Dharani
PM Kisan Yojana TS Rythu Bharosa: అన్నదాతలకు భారీ శుభవార్త.. త్వరలోనే వారి ఖాతాలో 9500 రూపాయలు జమ కానున్నాయి. ఇంతకు ఇవి ఏ పథకానికి సంబంధించిన డబ్బులు అంటే..
PM Kisan Yojana TS Rythu Bharosa: అన్నదాతలకు భారీ శుభవార్త.. త్వరలోనే వారి ఖాతాలో 9500 రూపాయలు జమ కానున్నాయి. ఇంతకు ఇవి ఏ పథకానికి సంబంధించిన డబ్బులు అంటే..
Dharani
గతంలో కన్నా ఇప్పుడు అన్నదాతలను ఆదుకోవడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రారంభించాయి. మద్దతు ధర కల్పించడంతో పాటు.. దళారీల బెడదను తలగించడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. సబ్సిడీ ధరకే ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందజేస్తున్నాయి. ఇక పెట్టుబడి సాయం కూడా చేస్తున్నారు. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం.. ఐదేళ్ల క్రితం కిసాన్ పీఎం యోజన పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ఎకరాకు ఏడాదికి 6 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తుంది. మూడు విడతల్లో ఈ మొత్తాన్ని నేరుగా అన్నదాతల ఖాతాలో జమ చేస్తుంది.
అలానే రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతలను ఆదుకోవడం కోసం ప్రభుత్వాలు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నాయి. తెలంగాణలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం.. ఎకరాకు 10 వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందించేది. రెండు దఫాల్లో ఈ మొత్తాన్ని రైతుల ఖాతాలో జమ చేసేవారు. అయితే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మొత్తాన్ని పెంచింది. ఎకరాకు 15 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని.. రైతులకే కాకుండా.. కౌలు రైతులకు కూడా ఈ సాయం అందిస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో త్వరలోనే రైతుల ఖాతాలో 9,500 రూపాయలు జమ కానున్నాయి. ఆ వివరాలు..
పీఎం కిసాన్ యోజన 17వ విడత నిధులు తర్వలోనే నిడుదల కానున్నాయి. ప్రతి ఏడాదికి మూడు సార్లు చొప్పున.. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి 2 వేల రూపాయల చొప్పున ఈ నిధులు విడుదలవుతాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో 16వ విడత నిధులు రైతుల ఖాతాలో జమ అయ్యాయి. ఇక 17 విడత నిధులు మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో రైతుల ఖాతాలో జమ కానున్నాయి. 17వ విడత కింద రెండు వేల రూపాయలు అన్నదాతల ఖాతాలో జమ చేస్తారు. మరి ఇంకో 7,500 రూపాయలు ఎక్కడివి అంటే.. అవి తెలంగాణ సర్కార్ విడుదల చేసే నిధులు అన్నమాట.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ తాము అధికారంలోకి వస్తే పెట్టుబడి సాయాన్ని 15,000 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చింది. ఇక రానున్న వర్షాకాలం నుంచి రైతు భరోసా పేరుతో ప్రభుత్వం అన్నదాతలకు ఎకరాకు 15 వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని అందించనుంది. దీనిలో భాగంగా ముందగా వర్షాకాలానికి సంబంధించి.. ఎకరాకు 7,500 రూపాయలను జూన్‌లో రైతుల ఖాతాలో జమ చేస్తారని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే జరిగితే.. జూన్‌లో రైతుల ఖాతాలో 9,500 రూపాయలు జమ కానున్నాయి అన్నమాట. ఇక పీఎం కిసాన్ యోజన నిధులు అందాలంటే.. కచ్చితంగా ఈకేవైసీ చేయించుకోవాలి. లేదంటే డబ్బులు ఖాతాలో పడవు.