Dharani
మంత్రి సీతక్క స్వగ్రామానికి ఎట్టకేలకు ఆర్టీసీ అధికారులు బస్ సౌకర్యాన్ని కల్పించబోతున్నారు. ఈ విషయం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆ వివరాలు..
మంత్రి సీతక్క స్వగ్రామానికి ఎట్టకేలకు ఆర్టీసీ అధికారులు బస్ సౌకర్యాన్ని కల్పించబోతున్నారు. ఈ విషయం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆ వివరాలు..
Dharani
మనదేశంలో నేటికి కూడా సరైన రవాణా సౌకర్యాలు, విద్యుత్ లేని గ్రామాలు అనేకం ఉన్నాయి అంటే పరిస్థితులు ఉలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అందులోనూ ఉన్నాతాధికారులు, ప్రజా ప్రతినిధులకు చెందిన సొంత గ్రామాలు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యం అనిపించమానదు. తాజాగా అలాంటి వార్త ఒకటి వెలుగు చూసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కొత్త ప్రభుత్వంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇలా ఉండగా ఓ వార్త అందరిని ఆశ్చర్యపరుస్తోంది. మంత్రి సీతక్క స్వగ్రామానికి ఇప్పటికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించారు అధికారులు. ఆ వివరాలు..
మంత్రి సీతక్క స్వగ్రామమైన ములుగు జిల్లాలోని జగ్గన్నపేటకు ఎట్టకేలకు ఆర్టీసీ బస్సు రానుంది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు బుధవారం ఆ మార్గంలో సర్వే చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి స్వగ్రామానికి రోడ్డు మార్గం ఉన్నా ఆర్టీసీ బస్సులు నడవటం లేదంటూ కొన్ని పత్రికల్లో.. వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన రోడ్డు రవాణా శాఖ అధికారులు.. మంత్రి స్వగ్రామంలో రూట్ సర్వే చేశారు.
ఈ విషయంపై వరంగల్-2 డిపో మేనేజర్ సురేశ్ మాట్లాడుతూ.. మంత్రి సీతక్క స్వగ్రామం.. జగ్గన్నపేట మార్గంలో బస్సు సౌకర్యం కల్పించేందుకు సర్వే చేశామని తెలిపారు. త్వరలో ఈ రూట్ లో బస్సు నడిపిస్తామని వెల్లడించారు. పత్తిపల్లి-పొట్లాపూర్ మార్గంలో బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. త్వరలోనే ఈ మార్గంలో బస్ నడుస్తుందని తెలిపారు.
ఈ వార్త తెలిసిన వారు.. ఇప్పుడంటే సీతక్క మంత్రిగా ఉన్నారు.. వారి పార్టీ అధికారంలోకి ఉంది. కానీ గతంలో కూడా ఆమె ఎమ్మేల్యేగా ఉన్నారు కదా.. మరి అప్పుడు అధికారులు స్పందించలేదా.. అధికారంలో ఉన్న వారికి మాత్రమే పనులు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎట్టకేలకు తమ గ్రామానికి బస్సు సౌకర్యం రానుండటంతో.. జగ్గన్నపేట గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రభుత్వం కల్పిస్తోన్న ఆర్టీసీ ఫ్రీ జర్నీ.. ఇక తమ కూడా అందుబాటులోకి వస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి మంచి స్పందన లభిస్తోంది. దీనిపై మహిళా లోకం హర్షం వ్యక్తం చేయగా.. ఆటో డ్రైవర్లు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఉచిత జర్నీ వల్ల తమ ఆదాయం తగ్గుతుందని.. తమని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.