P Krishna
Jagtial: నింగిలోకి రాకెట్లు పంపుతూ అంతరిక్షాన్ని శాసిస్తున్న ఈ ఆధునిక యుగంలో మంత్రాలు, తంత్రాలు అంటూ గ్రామాల్లో మూఢనమ్మకాలను నమ్ముతూనే ఉన్నారు. మంత్రాల నెపంతో దొంగ పూజార్లు, బాబాలు అమాయకుల నుంచి అందినంత డబ్బు దోచేస్తున్నారు.
Jagtial: నింగిలోకి రాకెట్లు పంపుతూ అంతరిక్షాన్ని శాసిస్తున్న ఈ ఆధునిక యుగంలో మంత్రాలు, తంత్రాలు అంటూ గ్రామాల్లో మూఢనమ్మకాలను నమ్ముతూనే ఉన్నారు. మంత్రాల నెపంతో దొంగ పూజార్లు, బాబాలు అమాయకుల నుంచి అందినంత డబ్బు దోచేస్తున్నారు.
P Krishna
ప్రపంచంలోని అగ్ర దేశాలతో పోటీ పడుతూ భారత దేశంలో అన్ని రంగాల్లో ముందుకు సాగుతుంది.భారత దేశంలో మూడవ చంద్ర మిషన్.. చంద్రయాన్ – 3 నింగిలోకి పంపి అగ్ర దేశాల చూపు మనవైపు తిప్పుకున్నాం. ఓ వైపు శాస్త్రసాంకేతిక రంగాల్లో అనేక విజయాలను సాధిస్తూ ఆధునిక పోకడలు అనుసరిస్తుంటే.. మరోవైపు మంత్రాలు, చేతబడులు, క్షుద్ర పూజలు అంటూ మూఢ నమ్మకాలను నమ్ముతూ ప్రాణాలు తీస్తున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలవు అంటూ జన విజ్ఙాన వేధికలు చెబుతున్నా.. కొంతమంది లేని పోని పుకార్లు సృష్టిస్తూ ప్రజల్లో భయాందోళన సృష్టిస్తున్నారు. తాజాగా మంత్రగాళ్ళు తస్మాత్ జాగ్రత్త అంటూ వెలసిన పోస్టర్లు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఈ ఘటన ఎక్కడ జరిగిందీ అన్న వివరాలు తెలుసుకుందాం.
ప్రపంచంలో సైన్స్ మాత్రమే భూమి మీద ఉన్న జీవరాసులకు అన్ని సమస్యలు పరిష్కారం చూపిస్తాయని శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు. కానీ, ఇప్పటికీ గ్రామాల్లోని ప్రజలు దెయ్యాలు, భూతాలు ఉన్నాయని నమ్ముతున్నారు. తమపై దుష్ట శక్తుల ప్రభావం ఉందన్న భయంతో వాటిని తొలగించుకోవడానికి దొంగ బాబాలు, పూజార్లు, మంత్రగాళ్ళను నమ్ముతున్నారు. తాజాగా మంత్రగాళ్లారా తస్మాస్ జాగ్రత్త అంటూ జిగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంటలో గోడలపై వాల్ పోస్టర్లు తీవ్ర కలకలం సృష్టించాయి. ప్రజల మంచి కోరే సంస్థ పేరిట ఈ పోస్టర్లు వెలిశాయి. గచ్చునూతి దగ్గర నుంచి మొదలు పెట్టి అన్ని వాడల్లో ఉన్న మంత్రగాళ్లందరిని చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లను గోడలకు అతికించారు. ప్రజలకు హాని చేస్తున్నమంత్రగాళ్ళు ఎప్పుడు ఎవరు ఎలా చస్తారో మాకే తెలియదు అంటూ పోస్టర్లలో పేర్కొన్నారు. ఈ వాల్ పోస్టర్లు గ్రామంలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఈ పోస్టర్లు ఎవరు అతికించారో తెలియాల్సి ఉంది. సరిగ్గా రెండున్నరేళ్ళ క్రితం జిగిత్యాల జిల్లా రాయికల్ మండలం జగన్నాథ్ పూర్ లో ఇదే విధంగా 8 మంది మంత్రగాళ్ళకు హెచ్చరికలు జారీ చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అప్పట్లో పెద్ద చర్చకే దారి తీసింది. ఈ విషయంపై అప్పట్లో పోలీసుల ఆరా తీశారు. తాజాగా కట్లకుంట గ్రామంలో వెలసిన పోస్టర్లు ఎర్ర రంగుతో రాయబడ్డాయి. మా సంస్థకు అందిన అనేక ఫిర్యాదుల ఆధారంగా మంత్రగాళ్ళను ఒక్కొక్కరినీ చంపబోతున్నాం. గచ్చునూతి నుంచి మొదలు ఇద్దరు మంత్రగాళ్ళతో మొదలు పెడతాం. అనంతరం గుండ్ల వాడకట్టు, గొల్లోల వాడకట్టు, గౌండ్లోల వాడకట్టు, పాల కేంద్రం చుట్టుపక్కల, ఇతర ప్రాంతాల్లో మంత్రగాళ్లందరినీ చంపేస్తాం.
గ్రామ ప్రజలకు మనవి.. మీరు ఇప్పటి వరకు ఎలా చూస్తూ ఉన్నారో అలాగే ఉండండి. మంత్రగాళ్ళకు సపోర్ట్ చేస్తే మీకు ప్రాణాపాయం ఉండవొచ్చు అని హెచ్చరించారు. ఈ మంత్రగాళ్ళ వల్ల ఎంతోమంది మానసిక, ఆర్థికంగా నష్టపోతున్నారని పోస్టర్లో రాశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు గ్రామంలోకి వెళ్లి పోస్టర్లను చించివేశారు. ఇది ఆకతాయిల పనా? లేదా ఎవరైనా గ్రామస్థులను భయపెట్టేందుకు ఇలాంటి చర్యకు పూనుకున్నారా? అనే విషయంపై ఆరా తీస్తున్నారు.ఆకాశానికి రాకెట్లు పంపుతున్న ఈ ఆధునిక కాలంలో మంత్రాలు, చేతబడులు మూఢ నమ్మకాలని ఇలాంటి సున్నితమైన విషయాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మరోవైపు జన విజ్ఞాన వేధికలు వీటిపట్ల అతిగా రికాక్ట్ కావొద్దని గ్రామస్థులకు చెబుతున్నారు.