iDreamPost
android-app
ios-app

భార్య ఫోన్ స్విచ్ఛాప్.. ముగ్గురు పిల్లలతో రూబీనా ఎక్కడికెళ్లిందో..?

  • Published Jan 04, 2024 | 12:54 PM Updated Updated Jan 04, 2024 | 12:54 PM

నూతన సంవత్సరం రోజున ఆ కుటుంబం ఆనందంగా గడిపింది. జనవరి 2వ తేదీన భర్త పనుల నిమిత్తం బయటకు వెళ్లిపోయాడు. సాయంత్రం భార్యకు ఫోన్ చేయగా.. స్విచ్ఛాఫ్ అని వచ్చింది. తీరా ఇంటికి వెళ్లి చూస్తే..

నూతన సంవత్సరం రోజున ఆ కుటుంబం ఆనందంగా గడిపింది. జనవరి 2వ తేదీన భర్త పనుల నిమిత్తం బయటకు వెళ్లిపోయాడు. సాయంత్రం భార్యకు ఫోన్ చేయగా.. స్విచ్ఛాఫ్ అని వచ్చింది. తీరా ఇంటికి వెళ్లి చూస్తే..

  • Published Jan 04, 2024 | 12:54 PMUpdated Jan 04, 2024 | 12:54 PM
భార్య ఫోన్ స్విచ్ఛాప్.. ముగ్గురు పిల్లలతో రూబీనా ఎక్కడికెళ్లిందో..?

భార్యా భర్తల మధ్య గొడవల్లో పిల్లలు బలౌతున్నారు. జీవిత భాగస్వామిపై కోపాన్నంతా తమ బిడ్డలపై ప్రదర్శిస్తుంటారు కొంత మంది తల్లిదండ్రులు. ఇవి పసి పిల్లల మనస్సులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంటాయి. పిల్లలు చూస్తున్నారన్న ఆలోచన చేయకుండా.. ఇష్టమొచ్చినట్లు తిట్టుకుంటారు.. కొట్టుకుంటూ ఉంటారు. ముఖ్యంగా భార్యను కసరడంతో పాటు ఆమెపై చేయి చేసుకుంటూ ఉంటాడు భర్త. తండ్రి.. తల్లిపై చేయి చేసుకోవడాన్ని సహించలేరు పిల్లలు. అయితే గొడవ జరిగినప్పుడల్లా పుట్టింటికి వెళ్లిపోవడం.. భర్త బతిమాలినుకుని తెచ్చుకోవడం సాగిపోతుంటాయి. కాని కొన్ని సార్లు క్షణికావేశంలో నిర్ణయాలు చేస్తూ ఉంటారు.

భర్తకు బుద్ది చెప్పాలనో, లేదా ఇతర కారణాలతో పిల్లల్ని కూడా తమ వెంట తీసుకెళుతూ.. వారు ఇబ్బందికి గురౌతూ.. పిల్లల్ని కూడా సమస్యల్లోకి నెడుతుంటారు. తాజాగా ముగ్గురు పిల్లలతో కలిసి బయటకు వెళ్లిన మహిళ.. ఇంటికి తిరిగి రాకపోవడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు భర్త. కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు పిల్లలతో మహిళ గృహిణి అదృశ్యం అయ్యింది. వివరాల్లోకి వెళితే.. మల్లంపేట , ఇందిరమ్మ కాలనీలో ఉంటున్న ఇంతియాజ్ మహమ్మద్, రూబీనా బానో(30) భార్యాభర్తలు. ఈ దంపతులకు ముగ్గురు చిన్నారులు. కుమార్తె ఆల్సిత, కుమారులు సూఫీయాన్, అనాష్ ఉన్నారు. భర్త మియాపూర్ లో టైలరింగ్ పనిచేస్తుండగా.. రూబీనా ఇంట్లోనే ఉంటుంది.

ఈ నెల 2న యాథావిధిగా పని నిమిత్తం మియాపూర్ వెళ్లిపోయాడు భర్త ఇంతియాజ్. సాయంత్రం పనిలో ఉండగానే భార్యకు ఫోన్ చేశాడు భర్త. ఫోన్ స్విచ్ఛాఫ్ అని వచ్చింది. పని ముగించుకుని ఇంటికి వెళ్లిన అతనికి భార్యా, పిల్లలు కనిపించకపోవడంతో చుట్టూ ప్రక్కల వారిని అడిగాడు. వారి నుండి సమాధానం రాకపోవడంతో.. ఫోన్ చేసినా స్విచ్ఛాప్ అని వస్తుండటంతో ఆందోళన చెందిన భర్త.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంతియాజ్ ఇచ్చిన కంప్లైట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అయితే భార్యా భర్తల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఆమె ముగ్గురు పిల్లలతో ఆమె ఎక్కడికి వెళ్లిందీ అని పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom