iDreamPost

Free Bus Journey: మహిళలకు బస్సుల్లో ఉచిత జర్నీ.. ఇలా చెయ్యకపోతే రూ.500 ఫైన్ తప్పదు

  • Published Dec 08, 2023 | 12:45 PMUpdated Dec 08, 2023 | 12:45 PM

రేపటి నుంచి అనగా డిసెంబర్ 9 నుంచి రాష్ట్రంలో మహిళలు ఉచిత బస్ జర్నీ అమల్లోకి రానుంది. అయితే ఒక పని చెయ్యకపోతే 500 రూపాయలు ఫైన్ కట్టాల్సి వస్తుంది అంటున్నారు. ఆ వివరాలు..

రేపటి నుంచి అనగా డిసెంబర్ 9 నుంచి రాష్ట్రంలో మహిళలు ఉచిత బస్ జర్నీ అమల్లోకి రానుంది. అయితే ఒక పని చెయ్యకపోతే 500 రూపాయలు ఫైన్ కట్టాల్సి వస్తుంది అంటున్నారు. ఆ వివరాలు..

  • Published Dec 08, 2023 | 12:45 PMUpdated Dec 08, 2023 | 12:45 PM
Free Bus Journey: మహిళలకు బస్సుల్లో ఉచిత జర్నీ.. ఇలా చెయ్యకపోతే రూ.500 ఫైన్ తప్పదు

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 11 మంది మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారం అనంతరం.. ముందుగా ఆరు గ్యారెంటీల మీద తొలి సంతకం చేశారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలుకు సంబంధించి కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.. డిసెంబర్ 9 అనగా శనివారం నుంచి తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం సాగించవచ్చని తెలిపారు శ్రీధర్ బాబు.

సిటీలు, పల్లెలూ అని తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉచిత ప్రయాణం అమల్లోకి వస్తుంది అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మహిళా.. రాష్ట్ర పరిధిలో ఎక్కడ నుంచి, ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు అని వెల్లడించారు శ్రీధర్ బాబు. ఈ నెల 9న కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఈ గ్యారంటీ హామీని అమలు చేస్తున్నారు.

ఆధార్ లేకపోతే.. నో టికెట్

ఆర్టీసీ ఉచిత ప్రయాణంలో భాగంగా.. బస్సు ఎక్కిన మహిళలు కండక్టర్‌కు ఆధార్ కార్డ్ చూపించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్ పథకాన్ని అమలుచేస్తోన్న సంగతి తెలిసిందే. అక్కడి మహిళలు ఆధార్ కార్డ్ చూపించినప్పుడు.. దానిపై ఉన్న నంబర్‌ను కండక్టర్ నమోదు చేసుకొని టికెట్ ఇస్తున్నారు. దానివల్ల కండక్టర్ ఎలాంటి మోసాలకూ పాల్పడే అవకాశం లేకుండా చేసింది కర్ణాటక ప్రభుత్వం.

అలాగే మహిళా ప్రయాణికులకు టికెట్ కూడా ఇస్తున్నారు కాబట్టి.. ఎక్కడైనా టికెట్ చెకింగ్ ఆఫీసర్లు బస్సు ఆపి, చెక్ చేస్తే, అప్పుడు టికెట్ లేని వారికి రూ.500 ఫైన్ వేస్తారు. కనుక మహిళలు ఆధార్ కార్డు లేకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించలేరు.. ఒకవేళ అలా ప్రయాణం చేసినా.. 500 రూపాయలు ఫైన్ కట్టాల్సి వస్తుంది. కనుక మహిళలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేయాలంటే.. ఆధార్ తప్పనిసరి.

ఆర్టీసీలో ఉచిత ప్రయణానికి సంబంధించి.. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కర్ణాటకలో మార్గదర్శకాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. అక్కడ మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అమలు తీరు, సంస్థపై ఆర్థిక ప్రభావం, ప్రభుత్వం నుంచి అందే ఆర్థిక సాయం వంటి వివరాలను అడిగి తెలుసుకునే పనిలో ఉన్నారట అధికారులు. ఈ పథకం అమలుకు సంబంధించి.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు కూడా సీఎం నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశానికి అందుబాటులో ఉండాలని సజ్జనార్‌కు ఇప్పటికే సమాచారం అందిందని చెబుతున్నారు. ఏఏ బస్సుల్లో మహిళలను అనుమతిస్తారు, ప్రయాణ పరిధి ఎంత, ప్రయాణించే వారు ఏఏ గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది వంటి అంశాలపై క్లారిటీ రానుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి