iDreamPost
android-app
ios-app

TSRTC: ప్రయాణీకులకు సజ్జనార్ మరో గుడ్ న్యూస్.. త్వరలోనే

  • Published Dec 22, 2023 | 9:35 PM Updated Updated Dec 22, 2023 | 9:35 PM

తెలంగాణలో RTC ప్రయాణీకులకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. మరి ప్రయాణీకులకు ఆర్టీసీ చెప్పిన ఆ శుభవార్త ఏంటో ఇప్పుడు చూద్దాం.

తెలంగాణలో RTC ప్రయాణీకులకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. మరి ప్రయాణీకులకు ఆర్టీసీ చెప్పిన ఆ శుభవార్త ఏంటో ఇప్పుడు చూద్దాం.

TSRTC: ప్రయాణీకులకు సజ్జనార్ మరో గుడ్ న్యూస్.. త్వరలోనే

తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఆర్టీసీ ప్రయాణీకులకు గుడ్ న్యూస్ ల మీద గుడ్ న్యూస్ లు చెబుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం కింద రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్న విషయం తెలిసిందే. కాగా.. తాజాగా రాష్ట్రంలోని ఆర్టీసీ ప్రయాణీకులకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ శుభవార్త చెప్పారు. ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించేందుకు టీఎస్ఆర్టీసీ నిరంతరం శ్రమిస్తుందని సజ్జనార్ తెలిపారు. మరి ప్రయాణీకులకు ఆర్టీసీ చెప్పిన ఆ గుడ్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

తెలంగాణలో RTC ప్రయాణీకులకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రయాణీకుల సౌక్యం కోసం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని 200 నూతన డీజిల్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నామని ట్విట్టర్ ద్వారా తెలిపారు. కాగా వీటిల్లో 50 బస్సులను వారం రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సజ్జనార్ వివరించారు. ఈ క్రమంలోనే శుక్రవారం హైదరాబాద్ లోని బస్ భవన్ ప్రాంగణంలో కొత్త లహరి స్లీపర్ కమ్ సీటర్, రాజధాని ఎక్స్ ప్రెస్ బస్సులను సజ్జనార్ పరిశీలించారు. ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి కొత్త బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించినట్లు తెలిపారు.

అందులో భాగంగా నాలుగైదు నెలల్లో 2 వేలకు పైగా కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. వీటిల్లో 400 ఎక్స్ ప్రెస్ లు, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక ఎలక్ట్రిక్ బస్సుల విషయానికి వస్తే.. హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాల్లో 500 బస్సులను వాడకంలోకి యాజమాన్యం తేనుంది. ఈ బస్సులన్నింటినీ వచ్చే సంవత్సరం మార్చి చివరి నాటికి అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందించామని ఎండీ వీసీ సజ్జనార్ వివరించారు. మరి ఆర్టీసీ చెప్పిన మరో గుడ్ న్యూస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.