Krishna Kowshik
ఎప్పుడెప్పుడు కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ఎనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారా..? అయితే ఈ మేరకు రాష్ట్ర మంతి కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు.
ఎప్పుడెప్పుడు కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ఎనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారా..? అయితే ఈ మేరకు రాష్ట్ర మంతి కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు.
Krishna Kowshik
ప్రభుత్వ పథకాలు అందాలంటే ఆథార్ ఎంత తప్పనిసరో.. అలాగే రేషన్ కార్డు కూడా అంతే ముఖ్యం. రేషన్ బియ్యానికే కాదు.. ఫించను, ఫీజు రీయింబర్స్ మెంట్, ప్రభుత్వం అందించే ఇతర పథకాలతో పాటు బ్యాంకు ఖాతా, ఓటర్ ఐడి, రాష్ట్రంలో నివసిస్తున్నట్లు ధ్రువీకరించేందుకు రేషన్ కార్డు కంపల్సరీగా మారింది. అయితే తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు అందించక.. రెండేళ్లు దాటిపోయింది. దీంతో రేషన్ కార్డుల కోసం దరఖాస్తుదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డి సర్కార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇటీవల తీసుకువచ్చిన ఆరు గ్యారెంటీలకు కూడా రేషన్ కార్డు తప్పనిసరి అయ్యింది. దీంతో రేషన్ కార్డు లేని వారు ఆందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ త్వరలో తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీని కోసం మంత్రి వర్గ సమావేశంలో విధి విధానాలు రూపొందించినట్లు తెలిపారు. కార్డుదారులందరికీ మూడు నెలల తర్వాత సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు. అంటే ఈ లోపునే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనుంది సర్కార్. ఆ తర్వాత సన్న బియ్యం అందించనుంది. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిసి ఆదివారం సూర్యా పేట జిల్లాలో మంత్రి క్యాంప్ ఆఫీసులో రోడ్డు, భవనాలు, పంచాయతీ, విద్యుత్ శాఖ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కీలక ప్రకటన చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అలాగే సన్నవడ్లకు రూ. 500 బోనస్ ఇచ్చేందుకు కేబినేట్‌లో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
అలాగే హూజూర్ నగర్ పట్టణంలోని రామ స్వామి గుట్ట వద్ద నిర్మించిన హౌసింగ్ పనులను మంత్రి ఉత్తమ్ పరిశీలించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన 2,164 సింగిల్ బెడ్ రూం ఇండ్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి సింగిల్ బెడ్ రూం ఇండ్లను పూర్తి చేసి అర్హులైన లబ్దిదారులందరికీ పంపిణీ చేస్తామని ప్రకటించారు. కోదాడ, హుజూర్ నగర్ నియోజక వర్గాల్లో మంజూరు చేసిన పనుల్లో ఎక్కడా రాజీ పడకుండా, క్వాలిటీతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కోదాడ నియోజకవర్గంలో 7 రోడ్ల నిర్మాణానికి రూ. 156 కోట్లు మంజూరు చేశామని, అలాగే హుజూర్ నగర్ నియోజకవర్గంలో 35 రహదారుల నిర్మాణానికి రూ. 267 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకరటించారు. అలాగే పవర్ స్టేషన్స్, సబ్ స్టేషన్లకు మంజూరు చేసిన నిధుల వివరాలు వెల్లడించారు.