Dharani
Tummala Nageswara Rao-Rythu Runa Mafi, Pass Book: తెలంగాణలో రెండో విడత రైతు రుణమాఫీ ప్రక్రియ మొదలయ్యింది. ఈ క్రమంలో తాజాగా రేవంత్ సర్కార్ కీలక పరకనట చేసింది. ఆ వివరాలు..
Tummala Nageswara Rao-Rythu Runa Mafi, Pass Book: తెలంగాణలో రెండో విడత రైతు రుణమాఫీ ప్రక్రియ మొదలయ్యింది. ఈ క్రమంలో తాజాగా రేవంత్ సర్కార్ కీలక పరకనట చేసింది. ఆ వివరాలు..
Dharani
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల అమలుకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే అనేక హామీలను నెరవేర్చగా.. ఈ నెలలో అతి ప్రధానమైన రైతు రుణమాఫీ అమలుకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. మొత్తం మూడు విడతల్లో రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదటి విడతలో భాగంగా.. లక్ష రూపాయల రుణమాఫీ, రెండో విడతలో భాగంగా లక్షన్నర రూపాయలు, మూడో విడతలో భాగంగా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని.. ఆగస్టు 15 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే రెండు విడతల్లో రుణమాఫీ పూర్తి చేయగా.. మూడో విడత ఆగస్టు నెలలో ఉండనుంది. ఇదిలా ఉండతా.. తాజాగా మంత్రి తుమ్మల రైతు రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు..
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. హామీ ఇచ్చిన మేరకు.. రెండు విడతల్లో కలిపి సుమారు 17.75 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.12,224 కోట్లు రుణమాఫీ నిధులు జమ చేశారు. అయితే అర్హులుగా ఉన్నప్పటికి కొందరికి రుణమాఫీ వర్తించలేదు. ప్రధానంగా పట్టాదారు పాసు పుస్తకం లేని వారికి రుణమాఫీ వర్తించలేదు. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు. అర్హులైన రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకం లేకున్నా రుణమాఫీ వర్తిస్తుందని తెలిపారు.
పాసు పుస్తకం ఉన్నా రుణమాఫీ వర్తించని రైతుల ఆందోళన చెందాల్సిన పని లేదని.. అలాంటి వారి ఇళ్లకు అధికారులే వెళ్లి వివరాలు సేకరించి రుణమాఫీని వర్తింపజేస్తామన్నారు. 2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 9 వరకు వివిధ బ్యాంకుల్లో పంటరుణాలు తీసుకున్న రైతుల వివరాలు తాము ఇప్పటికే తీసుకున్నామని మంత్రి తుమ్మల చెప్పుకొచ్చారు. వాటి ఆధారంగానే ప్రస్తుతం రెండు విడతల్లో రుణమాఫీ చేశామని.. త్వరలో మూడో విడత రుణ మాఫీ కూడా చేస్తామన్నారు.
ఈ సందర్భంగా తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. తెల్ల రేషన్‌కార్డు నిబంధన కుటుంబం నిర్ధారణ కోసం మాత్రమేని.. అది లేకున్నా పంట రుణమాఫీ అవుతుందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంట వేయని భూములకు కూడా రూ.25 వేల కోట్లు మాఫీ చేసిందని ఆరోపించారు. గత అయిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏ పథకాన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం వినియోగించుకోలేదని మండి పడ్డారు. ఇన్‌పుట్ రాయితీ, పంట నష్టపరిహారం ఒక్క పైసా కూడా రైతులకు ఇవ్వలేదని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా.. పంట నష్టానికి ఎకరాకు రూ.పది వేల చొప్పున పరిహారం ఇచ్చామని మంత్రి తుమ్మల చెప్పుకొచ్చారు. పంట వేసిన రైతులకే రైతబంధు ఇవ్వాల్సి ఉన్నా.. గత ప్రభుత్వంలో పంట వేయని వారికి, రియల్ ఎస్టేట్ భూములకు రైతు బంధు నిధులు జమ చేశారన్నారు. తమ ప్రభుత్వం మాత్రం అర్హులకే రైతుభరోసా అందిస్తుందన్నారు. త్వరలోనే ఇది కూడా అమలు చేస్తామని తెలిపారు.