iDreamPost
android-app
ios-app

పోలీసులను ఆశ్రయించిన UPSC తెలంగాణ టాపర్ అనన్య.. ఎందుకంటే?

ఇటీవల యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటింది పాలమూరు బిడ్డ అనన్య రెడ్డి. తొలి ప్రయత్నంలోనే ఆమె మూడవ ర్యాంకు సాధించింది. కాగా, ఇప్పుడు ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఎందుకంటే..?

ఇటీవల యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటింది పాలమూరు బిడ్డ అనన్య రెడ్డి. తొలి ప్రయత్నంలోనే ఆమె మూడవ ర్యాంకు సాధించింది. కాగా, ఇప్పుడు ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఎందుకంటే..?

పోలీసులను ఆశ్రయించిన UPSC తెలంగాణ టాపర్ అనన్య.. ఎందుకంటే?

ఇటీవల యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరుకు చెందిన దోనూరు అనన్య రెడ్డి మూడో ర్యాంకును సాధించింది. తొలి ప్రయత్నంలోనే ఆమె ఈ ర్యాంకు సాధించడం గమనార్హం. చిన్నప్పటి నుండి ఐఏఎస్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్న అనన్య.. అనుకున్నది సాధించింది. సుమారు 12 నుండి 14 గంల పాటు కష్టపడి చదివి ఎట్టకేలకే సివిల్స్ కొట్టింది. యుపీఎస్సీ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల్లో తొలి టాపర్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆమెను సన్మానించిన సంగతి విదితమే. కాగా, ఇప్పుడు ఈ కాబోయే ఐఏఎస్ ఆఫీసర్ పోలీసులను ఆశ్రయించింది.

తెలంగాణ యుపీఎస్సీ టాపర్ అనన్య.. సోషల్ మీడియాలో తన పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించడంపై సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో తన పేరుతో అనేక ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేశారని పేర్కొంటూ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కొన్ని ఛానెల్స్ తన పేరు మీద మెంటర్ షిప్ ప్రోగ్రామ్స్ అందిస్తున్నాయని, డబ్బులు కూడా వసూలు చేస్తున్నాయని తన దృష్టికి వచ్చిందన పేర్కొంది అనన్య. దీని వల్ల అమాయకులు ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపింది. ఈ నెల 27న ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తగిన చర్యలు తీసుకుంటామని హామీ నిచ్చారు పోలీసులు. కాగా, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సామాజిక సేవ చేయాలని తపనతో చిన్నప్పటి నుండే సివిల్స్ పై దృష్టి పెట్టింది అనన్య. ఆమె తండ్రి సెల్ఫ్ ఎంప్లాయ్ కాగా, తల్లి గృహిణీ. హైదరాబాద్ నగరానికి వచ్చి,  కోచింగ్ తీసుకుని, శ్రద్ధగా చదివి తొలి ప్రయత్నంలోనే తెలుగు రాష్ట్రాల్లో తొలి స్థానాన్ని సంపాదించి.. ఎంతో మంది సివిల్స్ ఆశావాహులకు ఆదర్శంగా నిలిచింది. సాధారణంగా సివిల్స్ తొలి ప్రయత్నంలో కొట్టలేమన్నఅపవాదు ఉంది. కానీ ప్రయత్నిస్తే.. అసాధ్యం అన్నది సుసాధ్యం కావచ్చునని నిరూపించింది అనన్య. పట్టుదలతో చేస్తే సమరం, తప్పకుండా నీదే విజయం, కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా అన్న పదాలకు అక్షర రూపంగా నిలిచింది ఆమె.