iDreamPost
android-app
ios-app

పేదింట సరస్వతి జ్యోతులు.. ఒకరికి 4, మరొకరికి 2 ప్రభుత్వ ఉద్యోగాలు

పేదింట్లో పుట్టిన విద్యా కుసుమాలు.. ప్రభుత్వ ఉద్యోగాలు కొల్లగొట్టి.. ఔరా అనిపిస్తున్నారు. ముఖ్యంగా పేదరికంలో పుట్టిన అమ్మాయిలు.. గవర్నమెంట్ కొలువులు సాధించి.. తల్లిదండ్రులతో పాటు.. గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తెస్తున్నారు.

పేదింట్లో పుట్టిన విద్యా కుసుమాలు.. ప్రభుత్వ ఉద్యోగాలు కొల్లగొట్టి.. ఔరా అనిపిస్తున్నారు. ముఖ్యంగా పేదరికంలో పుట్టిన అమ్మాయిలు.. గవర్నమెంట్ కొలువులు సాధించి.. తల్లిదండ్రులతో పాటు.. గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తెస్తున్నారు.

పేదింట సరస్వతి జ్యోతులు.. ఒకరికి 4, మరొకరికి 2 ప్రభుత్వ ఉద్యోగాలు

‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అని నిరూపిస్తున్నారు కొంత మంది యువత. ప్రభుత్వ కొలువులు రావడం లేదని నిరాశ చెంది.. ప్రైవేట్ ఉద్యోగాలకై పరుగులు తీస్తున్న ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. గవర్నమెంట్ జాబ్ కొట్టాలన్న లక్ష్యం వీరిని సక్సెస్ బాట పట్టేలా చేస్తోంది. కొంత మంది ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే.. స్వంతంగా ప్రిపరేషన్ తీసుకుని గవర్నమెంట్ ఉద్యోగాలను కొల్లగొడుతున్నారు. ఇటీవల తెలంగాణ గురుకుల విద్యాలయాల బోర్డు ప్రకటించిన ఫలితాల్లో టీజీడీ, పీజీడీ, డీఎల్‌తో పాటు జూనియర్ లెక్చరర్స్ ఫలితాల్లో పేదింటి కుసుమాలు విజేతలుగా నిలిచారు. ఒక్క ఉద్యోగం కాదూ..మూడు, నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించినవారున్నారు.

ఫుడ్ డెలివరీ బాయ్ గా పార్ట్ టైం పనిచేస్తూ.. పోటీ పరీక్షలకు సిద్దమయ్యాడు బల్వంత్ రావు అనే యువకుడు. అతడి కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఏకంగా.. మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ఉస్మానియా యూనివర్శిటీలో నైట్ వాచ్ మెన్‌గా పనిచేస్తూ.. ప్రవీణ్ అనే యువకుడు.. టీజీటీ, పీజీటీ, జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాలకు అర్హత సాధించాడు. అలాగే పలువురు మహిళలు సైతం ఈ ఉద్యోగాల్లో సత్తా చాటారు.పేదింట్లో పుట్టిన అమ్మాయిలు.. సమస్యలను సోపానాలుగా చేసుకుని విజేతలుగా నిలుస్తున్నారు. రెండు కుటుంబాలకు సరస్వతి పుత్రికలు జ్యోతులుగా నిలిచారు. బోథ్ మండలం సోనాల గ్రామానికి చెందిన బోయిన్ పల్లి రాములు, లక్ష్మి దంపతలు మూడో కుమార్తె జ్యోతి నాలుగు కొలువు సాధించి.. ఔరా అనిపించింది.

జ్యోతి తల్లిదండ్రులు చిన్న దుకాణం నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకు వస్తున్నారు. వారి కష్టాన్ని చూస్తూ పెరిగిన జ్యోతి.. తాను బాగా చదువుకోవాలని అనుకుంది. మంచి ఉద్యోగం సంపాదించి.. తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోవాలని ఆశపడింది. అనుకున్నట్లుగానే సాధించింది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో సత్తా చాటి ఒకేసారి నాలుగు కొలువులు సాదించింది. పదో తరగతి వరకు జడ్పీ హైస్కూల్లో చదివిన జ్యోతి.. ఉస్మానియా యూనివర్శిటీ నుండి ఎంఏ తెలుగు, తెలంగాణ యూనివర్శిటీలో 2021లో బీఈడీ పూర్తి చేసింది. కస్తూర్భా గాంధీ విద్యాలయాల పరిధిలో సీఆర్టీ తెలుగు సబ్జెక్టులో ర్యాంకు సాధించి.. ఉద్యోగం పొందింది.

ఇక మరో జ్యోతి రెండు ఉద్యోగాలను కొల్లగొట్టింది. బోథ్ మండలం పార్టీ బి దేవుల్ నాయక్ తండాకు చెందిన రాథోడ్ భీంరావు, హీరాబాయి దంపతుల కూతురు రాథోడ్ జ్యోతి తొలి ప్రయత్నంలోనే రెండు గవర్నమెంట్ జాబ్స్ సాధించింది. 2019లో తమ్ముడు.. రెండు ప్రభుత్వ ఉద్యోగాలను సాధింగా.. ఇప్పుడు అక్క టీజీటీ, జూనియర్ లెక్చరర్స్ ఉద్యోగాలకు ఎంపికైంది. దీంతో ఆ గ్రామం పేరు వార్తల్లో నిలుస్తోంది. ఈ అక్కా, తమ్ముళ్లు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి.. ఊరికి పేరు తీసుకురావడంతో ఆ గ్రామ ప్రజలు వారిని అభినందనల్లో ముంచెత్తుతున్నారు.