iDreamPost
android-app
ios-app

చనిపోయిన భర్తకు బర్త్ డే వేడుకలు నిర్వహించిన భార్య!

Tandur: మొక్కలను నాటడం కారణంగా పచ్చదనం పెరగడం, వాతావరణం ఆహ్లాదంగా మారడం వంటి ఉపయోగాలున్నాయనే విషయం తెలిసిందే. కానీ ఓ కుటుంబానికి మాత్రం అది జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాన్ని మిగిల్చింది. విషాదాన్ని తొలగించి ప్రతి ఏటా వారికి మధురానుభూతుల్ని పంచుతోంది.

Tandur: మొక్కలను నాటడం కారణంగా పచ్చదనం పెరగడం, వాతావరణం ఆహ్లాదంగా మారడం వంటి ఉపయోగాలున్నాయనే విషయం తెలిసిందే. కానీ ఓ కుటుంబానికి మాత్రం అది జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాన్ని మిగిల్చింది. విషాదాన్ని తొలగించి ప్రతి ఏటా వారికి మధురానుభూతుల్ని పంచుతోంది.

చనిపోయిన భర్తకు బర్త్ డే వేడుకలు నిర్వహించిన భార్య!

పెళ్లి అనే బంధంతో ఇద్దరు మనుషులు ఒక్కటవుతారు. ఇక జీవితాంతం  కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడునీడగా ఉంటూ కలిసి జీవిస్తుంటారు. కొందరు అయితే తమ భాగస్వామిని వదలి క్షణం కూడా ఉండలేరు. భర్తను వదలి పుట్టింటికి వెళ్లేందుకు కూడా కొందరు భార్యలు అసలు ఇష్టపడరు. ఇది ఇలా ఉంటే.. ఇలా సంతోషంగా సాగిపోతున్నసమయంలో కొందరి జీవితాల్లో విధి చిన్నచూపు చూస్తుంది. ప్రాణానికి ప్రాణమైన భర్త మరణాన్ని తట్టులేకపోతారు. అయితే తమ భర్త జ్ఞాపకాలను తల్చుకుంటూ జీవితాన్ని ముందుకు సాగిస్తుంటారు. అలానే ఓ మహిళ చెట్టులో తన భర్త జ్ఞాపకాలను చూసుకుంటూ ఆయనకు పుట్టిన రోజు వేడుకలు కూడా నిర్వహిస్తుంది. మనస్సుకు హత్తుకునే ఈ ఘటన వికారబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

వికారాబాద్ జిల్లా తాండురుకు చెందిన కోట్రిక విజయలక్ష్మి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటుంది. ఆమె గతంలో తాండూరు మున్సిపల్ ఛైర్ పర్సన్ గా కూడా పని చేశారు. ఇది ఇలా ఉంటే.. కొంతకాలం క్రితం ఆమె భర్త వెంకటయ్య అనారోగ్య కారణంగా మరణించారు. అప్పటి వరకు తనను ఎంతో కంటికి రెప్పలా చూసుకున్న భర్త..అర్ధాంతరంగా తనను వదిలిపోవడంతో ఆమె మానసిక వేదనకు గురైంది. ఆయన జ్ఞాపకాలనే తల్చుకుంటూ బాధపడుతుండేది. ఇక తన భర్తకు జ్ఞాపకంగా ఓ చెట్టును పెంచుతుంది. అందులోనే తన భర్త జ్ఞాపకాలను చూసుకుంటూ జీవిస్తుంది.

సోమవారం తన భర్త వెంకటయ్య పుట్టిన రోజు వేడుకను కొత్తగా నిర్వహించింది. తాండూరులోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఓ చెట్టుకు మరణించిన తన భర్త డ్రెస్‌ వేసి వినూత్నంగా పుట్టిన రోజు వేడుక నిర్వహించంది. భర్తకు సంబధించిన కోటును ఆ చెట్టుకు వేసి.. భర్తకు జయంతిని నిర్వహించింది. ఎనిమిదేండ్ల క్రితం విజయలక్ష్మి భర్త వెంకటయ్య అనారోగ్యంతో ఉండగానే తన ఇంటి ఎదుట మొక్క నాటారు. ఆయన మరణానంతరం విజయలక్ష్మి ఆ మొక్కను జాగ్రత్తగా పెంచుతున్నారు. ప్రస్తుతం ఆ మొక్క పెరిగి చెట్టుగా మారింది. ఈ క్రమంలోనే ఏటా కుటుంబసభ్యులతో కలిసి ఆ చెట్టుకు బెలూన్స్‌ కట్టి..విజయలక్ష్మి భర్త పుట్టినరోజు వేడుక నిర్వహిస్తున్నారు.

ఇక జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఆమె ఇంటి ముందున్న ఈ చెట్టును తొలగించాలనే అధికారులు తెలిపారు. అయితే ఆమె తాండూరు వ్యవసాయ క్షేత్రంలోని శాస్త్రవేతల అనుమతితో ఆ చెట్టును అక్కడ నాటారు. జేసీబీ సహాయంతో తీసుకెసుకెళ్లి..ఆ చెట్టును వ్యవసాయ క్షేత్రంలో నాటారు. దీంతో ఆ చెట్టుకు పూజలు చేసి, పంచభక్ష పరమాన్నాలు పెట్టి వేడుక నిర్వహించింది. తన చెట్టులో తన భర్త జ్ఞాపకాలు చూసుకుంటున్నట్లు విజయలక్ష్మి తెలిపారు. ఇలా ఎంతో  మంది తమ భాగస్వామి జ్ఞాపకాలను వివిధ రూపాల్లో భద్రపర్చుకుంటున్నారు.