iDreamPost
android-app
ios-app

గోమాతకు అరుదైన గౌరవం.. పండగలా జరుపుకున్న హిందువులు!

  • Published Jun 08, 2024 | 11:01 AM Updated Updated Jun 08, 2024 | 11:01 AM

Naming Ceremony for Cow: భారత దేశంలో గోమాతకు పూజలు చేయడం అనాధిగా వస్తున్న ఆచారం. సమస్త దేవతలకు నిలయమైన గోవును పూజిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని అంటారు.

Naming Ceremony for Cow: భారత దేశంలో గోమాతకు పూజలు చేయడం అనాధిగా వస్తున్న ఆచారం. సమస్త దేవతలకు నిలయమైన గోవును పూజిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని అంటారు.

  • Published Jun 08, 2024 | 11:01 AMUpdated Jun 08, 2024 | 11:01 AM
గోమాతకు అరుదైన గౌరవం.. పండగలా జరుపుకున్న హిందువులు!

దేశంలో హిందువులు గోమాతను దేవతగా పూజిస్తారు. ఇటీవల ఇంట్లో పెంచుకుంటున్న సాధు జంతువులు ఆవులు, కుక్క, పిల్లి కొన్ని పక్షులకు ఇష్టమైన పేర్లు పెడుతూ పిలుచుకుంటున్నారు. ఇంట్లో చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేయడంతో వాటితో గొప్ప అనుబంధం ఏర్పడుతుంది. ఈ మధ్య కాలంలో ఇంట్లో పెట్స్ కి నామకరణం, పుట్టిన రోజు, సీమంతం లాంటి కార్యక్రమాలు సంప్రదాయ బద్దంగా జరుపుతున్న విషయం తెలిసిందే. గోమాత అంటే వరాలు ఇచ్చే దేవతగా పూజిస్తాం.. తాజాగా గోమాతను పెంచడమే కాదు.. దానికి నామకరణోత్సవం ఎంతో గొప్పగా.. పండగలా జరిపించారు అక్కడి ప్రజలు. ఈ ఘటన సిద్దిపేట‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

భారత దేశంలో అనాధిగా గోమాతను పెంచడమే కాదు.. దేవతా పూజించడం తెలిసిందే. ఆవులో సకల దేవతలూ కొలువై ఉంటారని అంటారు. గోదానం చేస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని అంటారు. తాజాగా గోమాతను పెంచడమే కాదు.. దానికి నామకరం ఓ పండగలా జరుపుకున్నారు సిద్దిపేట ప్రజలు. గోమాత రక్షణ, సేవ, పూజ ఎంతో పుణ్యప్రదమని భారతీయ పురాణాలు చెబుతున్నాయి. గోమాత మహిమ ఎంతో గొప్పది. ఇప్పటికీ వివాహతంతులో భాగంగా కన్యాదానంతో పాటు గోదానం చేయడం ఎంతో ప్రశస్తమని పురాణాలు చెబుతున్నాయి. గృహ ప్రవేశాలు, ఏదైనా ఓపెనింగ్స్ కి గోమాతను తీసుకువచ్చి పూజిస్తారు.  గోమాతను రక్షిస్తే భూమాత మనల్ని రక్షిస్తుందని అంటారు. గోమాతలో 33 కోట్ల దేవతలు నిక్షిప్తమై ఉన్నారని.. ఒక గోవుకు పూజ చేస్తే 33 కోట్ల దేవతలకు పూజ చేసిన ప్రతిఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం కాలం మారిపోయింది.. గ్రామాల్లో తప్ప పట్టణాలు, నగరాల్లో గోవులను పెంచడం కాదు కదా.. అసలు గోవుల వైపు చూడటం కూడా మానివేశారు. అపార్ట్ మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత కుక్కలు, పిల్లలు పెంచుకోవడం ఫ్యాషన్ గా భావిస్తున్నారు. అలాంటిది సిద్దిపేట జిల్లా లో రావిచెట్టు హనుమాన్ దేవాలయ గోశాలలో పుంగనూరు గోమాతకు నామకరణ మహోత్సవం ఎంతో గొప్పగా జరిపించారు. గోమాతకు తొట్లె కార్యక్రమం నిర్వహించి ‘రాధమ్మ’ అని నామకరణం చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ మంజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గోమాత మనకు ఎన్నో ఇస్తుంది..  గోమాతకు మనస్ఫూర్తిగా సేవిస్తే సకల పాపాలు దూరమవుతాయని అన్నారు.