Warangal NIT Student: ప్రతిభకు దక్కిన ఫలితం.. వరంగల్‌ నిట్‌ విద్యార్థికి ఏడాదికి 88 లక్షల జీతంతో జాబ్

ప్రతిభకు దక్కిన ఫలితం.. వరంగల్‌ నిట్‌ విద్యార్థికి ఏడాదికి 88 లక్షల జీతంతో జాబ్

Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి జాక్ పాట్ కొట్టాడు. ఏకంగా ఏడాదికి 88 లక్షల వేతనంతో జాబ్ సాధించాడు. ఆ విద్యార్థిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి జాక్ పాట్ కొట్టాడు. ఏకంగా ఏడాదికి 88 లక్షల వేతనంతో జాబ్ సాధించాడు. ఆ విద్యార్థిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. సరైన ప్రణాళిక, అంకితబావంతో కృషి చేస్తే ఎంతటి లక్ష్యాన్నైనా ఛేదించవచ్చు. సంకల్పబలముంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తున్నారు నేటి యువత. తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న నమ్మకాలను వమ్ము చేయకుండా కష్టపడి చదివి వారి కలలను నిజం చేస్తున్నారు యువత. జీవితంలో పైకి ఎదగాలంటే పేదరికం అడ్డుకాద.. పెట్టుబడి అవసరం లేదు.. కేవలం ప్రతిభ ఉంటే చాలు జీవితంలో ఉన్నత శిఖారాలకు చేరుకోవచ్చని రుజువు చేస్తున్నారు పలువురు విద్యార్థులు. ఈ క్రమంలో వరంగల్ నిట్ కు చెందిన ఓ విద్యార్థి ఏడాదికి రూ. 88 లక్షల జీతంతో జాబ్ పొంది నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

ఇటీవల పలువురు విద్యార్థులు చదువు పూర్తి కాకుండానే క్యాంపస్ ప్లేస్ మెంట్లలో కళ్లు చెదిరే ప్యాకేజీలతో ఉద్యోగాలను సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే. క్యాంపస్ లో చేరిన నాటి నుంచే నిర్దిష్టమైన ప్రణాళికతో చదువుకుని అసాధారణ ప్రతిభకనబరుస్తూ లక్షల ప్యాకేజీలతో జాబ్స్ సాధిస్తున్నారు. ఈ క్రమంలో వరంగల్‌లోని జాతీయ సాంకేతిక సంస్థ (నిట్)లో నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో బీటెక్‌ (ఈసీఈ) విద్యార్థి రవిషా జాక్ పాట్ కొట్టాడు. రవిషా ప్రతిభకు ఫలితం దక్కింది. ఏకంగా రూ.88 లక్షల వార్షిక వేతన ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని నిట్ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

పంజాబ్‌లోని లుథియానాకు చెందిన రవిషా తండ్రి వ్యాపారవేత్త, తల్లి గృహిణి. కోడింగ్‌లో మెలకువలు, క్లబ్‌ల నుంచి అందిన గైడెన్స్ తన సక్సెస్ కు తోడ్పడ్డాయని రవిషా తెలిపారు. మరో 12 మంది విద్యార్థులకు రూ.68 లక్షల వార్షిక వేతన ప్యాకేజీలు లభించగా, 82 శాతం మంది బీటెక్‌ విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని నిట్‌ అధికారులు తెలిపారు. ఏడాదికి రూ. 88 లక్షల జీతంతో జాబ్ సాధించిన రవిషాపై ప్రశంసల వర్షం కురుస్తున్నది. రవిషా కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. స్నేహితులు, బంధువులు, తోటి విద్యార్థులు నిట్ విద్యార్థి రవిషాకు అభినందనలు తెలుపుతున్నారు.

Show comments