Dharani
తెలంగాణ మహిళలకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుభవార్త చెప్పారు. పండుగ రద్దీ నేపథ్యంలో కూడా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీనిపై మహిళా ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు..
తెలంగాణ మహిళలకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుభవార్త చెప్పారు. పండుగ రద్దీ నేపథ్యంలో కూడా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీనిపై మహిళా ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు..
Dharani
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రాష్ట్రంలోని మహిళలందరికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తోన్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 9 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం అమల్లోకి వచ్చింది. మొదటి రోజు నుంచే ఈ పథకానికి భారీ ఎత్తున స్పందన లభిస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగినట్లు.. ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ పథకం కింద.. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో.. రాష్ట్రంలో ఏ మూల నుంచి ఎక్కడి వరకైనా.. ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.
అయితే డీలక్స్, సూపర్ డీలక్స్ బస్సులో ప్రయాణం చేయాలనుకుంటే.. కచ్చితంగా టికెట్లు తీసుకోవాల్సిందే. ఇదిలా ఉండగా సంక్రాంతి పండుగ సందర్భంగా టీఎస్ఆర్టీసీ.. రద్దీని తట్టుకునేలా వేల సంఖ్యలో ప్రత్యేక బస్సులను నడిపేందుకు రెడీ అవుతోంది. పండుగ రద్దీని తట్టుకునేందుకు గాను.. అదనంగా 4,484 బస్సులు నడపాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. గతేడాది నడిపిన ప్రత్యేక బస్సుల సంఖ్య కంటే ఈ సారి దాదాపు 200 అదనం అని తెలిపారు. ఈ ప్రత్యేక బస్సుల్లో తెలంగాణ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు 600 బస్సులను నడపనున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక బస్సుల నిర్వహణ, ‘మహాలక్ష్మి’రద్దీని తట్టుకునే చర్యలపై చర్చించారు. సంక్రాంతి సందర్భంగా ఎంజీబీఎస్, జేబీఎస్, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి, ఉప్పల్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్ ప్రాంతాలలో ప్రత్యేక బస్సులు పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉంటున్నందున ఆయా ప్రాంతాలకు సిటీ బస్సులను కూడా అదనంగా తిప్పాలని నిర్ణయించారు.
ఈ ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని, సాధారణ టికెట్ చార్జీలే వర్తిస్తాయని ఆయన తెలిపారు. ఈ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని వెల్లడించారు. సంక్రాంతికి నడిపే ప్రత్యేక పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ , సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
పండగ రద్దీ నేపథ్యంలో.. ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో షెల్టర్ల షామియానాలు, మంచినీటి వసతి, కుర్చీలను సిద్ధం చేయాలని సూచించారు. ప్రయాణికుల సందేహాలను తీర్చే ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అంతేకాక రద్దీ ప్రాంతంలో ఇద్దరు డీవీఎం ర్యాంక్ అధికారులను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు.