మంత్రాల నెపంతో మెదక్ లో దారుణం.. మహిళపై పెట్రోల్ పోసి.. చివరకు ఏమైందంటే?

Villagers attacked woman in Medak: మెదక్ లో దారుణం చోటు చేసుకుంది. మంత్రాలు చేస్తుందన్న అనుమానంతో మహిళపై దాడికి పాల్పడ్డారు. పెట్రోల్ పోసి నిప్పంటించారు. చివరికి ఏమైందంటే?

Villagers attacked woman in Medak: మెదక్ లో దారుణం చోటు చేసుకుంది. మంత్రాలు చేస్తుందన్న అనుమానంతో మహిళపై దాడికి పాల్పడ్డారు. పెట్రోల్ పోసి నిప్పంటించారు. చివరికి ఏమైందంటే?

మానవులు అంతరిక్షానికి వెళ్లగలుగుతున్నారు కానీ మూఢ విశ్వాసాల నుంచి బయటపడలేకపోతున్నారు. సమాజంలో మంత్రాలు, మూఢ నమ్మకాలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చినప్పటికీ మూఢనమ్మకాల ఆనవాళ్లు మాత్రం ప్రజలను వీడడం లేదు. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అన్ని చోట్ల వీటి ప్రభావం ఉంది. ముఖ్యంగా గ్రామాల్లో మంత్రాల అనుమానాలు ఎక్కువ. కాస్త అనారోగ్యానికి గురైనా ఎవరో చేతబడి చేశారు కాబట్టే ఇలా జరుగుతుందని భావిస్తుంటారు. వ్యాపారంలో నష్టాలు వచ్చినా, పంటలు సరిగా పండకపోయినా మంత్రాలు చేయడం వల్లనే తమకు ఇలా జరుగుతుందని అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. ఈ క్రమంలో వారికి ఎవరిమీదనైతే అనుమానం ఉంటుందో వారిపై దాడులకు పాల్పడుతుంటారు. ఒక్కోసారి ప్రాణాలు కూడా తీస్తుంటారు. గతంలో ఇలాంటి ఘటలను చాలానే చోటుచేసుకున్నాయి.

మంత్రాలు చేస్తున్నారని చెట్టుకు కట్టేసి కొట్టడం, మారణాయుధాలతో దాడి చేసి చంపడం వంటి ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు మంత్రాలు, ముఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఇంకా ఇలాంటి వాటిని నమ్మి జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. లేని సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. మనుషులం అన్న సంగతి మరిచి విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో మెదక్ జిల్లాలో మరో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని రామాయంపేట మండలంలోని కాట్రియాలలో దారుణం చోటుచేసుకున్నది. మంత్రాల నెపంతో ఓ మహిళపై పెట్రోల్ పోసి నిప్పింటించారు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. రామాయంపేటలో ఇటీవల ఓ బాలుడు అనారోగ్యానికి గురయ్యాడు. అయితే బాలుని అనారోగ్యానికి కారణం మంత్రాలే అని భావించారు.

అదే గ్రామంలో ఉండే ముత్తవ్వ అనే మహిళకు మంత్రాలు వస్తాయని అనుమానం వ్యక్తం చేశారు. ముత్తవ్వ మంత్రాల కారణంగానే బాలుడు అనారోగ్యానికి గురయ్యాడని కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ద్యాగాల ముత్తవ్వ అనే మహిళ తన ఇంట్లో ఉండగా గ్రామస్థులు ఆమెపై దాడి చేశారు. ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించారు. వెంటనే ఆ మహిళ అరుస్తూ పరుగులు తీసింది. ఆమె అరుపులు విన్న స్థానికులు రక్షించే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. కానీ మంటల్లో తీవ్రంగా గాయపడడంతో మార్గమధ్యలోనే మృతి చెందింది. దీంతో మృతదేహాన్ని పోలీసులు రామాయంపేట దవాఖానకు తీసుకెళ్లారు. దాడి భయంతో మృతురాలి కుమారుడు, కోడలు పారిపోయారు. ఈ ఘటనపై ముత్తవ్వ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కంప్లైంట్ అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరి ఈ రోజుల్లో కూడా మంత్రాల నెపంతో దాడులకు పాల్పడుతున్న తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments