iDreamPost
android-app
ios-app

TSRTC: బస్సులో చిల్లర తీసుకోవటం మర్చిపోయారా.. ఇలా చేస్తే మీ డబ్బులు మీకొచ్చేస్తాయి.

  • Published Apr 20, 2024 | 3:28 PM Updated Updated Apr 20, 2024 | 3:28 PM

బస్సులో చిల్లర మర్చిపోయామంటే.. ఇక అది మన చేతికి రాదు. కానీ ఇకపై అలా జరగదు. మర్చిపోయిన చిల్లర డబ్బులను తిరిగి పొందవచ్చు. ఎలాగంటే..

బస్సులో చిల్లర మర్చిపోయామంటే.. ఇక అది మన చేతికి రాదు. కానీ ఇకపై అలా జరగదు. మర్చిపోయిన చిల్లర డబ్బులను తిరిగి పొందవచ్చు. ఎలాగంటే..

  • Published Apr 20, 2024 | 3:28 PMUpdated Apr 20, 2024 | 3:28 PM
TSRTC: బస్సులో చిల్లర తీసుకోవటం మర్చిపోయారా.. ఇలా చేస్తే మీ డబ్బులు మీకొచ్చేస్తాయి.

సాధారణంగా బస్సు ఎక్కేవారికి ఎదురయ్యే ముఖ్యమైన సమస్య ఏంటి అంటే.. చిల్లర ప్రాబ్లం. ఉదయం పూట ప్రయాణాలు చేసే వారికి అయితే ఇది చాలా పెద్ద సమస్య అని చెప్పవచ్చు. బస్సులు అప్పుడే బయల్దేరతాయి. పెద్దగా రష్‌ ఉండదు.. దాంతో కండక్టర్‌ దగ్గర కూడా చిల్లర ఉండదు. మనం పొద్దున్నే బస్సు ఎక్కి పెద్ద నోట్లు ఇచ్చామంటే.. కండక్టర్‌ మన మీద అరుస్తాడు.. చిల్లర లేకపోతే దిగిపొండి అని కూడా చెప్తాడు. ఇప్పుడంటే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు కాబట్టి.. వారికి ఈ చిల్లర సమస్య ఉండదు. కానీ మగవారి పరిస్థితి.

ఇక రూపాయి, రెండ్రూపాయలు మర్చిపోతే ఒకే.. కానీ కొన్ని సందర్భాల్లో ఇది 100, 500 రూపాయలు ఇలా భారీగా ఉంటుంది. ఇక బస్సు దిగే హడావుడిలో చిల్లర తీసుకోకపోతే.. బాధపడటం తప్ప ఏం చేయలేం.  ఇక ఆ డబ్బులు మనకు రావనే అనుకోవాలి. అయితే ఇకపై ఇలాంటి సమస్య ఉండదు. బస్సులో చిల్లర తీసుకోవడం మర్చిపోయే వారికోసం ఆర్టీసీ ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఆ వివరాలు..

బస్సు దిగే హడావుడిలోనో.. మరే ఇతర కారణాల వల్ల అయినా కానీ మనం చిల్లర మరిచిపోతే ఆ డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు. ఎంత మరిచిపోయినా సరే.. ఆ మొత్తాన్ని టీఎస్ ఆర్టీసీ నుంచి రిటర్న్ తీసుకోవచ్చు. ఇది ఎలా సాధ్యం అంటే.. ఇప్పటి వరకు ఎక్కడైనా ఇలా జరిగిందా అంటే.. జరిగింది. కొన్ని రోజుల క్రితం ఓ ప్రయాణికుడు హైదరాబాద్ హయత్‌నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశాడు.

రూ. 60 టికెట్ కోసం కండక్టర్‌కు రూ. 500 నోటు ఇచ్చాడు. అయితే చిల్లర లేకపోవటంతో కండక్టర్ టికెట్ వెనకాలే మిగిలిన మొత్తాన్ని రాసి ఇచ్చాడు. అయితే ఆ ప్రయాణికుడు మిగతా చిల్లర తీసుకోవటం మరిచిపోయాడు. దాంతో ఈ విషయమై ఆర్టీసీ ఉన్నతాధికారులను సంప్రదించగా.. ఆ డబ్బులు అతడికి తిరిగి ఇచ్చారు. ప్రయాణికుడికి రావాల్సిన మొత్తాన్ని ఫోన్ పే చేశారు. ఇది ఎలా సాధ్యం అయ్యిందంటే.. చిల్లర మరిచిపోయిన సందర్భంలో 040-69440000 నెంబర్‌కు కాల్ చేయాలని.. మీ టికెట్‌పై చిల్లర మరిచిపోయినట్లు తేలితే డబ్బులు వెనక్కి ఇస్తామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

ఆర్టీసీ అధికారుల ప్రకటనతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు ఈ నంబర్‌ గురించి తెలియక.. చాలా డబ్బులు నష్టపోయాం.. కనీసం ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు దీనికి పరిష్కారం చూపారు.. సంతోషం అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ బస్సులకు ఆదాయం విపరీతంగా పెరిగింది. ఇందుకు కారణం మహాలక్ష్మి పథకం. దీని ద్వారా తెలంగాణ మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఫ్రీ జర్నీ అమల్లోకి రావడంతో.. ఆర్టీసీలో ప్రయాణించే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. ఇక మహిళా ప్రయాణికుల రద్దీ పెరగడంతో.. బస్సుల్లో మగవారికి సీట్లే ఉండటం లేదు. ఈ సమస్యను పరిష్కరించడం కోసం ఆర్టీసీ.. కొత్త బస్సులను వినియోగంలోకి తెచ్చేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే.