఘటనలు నిరూపిస్తున్నాయి. ఇప్పుడు అలాంటి దృశ్యమే ఓ ఆర్టీసీ బస్టాండులో చోటుచేసుకుంది. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ నిండు గర్భిణీకి ప్రసవం చేసి హ్యుమానిటీ చూపించారు ఆర్టీసీ సిబ్బంది.
కరీంనగర్ బస్టాండ్‌లో మానవత్వం పరిమళించే సంఘటన చోటుచేసుకుంది. నిండు గర్భిణీ.. కాన్పు నొప్పులతో బాధపడుతుంటే..ఆసుపత్రికి తీసుకెళ్లే సమయం కూడా లేకపోవడంతో ఆర్టీసీ మహిళా సిబ్బంది ముందు చూపు ప్రదర్శించి.. బస్టాండ్ ఆవరణలో చీరలను అడ్డుగా కట్టి.. డెలివరీ చేశారు. ఈ విషయాన్ని టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. కరీంనగర్ స్టేషన్ మేనేజర్ రజనీ కృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశాకు చెందిన వలస కూలీలు దూల, కుమారి దంపతులు. పెద్దపల్లి జిల్లా కాట్నపల్లి ఇటుకబట్టీలో వీరు పని చేస్తున్నారు. కుమారి నిండు చూలాలు. ఆదివారం సాయంత్రం కుంట వెళ్లేందుకుగాను కరీంనగర్ బస్టాండ్‌కు వచ్చారు. అక్కడకు రాగానే కుమారికి పురిటి నొప్పులు మొదలయ్యాయి.
వెంటనే భర్త దూల ఆమెను పక్కన పడుకోబెట్టి.. తన భార్య నొప్పులతో బాధపడుతుందని సాయం చేయాలని ఆర్టీసీ అధికారులను వేడుకున్నాడు. వెంటనే అధికారులు 108కి సమాచారం అందించారు. ఈ లోగా నొప్పులు ఎక్కువ కావడంతో ఆర్టీసీ మహిళా స్వీపర్లు, సూపర్ వైజర్స్ ముందుకు వచ్చారు. అంబులెన్స్ రావడానికి కొంత సమయం పట్టడంతో.. చీరలను అడ్డుపెట్టి నార్మల్ డెలివరీ చేశారు. కుమారి పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. కొద్దిసేపటికి 108 అంబులెన్స్ రాగా, తల్లీ బిడ్డలను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సకాలంలో స్పందించిన ఆర్టీసీ సిబ్బంది పట్ల కృతజతలు తెలిపారు దంపతులు. కాగా, మహిళకు డెలివీర చేసి మానవత్వం చాటుకున్న ఆర్టీసీ సిబ్బందిపై పలువురు ప్రశంసల వర్షం కురిపించారు.
పరిమళించిన మానవత్వం!!
కరీంనగర్ బస్ స్టేషన్ లో నిండు చూలాలికి కాన్పు చేసిన #TGSRTC మహిళా సిబ్బంది మానవత్వం అభినందనీయం. మీరు సకాలంలో స్పందించి డెలివరీ చేయడం వల్లే తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు.
ప్రజలకు మెరుగైన సేవలను అందించడంలోనే కాదు.. మానవత్వం చాటుకోవడంలోనూ మేం ముందు ఉంటామని… pic.twitter.com/0TjCrFw3KI
— VC Sajjanar – MD TGSRTC (@tgsrtcmdoffice) June 17, 2024