iDreamPost
android-app
ios-app

యువతి ప్రేమ పెళ్లి.. ప్రేమికుడి ఇళ్లను తగలబెట్టిన గ్రామ సర్పంచ్!

  • Published Jul 05, 2023 | 6:17 PM Updated Updated Jul 05, 2023 | 6:17 PM
  • Published Jul 05, 2023 | 6:17 PMUpdated Jul 05, 2023 | 6:17 PM
యువతి ప్రేమ పెళ్లి.. ప్రేమికుడి ఇళ్లను తగలబెట్టిన గ్రామ సర్పంచ్!

ఓ యువతి, యువకుడు ప్రేమించుకోవడం, ఆ తర్వాత పెద్దలకు ఇష్టం లేకపోయినా లేచిపోయి గుడిలో పెళ్లి చేసుకోవడం. ఇది నచ్చని ఆ యువతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆ ప్రేమికుడిపై దాడి చేయడమో, లేదంటే అతని ఇంటిని కూల్చడమో, నిప్పంటించడమో చేస్తుంటున్నారు. ఇలాంటివి మనం ఎక్కువగా సినిమాల్లోనే చూస్తుంటాం. ఈ మధ్య ఇలాంటి ఘటనలు కూడా చాలానే జరిగాయనుకోండి. అయితే, అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా తెలంగాణలో ఓ చోట జరిగింది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన జలగం రంజిత్ అనే యువకుడు ఇదే ఊరికి చెందిన సర్పంచ్ రవిందర్ కూతురైన కావ్యశ్రీ అనే యువతిని ప్రేమించాడు. ఆ యువతి కూడా అతడిని ఇష్టపడడంతో ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమాయణం చాలా కాలం పాటు కొనసాగింది. అయితే, ఈ ప్రేమికులు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కానీ, వీరి పెళ్లికి యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదని తెలుస్తుంది.

ఇక ఏదేమైనా సరే రంజిత్ తన ప్రియురాలినే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవల ఈ లవర్స్ వారి స్నేహితుల సహకారంతో ఓ గుడిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ విషయం కావ్యశ్రీ తండ్రి రవిందర్ కు తెలిసింది. ఇతను గ్రామ సర్పంచ్ కావడంతో తన పరువు పోతుందని భావించాడు. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నూతన దంపతులను స్టేషన్ కు పిలిపించి కౌన్స్ లింగ్ ఇచ్చారు. సర్పంచ్ రవిందర్ తన కూతురిని మాతో పాటు రావాలంటూ కొప్పడ్డాడు.

ఆ యువతి మాత్రం ప్రియుడితోనే ఉండేందుకు సిద్దపడింది. ఇక సర్పంచ్ కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన సర్పంచ్ రవిందర్ ఎలాగైన రంజిత్ పై పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. ఆ సమయంలో సర్పంచ్ కు ఏం చేయాలో తెలియక రజింత్, అతని స్నేహితుల ఇళ్లను పూర్తిగా తగలబెట్టాడు. బాధితులు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దారుణానికి పాల్పడిన నిందితుడైన సర్పంచ్ రవిందర్ ను వెంటనే అరెస్ట్ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet