iDreamPost
android-app
ios-app

గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులపై మంత్రి కీలక ప్రకటన

ప్రభుత్వ పథకాలు పొందాలంటే రేషన్ కార్డు తప్పని సరి. రేషన్ కార్డు లేని కుటుంబాలు చాలా ఉన్నాయి. అలాంటి వారికి గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

ప్రభుత్వ పథకాలు పొందాలంటే రేషన్ కార్డు తప్పని సరి. రేషన్ కార్డు లేని కుటుంబాలు చాలా ఉన్నాయి. అలాంటి వారికి గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులపై మంత్రి కీలక ప్రకటన

తెలంగాణలో ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికల హామీలను తీర్చేందుకు వడివడిగా అటు వైపు అడుగులు వేస్తుంది. తమది ప్రజా ప్రభుత్వమని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇప్పటికే ఇచ్చిన హామీలను అమలు చేస్తోంది. మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేయడంతో పాటు, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచింది. 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్, 500 రూపాయిలకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను అందిస్తుంది. అలాగే హెల్త్ కార్డులపై కీలక ప్రటకన చేసింది. తాజాగా రైతులకు రుణమాఫీ కూడా నెరవేరుస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రతి పథకం అమలు కావాలంటే రేషన్ కార్డు తప్పని సరి అవుతుంది. ఇప్పటికే తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం వేల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి

ఆరు పథకాలకు కూడా రేషన్ కార్డు తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో రేషన్ కార్డు లేని కుటుంబాలకు గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించారు. త్వరలో రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు ఇస్తామని తెలిపారు. ఈ రెండు కార్డులను వేర్వేరుగా ఇస్తామని పేర్కొన్నారు. మంత్రి వర్గంలో కొత్త రేషన్ కార్డు మార్గదర్శకాలపై చర్చిస్తామని తెలిపారు. కరీంనగర్ బొమ్మకల్‌లోని వి -కన్వెన్షన్ లో రైతు భరోసా పథకంపై ఉమ్మడి జిల్లా రైతులతో అభిప్రాయ సేకరణ కార్యక్రమం ప్రారంభించారు ఉత్తమ్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో మార్గదర్శకాలు ఖరారైన వెంటనే ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు.

రేషన్ కార్డు.. రేషన్‌కు మాత్రమే వినియోగించాలని, ఆరోగ్యశ్రీకి హెల్త్‌కు మాత్రమే వినియోగించాలని అన్నారు. గతంలో రేషన్ కార్డు- ఆరోగ్యశ్రీతో లింక్ అయ్యేదని, కానీ ఇప్పుడు అందరికీ ఆరోగ్యశ్రీ ఇస్తున్నందు వల్ల సెపరేట్ కార్డులు తీసుకువస్తున్నట్లు చెప్పారు. కొత్త రేషన్ కార్డులపై క్యాబినేట్‌పై చర్చించి.. త్వరలోనే జారీ చేసే ప్రక్రియ మొదలు పెడతామని వెల్లడించారు. అలాగే రైతుల రుణ మాఫీపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టారు.  బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు రైతు రుణ మాఫీ 25 వేల కోట్లు చేయగా.. తాము కేవలం ఎనిమిది నెలల కాలంలో 31 వేల కోట్ల రుణ మాఫీ చేశామని అన్నారు. ఏ ప్రభుత్వం ఎక్కువ రుణ మాఫీ చేసిందో రైతులకు అర్థం అవుతుందని పేర్కొన్నారు. తమది ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వమని తెలిపారు.