SNP
పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని అనుకుంటున్న తెలంగాణ బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ నేత, బలమైన బీసీ నాయకుడు విక్రమ్ గౌడ్.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. మరి ఆయన రాజీనామాకు గల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని అనుకుంటున్న తెలంగాణ బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ నేత, బలమైన బీసీ నాయకుడు విక్రమ్ గౌడ్.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. మరి ఆయన రాజీనామాకు గల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
మరికొన్ని నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ముంచుకొస్తున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలతో సరిపెట్టుకున్న తెలంగాణ బీజేపీ.. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటాలని అనుకుంటోంది. ఇలాంటి సమయంలో ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది. బీసీ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ బీజేపీకి రాజీనామా చేశారు. ఆయన తీసుకున్న ఈ సంచలన నిర్ణయం.. కమలం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల్లో 30కి పైగా స్థానాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని.. కేవలం 8 స్థానాలకు పరిమితమైన బీజేపీ.. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం తెలంగాణ నుంచి మెజార్టీ స్థానాలు సాధించాలని భావిస్తోంది.
ఈ టైమ్‌లో విక్రమ్ గౌడ్ లాంటి బలమైన బీసీ నేత బీజేపీకి దూరం కావడం.. ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే.. ఏమీ ఆశించకుండా పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న తనలాంటి వాళ్లకు బీజేపీలో అసలు గుర్తింపు లేకుండా పోయిందని, వేరే పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన తన లాంటి వాళ్లను.. ఆ పార్టీలో కొంతమంది అంటరాని వాళ్లలా, సెకండ్ గ్రేడ్ సిటిజన్స్‌లా చూస్తున్నారంటూ విక్రమ్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజీనామాకు గల కారణాలను వివరిస్తూ.. పార్టీకి లేఖ రాశారు విక్రమ్ గౌడ్. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి విక్రమ్ గౌడ్ తన రాజీనామా లేఖను పంపించారు.
క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీలో అసలు క్రమశిక్షణ మచ్చుకైనా కనిపించడం లేదని విక్రమ్ తన రాజీనామా లేఖలో విమర్శించారు. బీజేపీలో గ్రూపు తగాదాలు ఎక్కువయ్యాయని, పార్టీలోని కీలక నేతలు వర్గవిభేదాలతో రచ్చకెక్కితే.. వాటిని పరిష్కరించాల్సిన పెద్ద నేతలు చోద్యం చూస్తున్నారంటూ మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమిని చవిచూస్తే.. దానికి ఏ ఒక్కరు కూడా బాధ్యత తీసుకోలేని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో.. ఎంపీగా పోటీ చేయడంపై పార్టీ హైకమాండ్ నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు చాలా స్పష్టంగా పేర్కొన్నారు. హైదరాబాద్‌లో గౌడ సామాజిక వర్గం బలమైన ఓటు బ్యాంకును కలిగి ఉంది. ఆ సామాజిక వర్గంలోనే కాక.. అన్ని వర్గాల ప్రజల్లో విక్రమ్ గౌడ్‌కు మంచి పేరుంది. బలమైన ప్రజాదరణ ఉన్న బీసీ నేత ఇప్పుడు పార్టీకి దూరం కావడం.. నిజంగా బీజేపీకి పెద్ద ఎదురు దెబ్బే. మరి విక్రమ్ గౌడ్.. బీజేపీకి రాజీనామా చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.