P Krishna
Husband Statue News: తమవాళ్లు కన్నుమూస్తే వారి జ్ఞపకాలు పదిలంగా ఉంచుకోవడానికి కొంతమంది వారికి గుడి కట్టి పూజిస్తుంటారు. ఇప్పటి వరకు తల్లిదండ్రులకు, కూతుళ్లకు, భార్యలకు గుడి కట్టించారు.. ఓ భార్య తన భర్తకు గుడి కట్టించింది.
Husband Statue News: తమవాళ్లు కన్నుమూస్తే వారి జ్ఞపకాలు పదిలంగా ఉంచుకోవడానికి కొంతమంది వారికి గుడి కట్టి పూజిస్తుంటారు. ఇప్పటి వరకు తల్లిదండ్రులకు, కూతుళ్లకు, భార్యలకు గుడి కట్టించారు.. ఓ భార్య తన భర్తకు గుడి కట్టించింది.
P Krishna
భారత దేశంలో హిందూ సంప్రదాయంలో వివాహ బంధానికి ఎంతో విలువ ఇస్తారు. వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంటను నిండు నూరేళ్లు పిల్లాపాపలతో చల్లగా ఉండాలని పెద్దలు దీవిస్తుంటారు.వైవాహిక బంధంలో భార్యాభర్తల అనుబంధం ఎంతో గొప్పగా సాగాలని ఇరు కుటుంబ సభ్యులు కోరుకుంటారు. భారత దేశంలో భర్తలకు భార్యలు ఎంతో గొప్ప స్థానం ఇస్తారు.భారతీయ స్త్రీ తన భర్త చల్లగా ఉండాలి.. తాను ముత్తయిదువుగానే జీవితాన్ని ముగించాలని కోరుకుంటుంది. ఓ భార్య తన భర్తని మర్చిపోలేక.. ఆయన జ్ఞాపకాలు ఎప్పుడూ పదిలంగా ఉండాలని గుడి కట్టించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇంటి ఇళ్లాలు ఎన్నో రకాల బాధ్యతలు తీసుకుంటుంది. పిల్లల చదువులు, ఆరోగ్యం, అత్తమామలకు ఇబ్బంది రాకుండా చూసుకోవడం, భర్తకు ఏ కష్టమొచ్చినా గుండెధైర్యాన్ని నింపుతుంది. కరోనా సమయంలో ఎంతోమంది జీవితాల్లో విషాదాన్ని నింపింది. ఎన్నో కుటుంబాల అనాథలుగా మిగిలాయి. తమకు ఇష్టమైన వాళ్లను కోల్పోయి ఇప్పటికీ వారి జ్ఞాపకాలతో జీవిస్తున్నారు. కరోనా మహమ్మారి ఆమె జీవితంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎంతో ప్రేమానురాగాలతో చూసుకునే భర్త తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం కరోనాతో ఆమె భర్త కన్నుమూశాడు. భర్త జ్ఞాపకాలను దూరం చేసుకోలేక మానసిక వేదనకు లోనైన ఆమె గొప్ప నిర్ణయం తీసుకుంది. తన భర్త జ్ఞాపకంగా ఒక గుడి కట్టించి ప్రతిక్షణం ఆ విగ్రహంలో తన భర్తను చూసుకోవాలని అనుకుంది.
మహబూబాబాద్ మండలం పర్వతగిరికి చెందిన కళ్యాణి తన సొంత భూమిలో భర్తకు గుడి కట్టించింది. బానోతు హరిబాబు తో ఆమెకు 27 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి సంతానం లేకపోవడంతో భార్యని ప్రాణప్రదంగా చూసుకునేవాడు హరిబాబు. భార్యకు ఏ కష్టమొచ్చినా తల్లడిల్లిపోయేవాడు. భర్త హరిబాబు అంటే కల్యాణికి పంచ ప్రాణాలు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరు జంటగా వెళ్లేవారు. అలాంది ఈ దంపతులను మాయదారి కరోనా మహమ్మారి విడదీసింది. మూడేళ్ల క్రితం కరోనాతో హరిబాబు కన్నుమూశాడు. అప్పటి నుంచి తీవ్ర మనోవేదనకు గురైంది కల్యాణి.ఆయన రూపం, పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని భావించింది. రూ.20 లక్షల వ్యవంతో తమ సొంత భూమిలో ఒక గుడి కట్టించింది. అందులో రాజస్థాన్ నుంచి తన భర్త విగ్రహాన్ని తెప్పించి బుధవారం ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి దగ్గరి బంధువలు, సన్నిహితులు వచ్చారు. భర్తపై కల్యాణికి ఉన్న ప్రేమ గురించి స్థానికులు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ విషయం గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.