Krishna Kowshik
తల్లిదండ్రుల కలిసి ఉండేందుకు ఈ ఇద్దరు చిన్నారులు పరితపిస్తున్నారు. కూలీ నాలీ చేసుకుని బతుకుతూ. తండ్రిని సైతం పోషిస్తున్నారు. కానీ అతడు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా..
తల్లిదండ్రుల కలిసి ఉండేందుకు ఈ ఇద్దరు చిన్నారులు పరితపిస్తున్నారు. కూలీ నాలీ చేసుకుని బతుకుతూ. తండ్రిని సైతం పోషిస్తున్నారు. కానీ అతడు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా..
Krishna Kowshik
ఆడదానికి ఆడదే శత్రువు అని పెద్దలు సామెతను ఊరికనే పెట్టలేదు. అందుకు ఎగ్జాంపుల్.. ఇంట్లో ఉన్న అత్తా, కోడల్లే. అత్త అంటే కోడలికి గిట్టదు. కోడలి మాటలు, చేతలు అత్తకు నచ్చవు. దీంతో నిత్యం గొడవలు జరుగుతుంటాయి. వీటికి తోడు ఆడపడుచు పోరు కూడా. ఒక్కోసారి ఈ తగాదాలు రోడ్డుకు కూడా ఎక్కుతుంటాయి. కొడుకు సంపాదన తనకే ఇవ్వాలని, తానే పెత్తనం సాగించాలని అత్త భావించడం వల్ల లేదా అత్త ఏదీ చెప్పినా స్వీకరించలేని కోడలు..అలాగే తనపై అజమాయిషీ చేస్తూ తట్టుకోలేకపోవడం ఈ సమస్యలకు దారి తీస్తుంది. ఈ తగాదాల్లో ఇంట్లో ఉన్న మగవాళ్లు, పిల్లలు కూడా నలిగిపోతుంటారు. ఇలాంటి సమస్యలే కాపురాల్లో చిచ్చు కూడా పెడుతుంటాయి.
తమ తల్లిదండ్రుల్ని సొంత నాయనమ్మే విడకొట్టాలని ప్రయత్నిస్తుందంటూ ఇద్దరు అమ్మాయిలు పోలీస్ స్టేషన్ మెట్టెక్కారు. ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఇద్దరు అమ్మాయిలు.. కృష్ణ నగర్‌లో ఉంటున్నారు ఈ అక్కాచెల్లెళ్లు సమ్మక్క, సంధ్య. తమ తండ్రిని, తల్లిని విడగొట్టేందుకు తమ నాయనమ్మ, మేనత్త ప్రయత్నిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు తమ గోడు వెళ్లి బుచ్చి కన్నీరు మున్నీరు అవుతున్నారు. అమ్మను నాయనమ్మ కొడుతుందని, తన తండ్రికి వేరో పెళ్లి చేస్తామని చెప్పి ఇంట్లో నుండి తోసేశారంటూ పేర్కొన్నారు. తమ అమ్మ, నాన్న లేకపోతే తాము ఉండలేమంటూ చెబుతున్నారు. తమను కాపాడండి అంటూ వేడుకుంటున్నారు.
‘మా నాన్నమ్మ, అత్తమ్మలు మా అమ్మను కొట్టి ఇంట్లో నుండి పంపించేందుకు సిద్ధమయ్యారు. మీ నాన్నకు వేరో పెళ్లి చేస్తాం అంటున్నారు. మా నాన్న వచ్చాక..మా అత్తమ్మ కల్లబొల్లి కబుర్లు చెప్పింది. మా పై లేని పోనివి చెప్పడంతో మా నాన్న మమ్మల్ని కూడా ఇంటి నుండి వెళ్లిపోమని అరిచాడు. గొడ్డలి మా అమ్మపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో పోలీస్ స్టేషన్‌కు పరుగులెత్తుకుంటూ వచ్చాం. మా నాన్నను అడుక్కుని తీసుకు వచ్చి పెంచాం. డబ్బులు తీసుకుని వచ్చి ఆయనకే ఇచ్చే వాళ్లం. అలాంటిది మా నాన్న మమ్మల్ని కొడుతున్నాడు. మా అమ్మ, నాన్నలను నాన్నమ్మ, అత్త విడగొడుతున్నారు. కలిసుంటే చాలు విడగొట్టాలనుకుంటారు. మేము పనికి పోయి వచ్చిన తర్వాత హింసిస్తూ ఉంటారు’ అని కన్నీటి పర్యంతం అవతున్నారు.
పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన చిన్నారులు.. పాపం ఎంత కష్టమొచ్చిందో కదూ..
👉 తమ నాయనమ్మ, మేనత్త కలిసిన మా అమ్మ కొడుతూ
తమ తండ్రి ని, తల్లిని విడగొడుతున్నారని సమ్మక్క, సంధ్య
అనే ఇద్దరు అక్కాచెల్లెల్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
👉 జగిత్యాల జిల్లా కేంద్రంలోని కృష్ణ నగర్ లో ఈ… pic.twitter.com/RIC863jCPd— ChotaNews (@ChotaNewsTelugu) April 17, 2024