iDreamPost
android-app
ios-app

మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజుల పాటు వైన్స్ బంద్

  • Published Jul 07, 2024 | 11:29 AM Updated Updated Jul 07, 2024 | 11:29 AM

చుక్క లేనిదే రోజు గడవని మందుబాబులకు ఈ మధ్యకాలంలో వరుస షాక్‌ లు తగులుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రతిదానికి మద్యం షాపులు మూసివేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరోమారు మద్యం ప్రియులకు ఏ ఊహించని షాక్‌ తగిలింది. కాగా, మరో రెండు రోజులు మందు షాపులు బంద్‌ చేస్తున్నారు.

చుక్క లేనిదే రోజు గడవని మందుబాబులకు ఈ మధ్యకాలంలో వరుస షాక్‌ లు తగులుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రతిదానికి మద్యం షాపులు మూసివేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరోమారు మద్యం ప్రియులకు ఏ ఊహించని షాక్‌ తగిలింది. కాగా, మరో రెండు రోజులు మందు షాపులు బంద్‌ చేస్తున్నారు.

  • Published Jul 07, 2024 | 11:29 AMUpdated Jul 07, 2024 | 11:29 AM
మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజుల పాటు వైన్స్ బంద్

ఇటీవల కాలంలో మద్యం ప్రియులకు వరుస చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఎందుకంటే.. ఈ మధ్య ఏదో ఒక కారణంతో మద్యం దుకాణాలు బంద్‌ అవుతున్నాయి. అయితే గతంలో మాత్రం స్వాతంత్ర్య దినోత్సవానికి, గణతంత‍్య్ర దినోత్సవానికి, గాంధీ జయంతికి మాత్రమే మద్యం దుకాణాలు మూసివేసేవారు. కానీ, ఇప్పుడు హనుమాన్‌ జయంతికి, ఎన్నికల ముందు, ఫలితా వెలువడే తర్వాత.. ఇలా ప్రతిదానికి మద్యం షాపులు మూసివేయడంతో.. మద్యం ప్రియులకు ఊహించని షాక్‌ తగులుతుంది. ఈమేరకే  తాజాగా నగరంలో మందు  బాబులకు మరో బ్యాడ్‌ న్యూస్‌ అందింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఈరోజుల్లో మద్యం తాగనివారంటూ ఎవరూ ఉండరు. ముఖ్యంగా చాలామంది ప్రతిరోజు దానిని ఒక తీర్ధంలా పుచ్చుకుంటారు. అసలు ఒక్క మాటాలో చెప్పాలంటే.. చుక్క లేనిదో మందుబాబులకు రోజు కూడా గడవదు. అలాంటిది  ఇటీవల కాలంలో వరుసగా మద్యం దుకాణాలు మూసివేయడంతో చాలామంది  మందుబాబులు ముందుగానే అప్రమత్తమై మద్యం షాపుల వద్దకు ఎగబడుతున‍్నారు. మరి, అలాంటి మద్యం ప్రియులకు తాజాగా మరో పిడుగులాంటి వార్త నెత్తిన పడింది. ఎందుకంటే.. హైదరాబాద్ కమిషనరేట్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్యం దుకాణాలు మూసి వేస్తున్నట్లు పోలీసులు మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌ చెప్పారు. ముఖ్యంగా ఎస్ఆర్ నగర్ పీఎస్ లిమిట్స్లో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు క్లోజ్ చేయనున్నట్లు తెలిపారు.

అయితే బల్కంపేట ఎల్లమ్మ మహోత్సవంతో పాటు బోనాల పండుగ నేపథ్యం కారణంగానే ఈ నెల 9వ తేదీన ఉదయం 6 గంటల నుంచి 11వ తేదీ ఉదయం 6 గంటల వరకు అనగా మొత్తం 48 గంటల పాటు వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లు మూసివేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు మద్యం దుకాణాల మూసివేతపై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి శనివారం ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇక ఆ ప్రాంతంలోని   మందుబాబులకు ఈ విషయం తెలిస్తే ముందుగానే ఆ మందు షాపుల వద్ద క్యూ కడతార అనడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ఏదీ ఏమైనా పండుగ మహోత్సవంలో మందు షాపులు మూసివేతపై మద్యం ప్రియులకు ఊహించని షాక్‌ తగిలిందనే చెప్పవచ్చు. మరి, నగరంలోని ఆ ప్రాంతంలో రెండు రోజులు మద‍్యం షాపులు బాంద్‌ పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.