iDreamPost
android-app
ios-app

రంగం కార్యక్రమం.. భవిష్యవాణి వినిపిస్తున్న స్వర్ణలత..ఈ ఏడాదిలో..

  • Published Jul 22, 2024 | 11:25 AMUpdated Jul 22, 2024 | 11:25 AM

Swarnalatha Rangam Bhavishyavani 2024: తెలంగాణలో బోనాల జాతర మొదలైంది. సికింద్రబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జరగగా అమ్మవారి ఆలయం అంతా సందడి వాతావరణంతో నిండిపోయింది. భక్తులు అమ్మావారికి బోనాలు సమర్పించారు.

Swarnalatha Rangam Bhavishyavani 2024: తెలంగాణలో బోనాల జాతర మొదలైంది. సికింద్రబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జరగగా అమ్మవారి ఆలయం అంతా సందడి వాతావరణంతో నిండిపోయింది. భక్తులు అమ్మావారికి బోనాలు సమర్పించారు.

  • Published Jul 22, 2024 | 11:25 AMUpdated Jul 22, 2024 | 11:25 AM
రంగం కార్యక్రమం.. భవిష్యవాణి వినిపిస్తున్న స్వర్ణలత..ఈ ఏడాదిలో..

సికింద్రాబాద్ లో లష్కర్ బోనాలతో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిట కిటలాడుతుంది. తెల్లవారు జామున హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కుటుంబ సమేతంగా అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. మహాహారతి, కుంకుమ, పుష్ప అర్చనలు నిర్వహించారు. ఈ రోజు బోనాల జాతరలో రంగం కార్యక్రమం కోసం యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే రంగం కార్యక్రమం ఉదయం 9.40 గంటలకు మొదలైంది. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. మధ్యాహ్నం అంబారిపై మహంకాళి అమ్మవారి ఊరేగింపు మొదలు కానుంది. సాయంత్రం ఫలహార బండ్ల ఊరేగింపు జరగనుంది. ఈ ఏడాది ఎలా ఉండబోతుందో స్వర్ణలత భవిష్యవాణిలో తెలిపింది. వివరాల్లోకి వెళితే..

నేడు (జులై 22) అమ్మవారి స్వరూపంగా భావించే మాతంగి స్వర్ణలత భవిష్య‌వాణి వినిపించింది. ప్రజలు చేసే పూజలు ఆనందంగా స్వీకరిస్తున్నా.. నాకు సంతోషంగా ఉంది.. నాకు కావల్సిన పూజలు అందిస్తున్నారు. బోనం ఎవరు తెచ్చినా నాకు ఆనందమే.. మట్టి బోనం అయినా.. బంగార బోనం అయినా ఎవరు ఏది తెచ్చినా సంతోషంగా అందుకుంటా. ఈ ఏడాది పాడి పంటలు, వానలు సంవృద్దిగా ఉన్నాయి.. నన్ను చూడాలంటే 48 గంటలు కష్టం అంటున్నారు.. ఆ మాత్రం కష్టపడలేరా? ఏం తెచ్చినా నేను ఆనందంగా స్వీకరిస్తా.. ఎటువంటి వ్యాధి రాకుండా చూస్తా.. ఈ ఏడాది కోరినన్ని వర్షాలు పుష్కలంగా కురుస్తాయి. నా ప్రజలు చల్లగా ఉంటారు. రోగాలతో బాధపడే వారికి అండగా ఉంటా.. వారి రోగాలు నయం చేస్తా.. ఐదు వారాలు పప్పు బెల్లం పలహారలతోటి సాక పెట్టండి రా.. అన్నారు.

నాకు రక్తపాసం ఇవ్వడం లేదని అన్నారు.. మీకు నచ్చినట్లు ఇస్తున్నారు. దాంతోనే నేను సంతాషాగానే ఉన్నా.. పూజలందు సంతోషంగా ఉండాలి.. గర్భస్త్రిలకైనా.. చిన్నా, పెద్దా, జంతువులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటా. నా రూపం పెట్టాలి అనుకుంటున్నారు కదా.. పెట్టండి రా. ఎవరు ఏం చేసినా, ఎవరెంత అడ్డుపడినా నా రూపం నేను పెట్టించుకుంటా.. తప్పని సరిగా నా రూపాన్ని నిలబెట్టుకుంటా.. అంటూ స్వర్ణలత భవిష్య వాణిలో తెలిపారు. రంగం కార్యక్రమం వినడానికి వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. రంగం కార్యక్రమం నేపథ్యంలో మహంకాళి ఆలయంలో భక్తులకు అమ్మవారి దర్శనం నిలిపివేశారు. గత 25 ఏళ్లుగా మాతంగి రంగం వినిపిస్తున్నారు. అమ్మవారిని తల్చుకొని పచ్చి కుండలపై నిలబడి స్వర్ణలత దేశ భవిష్యత్ వినిపిస్తుంది. సాయంత్రం 7 గంటలకు తిరిగి ఫలహారం బండ్ల ఊరేగింపు జరుగుతందని ఆయల అధికారులు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి